Trending:


'సెంచరీ కోసం రూట్ ఓ రాత్రంతా ఆగాడు.. పంత్-రాహుల్ కాసేపు ఆగలేకపోయారా'.. క్లాస్ పీకిన అనిల్ కుంబ్లే

లార్డ్స్ టెస్టులో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ చేసిన చిన్న పొరపాటు టీమిండియాను దెబ్బతీసింది. లంచ్ బ్రేక్ ముందు పంత్ రనౌట్ కావడం, వెంటనే రాహుల్ వికెట్ కోల్పోవడంపై అనిల్ కుంబ్లే అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరిద్దరూ 141 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత ఇలా వికెట్లు కోల్పోవడం ఇంగ్లాండ్‌కు ఊపునిచ్చిందని కుంబ్లే విమర్శించారు. పంత్ 74 పరుగులు చేయగా, కేఎల్ సెంచరీ చేశాడు. జడేజా, నితీష్ రెడ్డి భాగస్వామ్యం ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది.


5 బంతుల్లో 5 వికెట్లు.. ఐర్లాండ్‌ క్రికెటర్‌ కాంఫర్‌ అరుదైన రికార్డు

క్రికెట్‌లో మరో రికార్డు బద్దలైంది. ఐర్లాండ్‌ వేదికగా జరుగుతున్న ఇంటర్‌-ప్రావిన్షియల్‌ టీ20 ట్రోఫీలో ఐర్లాండ్‌ ఆల్‌రౌండర్‌, మన్సస్టర్‌ రెడ్స్‌ క్రికెటర్‌ కర్టిస్‌ కాంఫర్‌ అరుదైన రికార్డుతో ఆకట్టుకున్నాడు. శుక్రవారం నార్త్‌-వెస్ట్‌ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కాంఫర్‌ ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసి ప్రొఫెషనల్‌ నయా ఫీట్‌ను నమోదు చేశాడు.


జో రూట్ 99 పరుగుల వద్ద డ్రామా.. బాల్‌ని వదిలేసి జడేజా కాన్ఫిడెంట్ చూడండీ! వీడియో ఇదిగో!!

లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్టులో జో రూట్ అద్భుతమైన ఆటతీరుతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో రూట్ తన అనుభవంతో నిలబడ్డాడు. 99 పరుగుల వద్ద ఉన్న రూట్‌ను సెంచరీ చేయకుండా ఆపేందుకు భారత ఆటగాళ్లు ప్రయత్నించడం ఆసక్తికరంగా మారింది. రూట్ స్టీవ్ స్మిత్ రికార్డును అధిగమించడానికి ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. అంతేకాకుండా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.


IND vs ENG | జడేజా, నితీశ్ కీలక భాగస్వామ్యం.. టీ సమయానికి భారత్ స్కోర్..?

IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత బ్యాటర్లు సమిష్టిగా రాణిస్తున్నారు. మూడో రోజు రెండో సెషన్‌లో కేఎల్ రాహుల్ (100) సెంచరీ తర్వాత ఔటైనా మరో వికెట్ పడలేదు. రాహుల్ వికెట్‌తో ఇండియాపై ఒత్తిడి పెంచాలనుకున్న బెన్ స్టోక్స్ సేన వ్యూహాల్ని రవీంద్ర జడేజా (40 నాటౌట్), నితీశ్ కుమార్ రెడ్డి(25 నాటౌట్)లు చిత్తు చేశారు.


KL Rahul | లార్డ్స్‌లో సూపర్ సెంచరీ.. రెండో భారతీయుడిగా రాహుల్ రికార్డు..!

KL Rahul : ప్రతిష్ఠాత్మక లార్డ్స్ టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) శతకం సాధించాడు. క్లాస్ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్న రాహుల్ లంచ్ తర్వాత ఆర్చర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి మూడంకెల స్కోర్ అందుకున్నాడు.


Lord's Test రెండోరోజు గ్రౌండ్‌లో కనిపించని రిషబ్ పంత్.. బ్యాటింగ్‌కి వస్తాడా? రాడా?

