స్పోర్ట్స్

Trending:


IPL 2025 | టాస్ గెలుపొందిన ముంబై.. స‌న్‌రైజ‌ర్స్ టాపార్డ‌ర్ మ‌ళ్లీ చెల‌రేగేనా..?

IPL 2025 : ఐపీఎల్‌లో 18వ ఎడిష‌న్‌లో మ‌రో కీల‌క మ్యాచ్. పంజాబ్ కింగ్స్‌పై రికార్డు ల‌క్ష్యాన్ని ఛేదించిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(SRH) వాంఖ‌డేలో ముంబై ఇండియ‌న్స్‌(Mumbai Indians)ను ఢీకొంటోంది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచాడు.


IPL 2025 | స‌న్‌రైజ‌ర్స్‌కు షాకిచ్చిన ముంబై.. పాండ్యా సేన ఖాతాలో మూడో విజ‌యం

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(SRH) నిల‌క‌డ‌లేమితో భారీ మూల్యం చెల్లించుకుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిల‌వాలంటే గెల‌వ‌క త‌ప్ప‌ని మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫ‌ల‌మై ముంబై ఇండియ‌న్స్ చేతిలో ఓడిపోయింది.


IPL | ‘సైజు’ ముఖ్యం గురూ.. బ్యాట్లను తనిఖీ చేస్తున్న అంపైర్లు!

ఐపీఎల్‌-18లో గత నాలుగైదు మ్యాచ్‌ల నుంచి ఎవరైనా బ్యాటర్‌ క్రీజులోకి రాగానే అంపైర్లు వారి బ్యాట్లను తనిఖీ చేస్తున్న దృశ్యాలపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ నడుస్తున్నది.


Match Fixing | ఐపీఎల్‌లో హైదరాబాదీ ఫిక్సింగ్‌ కలకలం!.. అప్రమత్తమైన బీసీసీఐ!

ఐపీఎల్‌లో హైదరాబాదీ ఫిక్సింగ్‌ కలకలం రేపింది. సాఫీగా సాగుతున్న లీగ్‌లో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది.


IPL 2025 | ఛేద‌న‌లో ముంబైకి బిగ్ షాక్.. హిట్‌మ్యాన్ ఔట్

IPL 2025 : సొంత‌మైదానంలో 163 ప‌రుగుల‌ ఛేద‌న‌లో ముంబై ఇండియ‌న్స్‌కు పెద్ద షాక్. సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డుతున్న‌ ఓపెన‌ర్ రోహిత్ శర్మ‌(26) ఔట‌య్యాడు. ట్రావిస్ హెడ్ చేతుల్లోకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.


శ్రీజ, మనిక నిష్క్రమణ

ఐటీటీఎఫ్‌ ప్రపంచకప్‌లో భారత స్టార్‌ ప్యాడ్లర్లు ఆకుల శ్రీజ, మనికా బాత్రా పోరాటం ముగిసింది. తొలి రౌండ్‌లో అలవోక విజయాలు సాధించిన ఈ ఇద్దరూ రెండో మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేయడంతో భారత్‌కు నిరాశే ఎదురైంది.


స్టబ్స్ సూపర్ సిక్స్, స్టార్క్ సూపర్ బౌలింగ్.. సూపర్ ఓవర్‌లో రాజస్థాన్‌పై ఢిల్లీ గెలుపు

DC Vs RR Highlights: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్‌లో నమోదైన తొలి సూపర్ ఓవర్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టును ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించింది. తొలుత ఇరు జట్లూ 188 పరుగులు చేయడంతో సూపర్ ఓవర్‌ అనివార్యమైంది. అయితే సూపర్ ఓవర్‌లో రాజస్థాన్ రాయల్స్.. డీసీ ముందు 12 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. కానీ నాలుగు బంతుల్లోనే ఢిల్లీ క్యాపిటల్స్‌ ఛేజ్‌ను పూర్తి చేసింది. టోర్నీలో ఐదో విజయాన్ని నమోదు చేసింది.


