PARIS OLYMPICS 2024 | రోయింగ్‌లో రెపిచేజ్‌ రౌండ్‌కు భారత రోవర్‌.. ఒలింపిక్స్‌లో శుభారంభం

Paris Olympics 2024 : పారిస్‌ ఒలింపిక్స్‌ 2024 (Paris Olympics 2024) లో రోయింగ్‌ (Rowing) విభాగంలో తలపడేందుకు వెళ్లిన ఏకైన రోవర్‌ బాల్‌రాజ్‌ పన్వర్ (Balraj Panwar).. పురుషుల సింగిల్ స్కల్స్‌ ఈవెంట్‌లో శుభారంభం చేశాడు. ఫోర్త్ లెవల్‌ విజయవంతంగా పూర్తిచేసి రెపిచేజ్‌ రౌండ్‌ (Repechage round) కు అర్హత సాధించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం రెపిచేజ్‌ రౌండ్‌ పోటీలు జరగనున్నాయి.

పారిస్‌ ఒలింపిక్స్‌లో రోయింగ్‌ ఈవెంట్స్ జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు జరగనున్నాయి. ఇవాళ పురుష సింగిల్‌ స్కల్స్‌ హీట్స్‌ పూర్తయ్యాయి. రేపు పురుషుల సింగిల్‌ స్కల్స్‌ రెపిచేజ్‌ రౌండ్‌ ఉంటుంది. భారత సైన్యంలో పనిచేస్తున్న బాల్‌రాజ్‌ పన్వర్‌ దక్షిణ కొరియాలో జరిగిన ఆసియన్‌, ఓసియానియన్‌ రోయింగ్‌ ఒలింపిక్‌ క్వాలిఫికేషన్‌ టోర్నీలో కాంస్య పతకం నెగ్గడం ద్వారా పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.

2024-07-27T09:31:38Z dg43tfdfdgfd