లార్డ్స్ టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడటంతో రెండో రోజు ఆటలో కనిపించలేదు. మొదటి రోజు ఎడమ చేతి వేలికి గాయం కావడంతో ధృవ్ జురెల్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. పంత్ ప్రాక్టీస్ చేసినా, పూర్తి ఫిట్‌నెస్‌తో లేడని కోచ్ తెలిపారు. బీసీసీఐ ప్రకారం స్కానింగ్ చేయలేదు, ఎముక విరిగే అవకాశం లేదు. పంత్ బ్యాటింగ్‌కు రాకపోతే జట్టుకు నష్టం. ఐసీసీ నిబంధనల ప్రకారం 10 మందితోనే ఆడాల్సి వస్తుంది.


IND vs ENG | లార్డ్స్‌లో ఐదు వికెట్లతో చెలరేగిన బుమ్రా.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆలౌట్..!

IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత పేసర్ల విజృంభణతో ఇంగ్లండ్ రెండో సెషన్‌లోనే ఆలౌటయ్యింది. జస్ప్రీత్ బుమ్రా(5-74) ఇంగ్లండ్ బ్యాటింగ్ యూనిట్‌ను కకావికలం చేశాడు. తొలి సెషన్‌లో మూడు వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బతీసిన స్పీడ్‌స్టర్.. లంచ్ తర్వాత ఆర్చర్‌ను బౌల్డ్ చేసి ఐదో వికెట్ సాధించాడు.


డ్యూక్స్ బంతులపై వివాదం.. బ్రిటీష్ మీడియాపై సునీల్ గావస్కర్ చురకలు..!

అండర్సన్, సచిన్ ట్రోఫీలో డ్యూక్స్ బంతులపై వివాదం కొనసాగుతోంది. ఈ టెస్టు సిరీస్‌లో ఉపయోగిస్తున్న బంతుల్లో నాణ్యత సరిగ్గా లేదని త్వరగానే పాడై పోతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇరు జట్ల క్రికెటర్లు సైతం పదేపదే అంపైర్లకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించాడు. ఇలాంటి ఘటన భారత్‌లో జరిగి ఉంటే బ్రిటీష్ మీడియా గగ్గొలు పెట్టేదన్నాడు.


SL vs BAN | కుశాల్, నిశాంక మెరుపుల్.. తొలి టీ20లో బంగ్లా ఓటమి

SL vs BAN : సొంత గడ్డపై శ్రీలంక చెలరేగిపోతోంది. ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్ కైవసం చేసుకున్న ఆతిథ్య జట్టు పొట్టి సిరీస్‌ను విజయంతో ఆరంభించింది. పల్లెకెలె స్టేడియంలో గురువారం బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.


విరాట్ కోహ్లినే ఈ తరం అత్యుత్తమ ఆటగాడు: కేన్ విలియమ్సన్

ప్రపంచ క్రికెట్‌లో కోహ్లీ స్థానం పదిలం. సచిన్ రికార్డును బద్దలు కొట్టే సత్తా ఉన్న కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికి అందరినీ ఆశ్చర్యపరిచాడు. లార్డ్స్‌లో మూడో టెస్టు చూసేందుకు వచ్చిన కేన్ విలియమ్సన్, కోహ్లీ గొప్ప ఆటగాడని కొనియాడాడు. గత 15 ఏళ్లలో కోహ్లీ అత్యుత్తమ ఆటగాడని, అతనితో మంచి అనుబంధం ఉందని తెలిపాడు. తమ మధ్య పోటీ కేవలం ఫీల్డ్‌లోనే ఉంటుందని.. మ్యాచ్ గెలవడానికే తామిద్దరం చూస్తామని కేన్ చెప్పాడు.


IND vs ENG | మరోసారి చేతులెత్తేసిన టెయిలెండర్లు.. టీమిండియా ఆలౌట్

IND vs ENG : లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు పట్టుబిగించే అవకాశాన్ని కోల్పోయింది. మూడో రోజు ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీ(100)కి వైస్ కెప్టెన్ రిషభ్ పంత్(74), రవీంద్ర జడేజా (72)ల అర్ధ శతకాలతో చెలరేగిన వేళ మంచి ఆధిక్యం వస్తుందనిపించింది.


ట్రోలర్స్‌కి ఇచ్చిపడేసిన బుమ్రా.. నా వల్ల బాగానే డబ్బులు వస్తున్నాయంటూ సెటైర్లు!

