స్పోర్ట్స్

Trending:


Champions Trophyలో భారత్‌పై పాక్‌దే పైచేయి.. జోస్యం చెప్పిన అక్తర్!

దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23న జరిగే భారత్-పాక్ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు టీమిండియాను ఓడిస్తుంది అంటూ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అదేవిధంగా భారత్-పాక్ మధ్యే ఫైనల్ ఉండబోతుందంటూ అక్తర్ జోస్యం చెప్పాడు. 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో 180 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి పాకిస్తాన్ టైటిల్ సొంతం చేసుకుంది.


విరాట్ కోహ్లీ ఫిట్.. రెండో వన్డేకు రెడీ.. ఎవరిని తీసేస్తారు?

Virat Kohli: ఇంగ్లాండ్‌తో రెండో వన్డేకు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్. మోకాలి నొప్పి కారణంగా తొలి వన్డేకు దూరమైన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో రెండో వన్డేలో ఆతడు ఆడతాడని భారత బ్యాటింగ్ కోచ్ చెప్పాడు. అయితే కోహ్లీ కోసం తుది జట్టు నుంచి ఎవరిని తప్పిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు కటక్‌ వేదికగా రెండో వన్డే ప్రారంభం కానుంది.


ఆసీస్‌ 330-3

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా అదరగొడుతున్నది. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌(120 నాటౌట్‌), అలెక్స్‌ క్యారీ(139 నాటౌట్‌) సెంచరీలతో విజృంభించడంతో రెండో రోజు ఆట ముగిసే సరికి ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 330-3 స్కోరు చేసింది.


Karan Nair | నాయర్‌ సెంచరీ.. దేశవాళీల్లో కరణ్‌ పరుగుల వరద

దేశవాళీల్లో విదర్భ స్టార్‌ బ్యాటర్‌ కరణ్‌నాయర్‌ పరుగుల వరద దిగ్విజయంగా కొనసాగుతున్నది. తన కెరీర్‌లో అద్భుత ఫామ్‌ కనబరుస్తున్న నాయర్‌ శనివారం తమిళనాడుతో మొదలైన క్వార్టర్స్‌ పోరులో నాయర్‌(180 బంతుల్లో 100 నాటౌట్‌, 14ఫోర్లు, సిక్స్‌) అజేయ సెంచరీతో కదంతొక్కాడు.


SA20 Champions: కావ్య పాప ఆశలపై నీళ్లు.. ముంబై ఇండియన్స్ ఖాతాలో 11వ టైటిల్

దక్షిణాఫ్రికా క్రికెట్ లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ జట్టు తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది. తొలి రెండు సీజన్‌లలో టైటిల్ సాధించిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ను ఫైనల్‌లో ఓడించి.. తొలిసారి విజేతగా నిలిచింది. రషీద్ ఖాన్ సారథ్యంలో బరిలోకి దిగిన ఎంఐ.. 76 రన్స్ తేడాతో ఫైనల్‌లో గెలుపొందింది. కాగా ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీకి ఇది 11వ టైటిల్ కావడం గమనార్హం.


ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే.. పాక్ బౌలర్లకు చుక్కలు చూపించిన కివీస్ బ్యాటర్

పాకిస్థాన్‌తో జరుగుతున్న వన్డేలో కివీస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్.. సెంచరీతో చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్‌ను నిదానంగా ప్రారంభించిన ఈ బ్యాటర్.. చివరి ఐదు ఓవర్లలో చుక్కలు చూపించాడు. 22 బంతుల్లో ఏకంగా 63 రన్స్ స్కోరు చేశాడు. తన కెరీర్‌లో తొలి వన్డే సెంచరీని నమోదు చేశాడు. అతడి విధ్వంసంతో ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 333/6 స్కోరు చేసింది.


నెక్స్ట్ ఆసీస్ కెప్టెన్ ఎవరు? ఆ ఇద్దరి పైనే అందరి చూపు

పాట్ కమిన్స్ దూరం కావడంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ఎవర్ని కెప్టెన్‌గా నియమించాలి అనే ఆలోచనలో ఆసీస్ బోర్డు పడింది. స్టీవ్ స్మిత్‌తో పాటు ట్రావిస్ హెడ్ పేర్లను బోర్డు పరిశీలిస్తోంది. కీలక ఆటగాళ్లు దూరమైన ఈ సమయంలో జట్టును ముందుకు తీసుకెళ్లడం కొత్త కెప్టెన్‌కు కత్తిమీద సాములాంటిదే.