IPL 2025 | ఐపీఎల్ థీమ్‌తో వివాదాస్ప‌ద‌ యాడ్.. ‘ఉబెర్‌’ను హైకోర్టుకు ఈడ్చిన‌ ఆర్సీబీ

ipl 2025 : రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఫ్రాంచైజీ అనూహ్యంగా హైకోర్టును ఆశ్ర‌యించింది. ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌మ జ‌ట్టును అవ‌మాన‌ప‌రిచే యాడ్‌ను రూపొందించిన‌ 'ఉబెర్' (Uber) కంపెనీపై కేసు న‌మోదు చేసింది. ఇంత‌కూ ఆ యాడ్‌లో ఏముందంటే..?


Munaf Patel: ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌలింగ్ కోచ్‌కు జ‌రిమాన.. కార‌ణం ఏంటంటే

Munaf Patel : బౌండ‌రీ వ‌ద్ద ఫోర్త్ అంపైర్‌తో డీసీ బౌలింగ్ కోచ్ వాగ్వాదానికి దిగాడు. రిజ‌ర్వ్ ప్లేయ‌ర్‌ను మైదానంలోకి వెళ్ల‌నీయ‌కుండా అడ్డుకున్న స‌మ‌యంలో.. ఆ ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో మునాఫ్ ప‌టేల్‌కు 25 శాతం ఫైన్ వేశారు.


గ్లెన్ ఫిలిప్స్ ప్లేసులో శ్రీలంక కెప్టెన్.. గుజరాత్ టైటాన్స్ ప్లాన్ మామూలుగా లేదుగా..!

గాయంతో ఐపీఎల్ 2025 మొత్తానికి దూరమైన గుజరాత్ టైటాన్స్ ప్లేయర్, న్యూజిలాండ్ క్రికెటర్ గ్లెన్ ఫిలిప్స్ ప్లేసును ఆ జట్టు భర్తీ చేసింది. శ్రీలంక పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ దసున్ శనకను జట్టులోకి తీసుకుంది. రూ.75 లక్షల కనీస ధరతో అతడి తిరిగి జట్టులోకి చేర్చుకుంది. 2023 ఐపీఎల్ సీజన్‌లోనూ శనక.. గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలోకి దిగాడు. శనక.. ఐపీఎల్ రీఎంట్రీని.. ఐపీఎల్ పాలక మండలి ధ్రువీకరించింది.


Rohit Sharma | జస్ప్రీత్‌ బుమ్రా, షమీ గురించే నా ఆందోళన.. ఐపీఎల్‌లో పనిభారంపై రోహిత్‌ శర్మ ఏమన్నాడంటే..?

Rohit Sharma | ఐపీఎల్‌ ముగిసిన తర్వాత టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటించనున్నది. జూన్‌ నుంచి ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనున్నది. ఆ తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్తుంది. వన్డే, టీ20 సిరీస్‌లో ఆడుతుంది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భారత బౌలర్ల పనిభారంపై ఆందోళన వ్యక్తం చేశాడు.


సురుచి స్వర్ణ గురి

భారత యువ షూటర్‌ ఇందర్‌సింగ్‌ సురుచి ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో పసిడి పంట పండిస్తున్నది. ఇటీవలే బ్యూనస్‌ ఎయిర్స్‌(అర్జెంటీనా) వేదికగా ముగిసిన ప్రపంచకప్‌లో స్వర్ణంతో పాటు కాంస్యం నెగ్గిన ఈ 18 ఏండ్ల ఝజ్జర్‌ (హర్యానా) అమ్మాయి.. మంగళవారం నుంచి లిమాలో మొదలైన టోర్నీలోనూ పసిడితో మెరిసింది.