లార్డ్స్ టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టి బుమ్రా హానర్స్ బోర్డులో స్థానం సంపాదించాడు. తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించాడు. తన ఆటతీరుపై విమర్శలు చేసే వారికి వ్యూస్, సబ్స్క్రైబర్స్ కావాలని వ్యంగ్యాంగా విమర్శించాడు. సచిన్ టెండూల్కర్ లాంటి గొప్ప ఆటగాడిని కూడా విమర్శించేవాళ్ళు ఉండేవారని గుర్తు చేశాడు. జెర్సీ వేసుకున్నంత కాలం విమర్శలు వస్తాయని చెప్పాడు. విమర్శలను పట్టించుకోకుండా దేశం కోసం ఆడటమే తన లక్ష్యమని బుమ్రా స్పష్టం చేశాడు.


టీమిండియా ఆశలు అడియాసలు.. లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ 353/7

ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జెమీ స్మిత్, బ్రైడన్ కార్స్ అద్భుత భాగస్వామ్యంతో రాణించారు. ఒక దశలో తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించిన ఇంగ్లండ్ జట్టును వీరిద్దరూ ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీసినప్పటికీ మిగతా బౌలర్లు ఆశించినంతగా రాణించలేకపోయారు.


లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌కు షాక్.. గాయంతో కీలక ప్లేయర్ ఔట్..!

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ షోయబ్ బషీర్ గాయపడ్డాడు. నితీశ్ కుమార్ రెడ్డి కొట్టే బంతిని ఆడే క్రమంలో బషీర్ వేలికి బలమైన గాయం అయింది. దీంతో బౌలింగ్ మధ్యలోనే ఆపేసి అతడు మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టలేదు. దీంతో అతడు ఈ టెస్టులో తిరిగి ఆడతాడా? లేడా? అన్నది తేలాల్సి ఉంది.


Indian Womens Team | అమ్మాయిల కొత్త చరిత్ర.. ఇంగ్లండ్‌పై తొలి పొట్టి సిరీస్‌ కైవసం

ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న భారత మహిళల క్రికెట్‌ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటిదాకా ఇంగ్లిష్‌ గడ్డపై అందని ద్రాక్షలా ఊరిస్తున్న టీ20 సిరీస్‌ను తొలిసారి కైవసం చేసుకుంది. ఆ జట్టుతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) ఇక్కడ జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.


Archery World Cup Stage 4 | మెరిసిన సురేఖ, ప్రీతికా.. ఒకేరోజు భారత్‌కు రజతం, కాంస్యం

Archery World Cup Stage 4 : స్పెయిన్ వేదికగా జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 4(Archery World Cup Stage 4)లో భారత మహిళా బృందం పతకాల వేట కొనసాగిస్తోంది. జ్యోతి సురేఖ (Jyothi Surekha), పర్నీత్ కౌర్(Parneet Kaur), ప్రీతికా ప్రదీప్‌ (Prithika Pradeep)లతో కూడిన త్రయం రజతం కొల్లగొట్టింది.


Joe Root | టీమిండియాపై పదకొండో సెంచరీ.. దిగ్గజాల సరసన చేరిన రూట్..!

Joe Root : సుదీర్ఘ ఫార్మాట్‌లో పరుగుల వీరుడిగా పేరొందని జో రూట్ (Joe Root) మరో శతకంతో రెచ్చిపోయాడు. లార్డ్స్‌ మైదానంలో భారత్‌పై సూపర్ సెంచరీతో జట్టును ఆదుకున్న రూట్.. కెరియర్లో 37వ సారి మూడంకెల స్కోర్ అందుకున్నాడు.


లంచ్‌కు ముందు పంత్‌ రనౌట్.. కేఎల్ రాహులే కారణమా.. మరీ ఇలా అవుట్ అవుతారా?

Ind vs Eng Test Series: లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు లంచ్ సమయానికి భారత్.. 248/4తో నిలిచింది. ఈ సెషన్‌లో 22.3 ఓవర్లు బ్యాటింగ్ చేసిన భారత్.. 103 పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో రిషభ్ పంత్ (74) రనౌట్ అయ్యాడు. క్రీజులో కేఎల్ రాహుల్ (98 పరుగులు) ఉన్నాడు. టీమిండియా ఇంకా 139 పరుగులు వెనకబడి ఉంది.


Jaspreet Bumrah | లార్డ్స్‌ హానర్స్ బోర్డులో బుమ్రా.. కనుమరుగైన భారత దిగ్గజం రికార్డు

Jaspreet Bumrah : ప్రమాదకరమైన బౌలింగ్ శైలితో బ్యాటర్ల గుండెల్లో గుబులు పుట్టించే జస్ప్రీత్ బుమ్రా (Jaspreet Bumrah) లార్డ్స్‌ టెస్టులో పంజా విసిరాడు. తన పేస్ పవర్ చూపిస్తూ సూపర్ స్పెల్‌తో ఇంగ్లండ్ టాపార్డర్‌ను కూల్చి ఐదు వికెట్లు పడగొట్టాడీ వరల్డ్ నంబర్ 1.


ఫోర్జరీ కేసులో జగన్మోహన్‌రావు అరెస్టు

ఫోర్జరీ పత్రాల కేసులో హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ జగన్మోహన్‌రావు మరో నలుగురు ఆఫీస్‌ బేరర్లను అరెస్ట్‌ చేసినట్లు సీఐడీ డీజీ చారుసిన్హా గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ (టీసీఏ) జనరల్‌ సెక్రటరీ ధరమ్‌ గురువారెడ్డి ఫిర్యాదు ఆధారంగా బుధవారం కేసు నమోదు చేశామన్నారు. ఐపీసీ 465, 468, 471, 403, 409, 420 ఆర్‌/డబ్ల్యూ 34 వంటి సెక్షన్ల కింద క్రిమినల్‌ కేసు నమోదైనట్లు పేర్కొన్నారు.


IND vs ENG | పక్కా ప్లాన్‌తో గిల్ వికెట్.. హాఫ్ సెంచరీతో మెరిసిన రాహుల్

IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్‌(51) అర్ధ శతకంతో రాణించాడు. ఓవైపు ఇంగ్లండ్ బౌలర్లు స్వింగ్‌తో, బౌన్సర్లతో సవాల్ విసిరుతూ వికెట్లు తీస్తున్నా.. క్రీజులో పాతుకుపోయిన రాహుల్ సింగిల్ తీసి హాఫ్ సెంచరీ సాధించాడు.


రీల్స్‌ కారణం కాదట.. రాధికాయాదవ్‌ హత్య కేసులో కీలక మలుపు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జాతీయ యువ టెన్నిస్‌ ప్లేయర్‌ రాధికా యాదవ్‌ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. సోషల్‌మీడియాలో రీల్స్‌ చేస్తున్న కారణంగా తండ్రి దీపక్‌ చేతిలో రాధిక హత్యకు గురైందన్న వార్తను ఉటంకిస్తూ పోలీసులు మరో విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.


నా కెప్టెన్ పాట్ కమిన్స్.. లార్డ్స్‌లో సక్సెస్ కావడానికి అతనే కారణం: నితీష్ కుమార్ రెడ్డి

లార్డ్స్ టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి సంచలన ప్రదర్శన చేశాడు. తొలిరోజు ఆటలో బుమ్రా, సిరాజ్ వికెట్లు తీయలేకపోయినా, నితీష్ కుమార్ రెడ్డి తన తొలి ఓవర్లోనే ఇద్దరు ఓపెనర్లను అవుట్ చేసి ఆశ్చర్యపరిచాడు. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత బౌలింగ్‌పై దృష్టి సారించానని, ఐపీఎల్‌లో పాట్ కమిన్స్ ఇచ్చిన సలహాలు ఉపయోగపడ్డాయని నితీష్ తెలిపాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.


Rishabh Pant | చూపుడు వేలు నొప్పిని భరిస్తూనే.. లార్డ్స్‌లో యోధుడిలా చెలరేగిన పంత్..!

Rishabh Pant : ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్టు క్రికెట్‌కు విరాట్ కోహ్లీ (Virat Kohli) వీడ్కోలు పలికిన తర్వాత అభిమానులను అలరించే ఆటగాడు ఎవరు? అనే ప్రశ్న తలెత్తింది. కానీ, ఈ ప్రశ్నకు 'నేనున్నాగా' అంటూ సమాధానమిస్తున్నాడు రిషభ్ పంత్ (Rishabh Pant).


Rishabh Pant Injury: పంత్ గాయం నుంచి కోలుకోకపోతే.. ధ్రువ్ జురెల్ బ్యాటింగ్ చేయొచ్చా?