300 కొట్టండి చూద్దాం.. సన్‌రైజర్స్‌కు బ్యాటింగ్ అప్పగించిన హార్దిక్ పాండ్యా

ఐపీఎల్ 2025లో సన్‌ రైజర్స్ హైదరాబాద్‌, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ముంబై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ టీమ్‌ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో సన్‌రైజర్స్ ఫస్టు బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఇక చివరగా ఆడిన తమ తమ మ్యాచ్‌లలో ఇరు జట్లూ కూడా విజయం సాధించింది. దీంతో తుది జట్టులో ఎలాంటి మార్పుల్లేకుండానే ఈ మ్యాచ్‌ బరిలోకి దిగాయి.


IPL 2025 | ఐపీఎల్ చ‌రిత్ర‌లో సుదీర్ఘ ఓవ‌ర్.. సీనియ‌ర్ పేస‌ర్ చెత్త రికార్డు

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో సీనియ‌ర్ పేస‌ర్ సందీప్ శ‌ర్మ(Sandeep Sharma) చెత్త రికార్డు మూట‌గట్టుకున్నాడు. సుదీర్ఘ ఓవ‌ర్ వేసిన నాలుగో బౌల‌ర్‌గా రికార్డు నెల‌కొల్పాడు.


SRHపై బుమ్రా గురి కుదురుతుందా? కమ్ బ్యాక్ ఇస్తాడా..!

ఐపీఎల్ 2025లోకి లేట్‌గా ఎంట్రీ ఇచ్చిన బుమ్రా పెద్దగా రాణించలేకపోతున్నాడు. వాంఖడే వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌తో ఈ సీజన్‌లో అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయినా బుమ్రా.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇవాళ సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో అయినా బుమ్రా ఫామ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇరు జట్లకు కీలకమైన ఈ మ్యాచ్‌లో బుమ్రా ఎలా రాణిస్తాడు అనేదే అందరిలో ఆసక్తిగా మారింది.


MI vs SRH: మళ్లీ ఓడిన సన్‌రైజర్స్‌.. కావ్య మారన్‌ బాధ అంతాఇంతా కాదయ్య

Kavya Maran Shocked Sunrisers Hyderabad Losses Another Match: పంజాబ్‌ కింగ్స్‌పై భారీ స్కోర్‌ను ఛేదించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తర్వాత జరిగిన మ్యాచ్‌లో తుస్సుమంది. సమష్టి వైఫల్యంతో ముంబై ఇండియన్స్‌ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొని ఐపీఎల్‌ తన భవిష్యత్‌ను క్లిష్టతరం చేసుకుంది.


BCCI | బీసీసీఐ షాకింగ్‌ నిర్ణయం..! అభిషేక్‌ నాయర్‌, దిలీప్‌పై బీసీసీఐ వేటు..?

BCCI | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నది. అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌ను తప్పించింది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో టీమిండియా ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.


IPL 2025 | సొంత మైదానంలో రోహిత్‌కు ప్ర‌త్యేక జ్జాపిక‌.. కార‌ణ‌మిదే..!

IPL 2025 : భార‌త కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) సొంత మైదానంలో మ‌ర్చిపోలేని బ‌హుమ‌తి అందుకున్నాడు. త‌న అడ్డా అయిన‌ వాంఖ‌డేలో బీసీసీఐ అధ్య‌క్షుడు రోజ‌ర్ బిన్ని(Roger Binni) చేతుల మీదుగా ప్ర‌త్యేక జ్ఞాపికను స్వీక‌రించాడు


Rohit Sharma | వన్డే క్రికెట్‌ భవితవ్యంపై రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు..!