లార్డ్స్‌లో భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. జో రూట్ సెంచరీ కొరకు సన్నద్ధమయ్యాడు. తెలుగు యువ క్రికెటర్ నితీష్ రెడ్డి ఒకే ఓవర్లో రెండు కీలక ఓపెనర్లను అవుట్ చేసి తన ప్రతిభను చాటాడు. అయితే, వికెట్ కీపర్ పంత్ గాయపడటంతో భారత్‌కు సమస్యలు ఏర్పడ్డాయి, అతని స్థానంలో జురేల్ కీపింగ్ బాధ్యతలు తీసుకున్నాడు.


బజ్‌బాల్‌ను పక్కనపెట్టిన ఇంగ్లాండ్.. లార్డ్స్‌లో తొలి రోజు 83 ఓవర్లలో 251/4..!

లార్డ్స్‌లో భారత్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచులో ఆతిథ్య ఇంగ్లాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. బజ్ బాల్ ఆటను పక్కనపెట్టి.. వికెట్లు కాపాడుకునేందుకే ఆ జట్టు బ్యాటర్లు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో ఇంగ్లాండ్ స్కోరు బోర్డు నెమ్మదించింది. భారత బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి 2, బుమ్రా, జడేజా ఒక్కో వికెట్ తీశారు.


వేలికి గాయమైనా లెక్క చేయకుండా.. ఒంటి చేత్తో హాఫ్ సెంచరీ చేసిన పంత్!

లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో రిషబ్ పంత్ గాయంతోనూ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శిస్తున్నాడు. రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన పంత్, మూడో రోజు హాఫ్ సెంచరీ సాధించాడు. తొలిరోజు ఫీల్డింగ్ చేస్తూ వేలికి గాయమైనప్పటికీ, పంత్ పట్టుదలతో ఆడుతున్నాడు. కెఎల్ రాహుల్‌తో కలిసి జట్టు స్కోరును పెంచాడు. వీరిద్దరూ కలిసి భారత్‌ను ఆదుకున్నారు. అనవసర రన్‌కు ప్రయత్నించి పంత్ (74) వికెట్ కోల్పోయాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 248 పరుగులు...


IND vs ENG | అర్ధ శతకంతో కదం తొక్కిన పంత్.. బౌండరీలతో చెలరేగుతున్న రాహుల్

IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ (55 నాటౌట్) వీరోచిత ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. గాయం తాలుకు నొప్పిని భరిస్తూనే ఇంగ్లండ్ బౌలర్ల భరతం పడుతున్న పంత్ సిక్సర్‌తో అర్ధ శతకం సాధించాడు.


IND vs ENG | నిలకడగా భారత్‌.. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 145/3

భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్టులో ఆతిథ్య జట్టును కట్టడిచేసిన టీమ్‌ఇండియా.. తర్వాత బ్యాటింగ్‌లో నిలకడగా ఆడుతున్నది. టాపార్డర్‌ విఫలమైనప్పటికీ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (113 బంతుల్లో 53 నాటౌట్‌, 5 ఫోర్లు) తన ఫామ్‌ను కొనసాగిస్తూ మరో అర్ధ శతకంతో మెరవగా కరుణ్‌ నాయర్‌ (40)రాణించాడు.


రికార్డు సృష్టించిన రాహుల్.. క్రికెట్ మక్కా లార్డ్స్‌లో రెండో సెంచరీ..!

ఇంగ్లాండ్ గడ్డపై కేఎల్ రాహుల్ మరో సెంచరీ కొట్టాడు. లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో శతక్కొట్టాడు. దీంతో లార్డ్స్‌లో రెండో సెంచరీ చేసిన రెండో భారత ప్లేయర్‌గా నిలిచాడు. టెస్టు కెరీర్‌లో ఇప్పటివరకు 10 సెంచరీలు చేసిన రాహుల్.. అందులో 9 సెంచరీలు విదేశాల్లోనే చేయడం గమనార్హం. అందులోనూ ముఖ్యంగా ఇంగ్లాండ్‌లోనే 4 శతకాలు నమోదు చేశాడు రాహుల్‌.


ICC T20 World Cup 2026లో ఇటలీ.. ఫుట్‌బాలే కాదు ఇకపై క్రికెట్‌లోనూ హవా!