Rohit Sharma | ప్రస్తుతం టీ20 క్రికెట్‌ ఆదరణ పెరుగుతున్నది. ఈ క్రమంలో వన్డే క్రికెట్‌ భవితవ్యంపై రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ క్లార్క్‌తో కలిసి నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో రోహిత్‌ శర్మ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో భారత జట్టు ఎదుర్కొన్న సవాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


చక్ దే ఇండియా నటి సాగరికతో జహీర్ ఖాన్ ప్రేమ.. పెళ్లైన 8 ఏళ్లకు ప్రమోషన్, ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ

టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ గుడ్‌న్యూస్ చెప్పాడు. పెళ్లయిన ఎనిమిదేళ్లకు తమ జీవితంలోకి మరో వ్యక్తి చేరాడని ప్రకటించాడు. ఈ మేరకు బుధవారం జహీర్ ఖాన్, సాగరిక ఘట్కే దంపతులు తమకు కుమారుడు పుట్టినట్లు వెల్లడించారు. దీనిపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. కొడుకు ఫొటోను సైతం పంచుకున్నారు. అతడి పేరును సైతం ఈ సందర్భంగా రివీల్ చేశారు.


VVS Laxman | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌

VVS Laxman | కలియుగదైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని భారత మాజీ క్రికెటర్‌, నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ ప్రధాన కోచ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ (VVS Laxman) దర్శించుకున్నారు.


575 బంతుల్లో 1000 రన్స్.. ఐపీఎల్‌లో ‘హెడ్‌’మాస్టర్ అరుదైన ఫీట్‌..!

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ ఐపీఎల్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ రికార్డును తనఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా ఈ ఫీట్ (బంతుల పరంగా) సాధించిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. హెడ్.. 575 బంతుల్లో నాలుగంకెల స్కోరు అందుకున్నాడు. ఈ జాబితాలో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ అగ్రస్థానంలో ఉన్నాడు.


IPL 2025 Updates: భయంకరుడిని బరిలోకి దింపుతున్న పంత్ సేన.. లక్నో టీమ్‌తో చేరిన ఆ స్పీడ్ స్టార్

Mayank Yadav Re Entry: లక్నో సూపర్ జెయింట్స్‌తో స్పీడ్ స్టార్ మయాంక్ యాదవ్ చేరాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న మయాంక్.. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. మయాంక్ పురాగమనానికి సంబంధించి లక్నో టీమ్ ఓ వీడియోను రిలీజ్ చేసింది.


DC Vs RR | రాజస్థాన్‌ రాయల్స్‌ టార్గెట్‌ 189 పరుగులు..

DC Vs RR | రాజస్థాన్‌ రాయల్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ 189 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడిపోయి మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లకు ఐదు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఢిల్లీ తరపున ఏ బ్యాట్స్‌మెన్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు.


నాయర్‌పై వేటు

అనుకున్నదే జరిగింది! నిరుడు స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో అవమానకర ఓటమితో పాటు బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ (ఆస్ట్రేలియాతో)లో టీమ్‌ఇండియా వైఫల్య ప్రదర్శన తర్వాత హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ కోచింగ్‌ బృందంపై వేటు తప్పకపోవచ్చునన్న పుకార్లను బీసీసీఐ నిజం చేసింది. గంభీర్‌ బృందంలో కీలకసభ్యుడిగా ఉన్న అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌పై వేటు వేసింది.


IPL 2025 | రెండు వికెట్లు కోల్పోయిన స‌న్‌రైజ‌ర్స్.. 9 ఓవ‌ర్ల‌కు స్కోర్..?

IPL 2025 : వాంఖ‌డేలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ రెండు కీల‌క వికెట్లు కోల్పోయింది. హాష్ సెంచ‌రీకి చేరువైన ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌(40) ఔట‌య్యాడు. ఆ కాసేప‌టికే డేంజ‌ర‌స్ ఇషాన్ కిష‌న్(2) స్టంపౌట్ అయ్యాడు.


DC Vs RR | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌.. టాస్‌ గెలిచిన రాజస్థాన్‌.. ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేయనున్న ఢిల్లీ క్యాపిటల్స్‌

DC Vs RR | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో భాగంగా బుధవారం ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మరికొద్ది సేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానున్నది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ మొదట బ్యాటింగ్‌ చేయనున్నది.


అభిషేక్ శర్మ జేబులు చెక్ చేసిన సూర్యకుమార్ యాదవ్.. ఏమైనా ఉందా!

ముంబై ఇండియన్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఆడుతున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ వచ్చి అతని జేబులు చెక్ చేశాడు. రెండు జేబుల్లో చేతులు పెట్టి మరీ చూశాడు. జేబుల్లో ఏం లేకపోయేటప్పటికీ హమ్మయ్యా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సూర్యకుమార్ యాదవ్ చేసిన పనికి అభిషేక్‌తో పాటు కామెంటేటర్లు, మ్యాచ్ వీక్షిస్తున్న ప్రేక్షకులు అందరూ ఒక్కసారిగా ఫక్కున నవ్వారు.


కాటేరమ్మ కొడుకులకు ఏమైంది? ముంబై దెబ్బకు తేలిపోయిన SRH బ్యాటర్లు!

ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ 162/5 పరుగులకు పరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ బ్యాటర్లు.. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి కట్టడి చేశారు. విధ్వంసకర ఓపెనర్లుగా పేరు గాంచిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు సుమారు 10 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా.. పెద్దగా స్కోరు చేయలేకపోయారు.


BCCI | కుర్రాళ్ల‌కు భ‌లే ఛాన్స్.. ఆ ముగ్గురికి సెంట్ర‌ల్ కాంట్రాక్ట్

గ‌త సీజ‌న్ నుంచి నిల‌క‌డ‌గా రాణిస్తున్న కుర్రాళ్ల‌కు వార్షిక కాంట్రాక్టు అప్ప‌గించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. వీళ్ల‌లో ఇద్ద‌రు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(IPL) 18వ సీజ‌న్‌లో అద‌ర‌గొడుతున్నారు. ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో సూపర్ సెంచ‌రీతో మెరిసిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) కూడా బీసీసీఐ పెద్ద‌ల దృష్టిలో ఉన్నాడ‌ని స‌మాచారం.


దటీజ్ ధోనీ.. వీల్‌ఛైర్‌లో ఉన్న మహిళ అభిమానిని కుషీ చేసిన మహీ..!

మహేంద్ర సింగ్ ధోనీ.. మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. అభిమానుల కోసం ఏమైనా చేసే మహీ.. వీల్ చైర్‌లో ఉండి సెల్ఫీ అడిగిన మహిళా అభిమాని కోరిక నెరవేర్చాడు. ఎయిర్‌పోర్ట్‌ నడుచుకుంటూ వెళ్తుండగా ఆమెను గమనించిన ధోనీ.. ఆమె దగ్గరకు వెళ్లి స్వయంగా సెల్ఫీ తీసి ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ధోనీ ఫ్యాన్స్ వైరల్‌ చేస్తున్నారు.


ఢిల్లీ బౌలింగ్‌ కోచ్‌కు జరిమానా

అత్యంత ఉత్కంఠ నడుమ జరిగిన రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ సూపర్‌ ఓవర్‌ తర్వాత ఢిల్లీ బౌలింగ్‌ కోచ్‌ మునాఫ్‌ పటేల్‌కు బీసీసీఐ షాకిచ్చింది. అతడి మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధించింది. మునాఫ్‌పై జరిమానా ఎందుకు వేసిందన్న విషయాన్ని బీసీసీఐ స్పష్టంగా వెల్లడించకపోయినప్పటికీ మ్యాచ్‌ సందర్భంగా అతడు ఫోర్త్‌ అంపైర్‌తో వాగ్వాదానికి దిగినందుకే జరిమానా పడినట్టు తెలుస్తున్నది.