ఫుట్‌బాల్‌లో సత్తా చాటుతున్న ఇటలీ ఇప్పుడు క్రికెట్‌లోనూ సంచలనం సృష్టించింది. తొలిసారిగా టీ20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించి చరిత్ర సృష్టించింది. యూరోప్ క్వాలిఫైయర్స్‌లో నెదర్లాండ్స్‌తో ఓడిపోయినప్పటికీ.. నెట్ రన్ రేట్ కారణంగా 2026 టీ20 వరల్డ్‌కప్‌లో చోటు దక్కించుకుంది. ఈ విజయంతో ఇటలీ క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉంది. భారత్ - శ్రీలంక వేదికగా జరిగే ఈ మెగా టోర్నీలో ఇటలీ ఎలా రాణిస్తుందో చూడాలి.


Bengaluru Stampede | బెంగళురు తొక్కిసలాట ఘటన.. వారే బాధ్యులు : రిపోర్ట్‌

Bengaluru Stampede | ఐపీఎల్‌లో తొలి ట్రోఫీ నెగ్గిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) నిర్వహించతలపెట్టిన విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట (Bengaluru Stampede) ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే.


Rishabh Pant | పంత్‌ చూపుడు వేలికి గాయం.. ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే..?

Rishabh Pant : ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతంగా రాణిస్తున్న భారత జట్టు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) గాయపడ్డాడు. లార్డ్స్ టెస్టు రెండో సెషన్ సమయంలో అతడి ఎడమ చేతి చూపుడు వేలికి బంతి బలంగా తాకింది.


Tennis Player Killed | కన్నతండ్రి చేతిలో హతమైన టెన్నిస్ ప్లేయర్‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడమే శాపమైంది..!

Tennis Player Killed : టెన్నిస్‌ ఆటలో గొప్పగా రాణించాలనుకున్న ఓ యువ క్రీడాకారిణి జీవితం అర్థాంతరంగా ముగిసింది. రాష్ట్ర స్థాయిలో (State Level) పతకాలు సాధిస్తూ.. జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో మెరవాలనుకున్న ఆమె కన్నతండ్రే కడతేర్చాడు.


India Vs England | ఇంగ్లండ్‌ నెమ్మదిగా.. తొలి ఇన్నింగ్స్‌లో 251/4.. రాణించిన నితీశ్‌

ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానం వేదికగా భారత్‌తో గురువారం నుంచి మొదలైన మూడో టెస్టును ఇంగ్లండ్‌ నెమ్మదిగా ఆరంభించింది. పూర్తి ఎండకాచిన పిచ్‌పై భారత పేసర్లు ఆతిథ్య జట్టు బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి బెన్‌ స్టోక్స్‌ సేన.. 83 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.


Javelin Throw | పొలాండ్ డైమండ్ లీగ్‌లో నీరజ్ వర్సెస్ నదీమ్‌.. ఈసారి పైచేయి ఎవరిదో..!

Javelin Throw : భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ తెలిసింది. ఈమధ్య ఇరుదేశాల అథ్లెట్ల మధ్య జావెలిన్ త్రో పోటీ కూడా అంతే ఉత్కంఠ రేపుతోంది. అంతర్జాతీయ వేదికలపై నీరజ్ చోప్రా(Neeraj Chopra), అర్షద్ నదీమ్‌ (Arshad Nadeem) తగ్గేదేలే అన్నట్టు పోటీ పడుతుండడమే అందుకు కారణం.


లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోర్.. ఐదు వికెట్లతో మెరిసిన బుమ్రా!

లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. రెండో రోజు జెమీ స్మిత్, బ్రైడన్ కార్స్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేయగలిగింది. బుమ్రా ఐదు వికెట్లు తీశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టులో జో రూట్ సెంచరీతో రాణించాడు. అయితే, బుమ్రా ధాటికి ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. స్మిత్ హాఫ్ సెంచరీతో, కార్స్ విలువైన పరుగులతో జట్టుకు అండగా నిలిచారు. బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టగా, నితీష్ కుమార్...


మేజర్ లీగ్ క్రికెట్‌లో ముంబై ఇండియన్స్ మ్యాజిక్.. పోలార్డ్ విధ్వంసంతో ఫైనల్స్‌లో అడుగు!

మేజర్ లీగ్ క్రికెట్ ఫైనల్స్‌లో ఎంఐ న్యూయార్క్, వాషింగ్టన్ ఫ్రీడమ్ తలపడనున్నాయి. ఛాలెంజర్ మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌పై ఎంఐ న్యూయార్క్ విజయం సాధించింది. టెక్సాస్ మొదట బ్యాటింగ్ చేసి 166 పరుగులు చేయగా, డుప్లెసిస్ అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం ఎంఐ న్యూయార్క్ 19 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. పూరన్, పోలార్డ్ అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును గెలిపించారు. 22 బంతుల్లో 47 పరుగులు చేసిన పోలార్డ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.


IND vs ENG | అర్ధ శతకంతో రాణించిన రాహుల్.. టీమిండియా ఎంత కొట్టిందంటే..?

IND vs ENG : లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు భారీ స్కోర్ ఆశలన్నీ మిడిలార్డర్ మీదే ఆధారపడి ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రా (5-74) విజృంభణతో ఇంగ్లండ్‌ను రెండో సెషన్‌లోనే చుట్టేసిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ కేఎల్ రాహుల్‌(53 నాటౌట్) అర్ధ శతకంతో రాణించాడు.


Curtis Campher | ఐదు బంతుల్లో 5 వికెట్లు.. తొలి బౌలర్‌ ఇతడే..!

Curtis Campher : అంతర్జాతీయ క్రికెట్‌లో హ్యాట్రిక్ వీరులు.. వరుసగా నాలుగు వికెట్లు తీసిన బౌలర్లను చూశాం. కానీ, వరుసగా ఐదు బంతుల్లో ఐదు వికెట్లు అంటే అది అద్భుతమే కాదు క్రికెట్‌లో సరికొత్త రికార్డు.


హెచ్‌సీఏ కేసులో రంగంలోకి ఈడీ

హెచ్‌సీఏ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దృష్టి సారించింది. హైదరాబాద్‌ క్రికెట్‌ క్లబ్‌ అవకతవకల వ్యవహారాన్ని విచారించేందుకు సన్నద్ధమైంది. ఈ క్రమంలో శుక్రవారం సీఐడీ అధికారులకు హెచ్‌ఏసీ కేసు వివరాలు ఇవ్వాలని లేఖ రాసింది.


పంత్ స్పెషల్ ఇన్నింగ్స్, కేఎల్ హాఫ్ సెంచరీ.. లార్డ్స్‌లో నిలకడగా భారత్!

లార్డ్స్ టెస్టులో టీమిండియా నిలకడగా ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే జైస్వాల్ వికెట్ కోల్పోయినా.. రాహుల్, కరుణ్ నాయర్ భాగస్వామ్యం నెలకొల్పారు. కరుణ్ నాయర్, గిల్ త్వరగా అవుటైనా రాహుల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. రిషబ్ పంత్ గాయంతో బ్యాటింగ్‌కు వచ్చి రాహుల్‌కు సహకరించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఆధిక్యం సాధించాలంటే భారత్ ఇంకా 243 పరుగులు చేయాల్సి ఉంది.


Wimbledon | వింబుల్డన్ క్వీన్ స్వియాటెక్.. పొలాండ్ తొలి ఛాంపియన్‌గా రికార్డు..!

Wimbledon : వింబుల్డన్‌లో ఇగా స్వియాటెక్ (Iga Swiatek) విజేతగా అవతవరించింది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో అద్భుత విజయంతో టైటిల్‌ కైవసం చేసుకుంది.


రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.. ఆ ప్లేయర్ మృతిపై మహమ్మద్ సిరాజ్ ఎమోషనల్!

లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో జెమీ స్మిత్ వికెట్ తీసిన తర్వాత సిరాజ్ ప్రత్యేకంగా సంబరాలు చేసుకున్నాడు. పోర్చుగల్ ఫుట్‌బాల్ ఆటగాడు డియోగో జోటా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అతనికి నివాళిగా సిరాజ్ తన జెర్సీ నంబర్ 20ని చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. జోటా మరణం తనను తీవ్రంగా కలచివేసిందని, అందుకే ఈ విధంగా నివాళి అర్పించానని సిరాజ్ బీసీసీఐతో చెప్పాడు. లార్డ్స్ టెస్టులో సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.


యువరాజ్ సింగ్ పార్టీలో శుభమన్ గిల్ - సారా టెండూల్కర్ వీడియో వైరల్.. రవీంద్ర జడేజా ఎక్స్‌ప్రషన్స్ హైలెట్!