IPL | సన్‌రైజర్స్‌కు ఐదో ఓటమి.. క్రమంగా పుంజుకుంటున్న ముంబై ఇండియన్స్‌

సీజన్‌ ఆరంభంలో వరుస ఓటములతో సతమతమైన ముంబై ఇండియన్స్‌ క్రమంగా పుంజుకుంటున్నది. ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్‌తో అనూహ్య విజయం సాధించిన ఆ జట్టు.. గురువారం సొంత వేదికపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌)నూ చిత్తు చేసింది. వాంఖడేలో జరిగిన పోరులో హైదరాబాద్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఈ సీజన్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది.


IPL 2025 | ఐపీఎల్‌లో వెయ్యి ప‌రుగులు.. రెండో బ్యాట‌ర్‌గా హెడ్ రికార్డు

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో చెల‌రేగి ఆడుతున్న‌ స‌న్‌రైజ‌ర్స్ ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్(Travis Head) రికార్డు నెల‌కొల్పాడు. ఈ ఎడిష‌న్‌లో అత్యంత వేగంగా వెయ్యి ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు.


బ్యాట్ పట్టిన పోలార్డ్.. కొంపదీసి సన్‌రైజర్స్‌పై ఆడతాడా ఏందీ!

ఐపీఎల్‌కు ఎప్పుడో గుడ్ బై చెప్పిన కీరన్ పోలార్డ్ మళ్లీ బ్యాట్ పట్టుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కి ముందు వాంఖడేలో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. భారీ భారీ షాట్లతో సిక్సర్ల మోత మోగించాడు. పోలార్డ్‌ను చూసిన ఫ్యాన్స్ కొంపదీసి సన్‌రైజర్స్‌పై కానీ బ్యాటింగ్‌కి దిగడు కదా అనుకున్నారు. ఐపీఎల్ 2010 నుంచి ఐపీఎల్ 2022 వరకు ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన పోలార్డ్.. ప్రస్తుతం ముంబై ఫ్రాంఛైజీ బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.


మొన్న ధోనీ ఫినిషింగ్.. నిన్న పంజాబ్ థ్రిల్లింగ్ విన్.. ఇవాళ సూపర్ ఓవర్! ఐపీఎల్ మజా వచ్చేసింది!

స్తబ్దుగా సాగుతున్న ఐపీఎల్ 2025లో వరుసగా మూడు రోజుల నుంచి జరుగుతున్న మ్యాచ్‌లు కాస్తంత జోష్ నింపాయి. చెన్నై, ముంబై, హైదరాబాద్ లాంటి టీమ్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున పడి ఉండటంతో ఫ్యాన్స్ అసహనంతో రగిలిపోయారు. కానీ మొన్నటి నుంచి థ్రిల్లింగ్ మ్యాచ్‌లతో ఫ్యాన్స్ ఆసక్తి మరింత పెరిగింది. లక్నోపై ధోనీ ఫినిషింగ్‌తో సీఎస్కే గెలవడం, కోల్‌కతాపై లో స్కోరింగ్ మ్యాచ్‌లో పంజాబ్ విక్టరీ, సూపర్ ఓవర్‌లో రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం ఫ్యాన్స్‌కు కిక్కెక్కిచ్చాయి.


భారత్‌కు కాంస్యాలు

సౌదీ అరేబియా వేదికగా జరుగుతున్న ఏషియన్‌ అండర్‌-18 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత పతక జోరు కొనసాగుతున్నది. పోటీలకు మూడో రోజైన గురువారం భారత ఖాతాలో మరో రెండు కాంస్య పతకాలు చేరాయి.


IPL 2025 | ఆదుకున్న అభిషేక్, క్లాసెన్.. స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ముంబై ఛేదించేనా..?

IPL 2025 : ఐపీఎల్ చ‌రిత్ర‌లో రెండో అత్య‌ధిక ఛేద‌న‌తో రికార్డు నెల‌కొల్పిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాట‌ర్లు త‌డ‌బ‌డ్డారు. వాంఖ‌డేలో ముంబై ఇండియ‌న్స్ బౌల‌ర్ల ధాటికి స్వ‌ల్ప స్కోర్‌కే ప‌రిమిత‌మైంది.