యువరాజ్ సింగ్ లండన్‌లో ఇచ్చిన పార్టీలో క్రికెటర్లు సందడి చేశారు. సచిన్ టెండూల్కర్ తన కుటుంబంతో హాజరయ్యారు. శుభ్‌మన్ గిల్, సారా టెండూల్కర్ మధ్య ఏదో ఉందనే పుకార్లు వైరల్ అవుతున్నాయి. గిల్ నవ్వుతూ ఉండటం, జడేజా ఎక్స్‌ప్రెషన్స్‌తో వీడియో మరింత వైరల్ అయింది. శుభమన్ గిల్ - సారా వీడియో కూడా ఒకటి వైరల్ అయింది. వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని నెటిజన్లు కథనాలు అల్లుతున్నారు. గిల్ ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్‌లో రికార్డులు సృష్టించాడు.


Siraj | అతడి మరణంతో కలత చెందాను.. అందుకే మైదానంలో నివాళి అర్పించాను..!

Siraj : భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ (Siraj ) మైదానంలో ఫుల్‌జోష్‌లో ఉంటాడు. ప్రత్యర్థి బ్యాటర్లను కవ్విస్తూ.. వాళ్లకు సవాల్ విసురుతూ ఆధిపత్యం చెలయించాలని చూస్తాడు. మనందరికీ ఆవేశం స్టార్‌గానే తెలిసిన 'మియా భాయ్' లార్డ్స్ టెస్టులో మాత్రం మౌనమునిలా కనిపించాడు. ఎందుకంటే?


చరిత్ర సృష్టించిన జో రూట్.. టెస్టు సెంచరీల్లో ఆల్‌టైమ్ రికార్డు!

లార్డ్స్ టెస్టులో జో రూట్ అద్భుతమైన సెంచరీతో చరిత్ర సృష్టించాడు. బుమ్రా వేసిన మొదటి బంతికే బౌండరీ కొట్టి 37వ టెస్టు శతకాన్ని నమోదు చేశాడు. భారత్‌పై ఇది అతనికి 11వ సెంచరీ. ఈ సెంచరీతో రూట్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ టెస్టులో 199 బంతులు ఆడిన జో రూట్ 104 పరుగులు చేసి అవుటయ్యాడు.


IND vs ENG | బ్రూక్ బౌల్డ్.. ఫిఫ్టీతో ఇంగ్లండ్‌ను ఆదుకున్న రూట్ ..!

IND vs ENG : లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోతోంది. తొలి సెషన్లో రెండు వికెట్లు తీసిన భారత బౌలర్లు.. మూడో సెషన్‌లో మరో రెండు వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బకొట్టారు.


IND vs ENG | వరుసగా మూడో ఫిఫ్టీ బాదేసిన జడ్డూ.. టెయిలెండర్లు నిలిస్తేనే ఆధిక్యం?

IND vs ENG : భారత సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (53 నాటౌట్) ఇంగ్లండ్ పర్యటనలో అదరగొడుతున్నాడు. లార్డ్స్ టెస్టులో ఆపద్భాందవుడి పాత్ర పోషిస్తున్న జడ్డూ ఈ సిరీస్‌లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ బాదాడు. ఆ తర్వాత ఎప్పటిలానే బ్యాటుసాము సెలబ్రేషన్ చేసుకున్నాడు.


భారత్‌తో సిరీస్ కోసం శ్రీలంక రిక్వెస్ట్.. ఆసియా కప్ షెడ్యూల్ తర్వాతే తుది నిర్ణయం!

బంగ్లాదేశ్ సిరీస్ రద్దు కావడంతో, భారత్-శ్రీలంక వైట్ బాల్ సిరీస్‌పై ఆశలు చిగురిస్తున్నాయి. ఆగస్టులో ఖాళీ షెడ్యూల్స్‌తో, శ్రీలంక క్రికెట్ బోర్డు ఆతిథ్యం ఇవ్వడానికి ఆసక్తి చూపుతోంది. మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ను నిర్వహించాలని ప్రతిపాదించింది. బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ.. ఆసియా కప్ షెడ్యూల్ తర్వాత తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ సిరీస్ జరిగితే రోహిత్, కోహ్లీలను వన్డేల్లో చూడాలనుకునే అభిమానులకు ఇది శుభవార్తే అవుతుంది.