IPLలో నాలుగేళ్ల తర్వాత సూపర్ ఓవర్.. థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఏం కిక్కు ఉందిరా!

ఐపీఎల్‌‌లో సూపర్ ఓవర్ చూడాలని ప్రేక్షకులు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే నాలుగేళ్లుగా మిగిలిపోయిన ఐపీఎల్ ఫ్యాన్స్ కల ఢిల్లీ - రాజస్థాన్ మ్యాచ్‌తో నెరవేరింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 188 పరుగులు చేయగా, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 188 పరుగులు చేసింది. దాంతో ఆసక్తికరంగా సాగిన సూపర్ ఓవర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది.


ప్రపంచ బిలియర్డ్స్‌ చాంప్‌ సౌరవ్‌

ఐర్లాండ్‌ వేదికగా జరిగిన ఐబీఎస్‌ఎఫ్‌ ప్రపంచ బిలియర్డ్స్‌ టోర్నీలో భారత స్టార్‌ క్యూయిస్టు సౌరవ్‌ కొతారీ చాంపియన్‌గా నిలిచాడు. గురువారం జరిగిన ఫైనల్లో సౌరవ్‌ 725-480 పాయింట్ల తేడాతో ఏస్‌ క్యూయిస్టు పంకజ్‌ అద్వానీపై అద్భుత విజయం సాధించాడు. ఇటీవలి చాంపియన్‌షిప్‌ చరిత్రను పరిశీలిస్తే..ఏకంగా 325 పాయింట్లతో సౌరవ్‌ అద్భుతమైన బ్రేక్‌ సాధించాడు.


IPL 2025 | అదొక్క‌టి జ‌రిగింద‌నుకో.. ఐపీఎల్‌లో 300 కొట్టేస్తాం.. !

IPL 2025 : ఐపీఎల్‌లో రికార్డ్ బ్రేక‌ర్ అన‌గానే అంద‌రికీ గుర్తుకొచ్చే పేరు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్. త‌మ‌దైన రోజున ప్రత్య‌ర్థి బౌల‌ర్ల‌ను ఊచకోత కోసే స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్లు.. ఆఖరి ఓవ‌ర్లలోనూ విధ్వంసాన్ని కొన‌సాగిస్తే 300 కొట్ట‌డం ఖాయం అంటున్నాడు ఇషాన్ కిష‌న్.


విజయంతో ఆరంభం

డబుల్‌ ఒలింపిక్‌ మెడలిస్ట్‌ నీరజ్‌ చోప్రా 2025 సీజన్‌ను గెలుపు త్రో తో ఆరంభించాడు. దక్షిణాఫ్రికాలోని పోచెఫ్‌స్ట్రొమ్‌లో జరుగుతున్న వరల్డ్‌ అథ్లెటిక్స్‌ కాంటినెంటల్‌ టూర్‌ చాలెంజర్‌ ఈవెంట్‌లో భాగంగా బుధవారం జరిగిన జావెలిన్‌ త్రో ఫైనల్‌లో నీరజ్‌.. 84.52 మీటర్ల త్రో తో మొదటి స్థానంలో నిలిచాడు.


సన్‌రైజర్స్ జోరు ఒక్క మ్యాచ్‌కే పరిమితం.. ముంబై చేతిలో చిత్తు..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో ఓటమిని చవిచూసింది. గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్.. 162/5 పరుగులకే పరిమితమైంది. అనంతరం ముంబై.. 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.


క్వార్టర్స్‌లో బోపన్న జోడీ

ఏటీపీ-500 ఈవెంట్‌ అయిన బెవెరియన్‌ ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత ఆటగాడు రోహన్‌ బోపన్న, బెన్‌ షెల్టన్‌ (అమెరికా) జోడీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.


IPL 2025 | వాంఖ‌డేలో ముంబై, స‌న్‌రైజ‌ర్స్ పోరు.. అత్య‌ధిక స్కోర్ అతడిదే..!

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో మ‌రో ఉత్కంఠ పోరుకు కాసేప‌ట్లో తెర‌లేవ‌నుంది. గ‌త సీజ‌న్ ర‌న్న‌ర‌ప్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(SRH) వాంఖ‌డేలో ముంబై ఇండియ‌న్స్‌(Mumbai Indians)తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ నేప‌థ్యంలో గ‌త రికార్డులు చూస్తే.. అత్య‌ధిక స్కోర్ ఎవ‌రు కొట్టారంటే..?


IPL | సూపర్‌ ఓవర్‌లో ఓడిన రాజస్థాన్‌.. ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం

ఐపీఎల్‌ మరో పోరు దుమ్మురేపింది! పంజాబ్‌ కింగ్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ లోస్కోరింగ్‌ మ్యాచ్‌ అభిమానుల మదిలో నుంచి చెరిగిపోక ముందే ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ పోరు పతాక స్థాయికి తీసుకెళ్లింది. బుధవారం జరిగిన ఈ సీజన్‌ తొలి సూపర్‌ ఓవర్‌ పోరులో రాజస్థాన్‌పై ఢిల్లీ ఉత్కంఠ విజయం సాధించింది.


IPL POINTS TABLE: దూసుకెళ్లిన ఢిల్లీ.. పైపైకి ముంబై! అట్టడుగునే సీఎస్కే!

ఐపీఎల్ 2025 రోజురోజుకూ ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై, ముంబై, హైదరాబాద్ కూడా మ్యాచ్‌లు గెలవడం ప్రారంభించాయి. ఇక పాయింట్ల పట్టిక విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆరు మ్యాచ్‌లు ఆడి ఐదు విజయాలతో టాప్ ప్లేస్‌లో ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ రెండు విజయాలతో ఆఖరి స్థానంలో ఉంది. ఆర్సీబీ మూడో స్థానంలో ఉండగా.. ముంబై ఇండియన్స్ ఎనిమిది, సన్‌రైజర్స్ హైదరాబాద్ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి.


ఒలింపిక్స్‌లో క్రికెట్‌ మ్యాచ్‌లకు వేదిక ఖరారు

128 ఏండ్ల తర్వాత ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకున్న క్రికెట్‌ నిర్వహణలో మరో ముందడుగు పడింది. లాస్‌ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌లో ఆరు జట్లతో ఆడనున్న ఈ మెగా ఈవెంట్‌లో మ్యాచ్‌ల నిర్వహణ కోసం ఐసీసీ వేదికను ఖరారు చేసింది. సౌ


BCCI Contract | అభిషేక్‌, నితీశ్‌కు బీసీసీఐ కాంట్రాక్టు!

భారత యువ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మతో పాటు ఆల్‌రౌండర్‌ నితీశ్‌ రెడ్డి, బౌలర్‌ హర్షిత్‌ రాణాకు బంపరాఫర్‌ దక్కనుంది. ఈ ముగ్గురూ ఈ ఏడాది బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్టులు అందుకోనున్నట్టు బోర్డు వర్గాల సమాచారం. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఒక ఏడాదికాలంలో ఒక క్రికెటర్‌ మూడు టెస్టులు లేదా 8 వన్డేలు లేదా పది టీ20లు ఆడితే వాళ్లు నేరుగా గ్రేడ్‌- సీ కాంట్రాక్టును అందుకునే అవకాశముంది.


రాణించిన ఢిల్లీ బ్యాటర్లు.. చివర్లో మెరుపులు, రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన.. ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 188/5 స్కోరు నమోదు చేసింది. అభిషేక్ పోరెల్.. 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టాడు.