IND vs ENG ODI | కటక్‌ వన్డేలో విరాట్‌ ఎంట్రీ..! ఆ ఇద్దరిలో ఒకరు త్యాగం చేయాల్సిందేనా..?

IND vs ENG ODI | భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య ఆదివారం రెండో వన్డే జరుగనున్నది. అందరి దృష్టి స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ క్లోహీపైనే ఉన్నది. నాగ్‌పూర్‌ వన్డేకు దూరమైన విషయం తెలిసిందే. కుడి మోకాలు వాపు కారణంగా మ్యాచ్‌కు దూరమైనట్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వెల్లడించాడు.


BCCI | మార్చి ఒకటిన బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం..! ఈ భేటీకి కారణం ఏంటంటే..?

BCCI | దేవ్‌జిత్‌ సైకియా కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత.. ఆయన స్థానంలో కొత్త జాయింట్‌ సెక్రెటరీని నియమించేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ బోర్డు (BCCI) మార్చి 1న ముంబైలో ప్రత్యేక సర్వసభ్య సమావేశం (SGM)ను ఏర్పాటు చేసింది.


పూరీ జగన్నాథుడి సన్నిధిలో టీమిండియా క్రికెటర్లు

India vs England: రెండో వన్డేకు ఒకరోజు ముందు టీమిండియా క్రికెటర్లు పలువురు ఒడిశాలోని పూరి జగన్నాథుడి ఆలయాన్ని సందర్శించారు. వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, అక్షర్‌ పటేల్‌లు జగన్నాథుడి ఆలయానికి వెళ్లారు. రెండో వన్డే ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. ఒడిశాలోని కటక్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. కాగా మూడు వన్డేలో సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 1-0తో లీడ్‌లో ఉంది. రెండో వన్డేలోనూ గెలిచి.. కటక్‌లోనే సిరీస్‌ పట్టేయాలని పట్టుదలతో ఉంది.


IND vs ENG: కటక్‌లో గెలిచేదెవరు? హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!

ind vs eng 2nd odi:రెండో వన్డేకి వేదికైన కటక్ బారాబతి స్టేడియంలో టీమిండియాదే పైచేయిగా ఉంది. ఓవరాల్‌గా చూసినా లేక ఇంగ్లండ్‌పైన అయినా టీమిండియానే ఎక్కువ విజయాలు సాధించింది. అయితే ఇంగ్లండ్ కూడా టీమిండియాకు పోటీ ఇచ్చిందనే చెప్పొచ్చు.


Tri-Series: పాకిస్తాన్‌లో ట్రై సిరీస్.. సౌతాఫ్రికా-న్యూజిలాండ్‌కు భలే ఛాన్స్!

ICC CHAMPIONS TROPHY 2025 మరో 12 రోజుల్లో ప్రారంభకానున్న నేపథ్యంలో పాకిస్తాన్‌లో ట్రై సిరీస్ సందడి మొదలైంది. సౌతాఫ్రికా-న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య నాలుగు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు ఈ సిరీస్ జరగనుంది.


SRH కెప్టెన్‌కు ఆడపిల్ల.. ఫొటో షేర్ చేసిన పాట్ కమిన్స్!

"ఆమె ఇదిగో.. మా అందమైన పాపాయి ఈడీ. ఇప్పుడు మేమెంత సంతోషంగా ఉన్నామో, ఆనందంలో మునిగిపోయామో మాటల్లో చెప్పలేం." అంటూ పాట్ కమిన్స్, బెకీ కమిన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.


హిట్‌మ్యాన్ ఆగయా.. 76 బంతుల్లోనే సెంచరీ.. ఇది కదా రోహిత్ అసలు ఆట..!

భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిపోయాడు. 30 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కును చేరుకున్న హిట్‌మ్యాన్.. 76 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. దీంతో వన్డే క్రికెట్లో తన 32వ సెంచరీని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో ప్రపంచ క్రికెట్‌లో పలు రికార్డును హిట్‌మ్యన్‌ బద్దలు కొట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత ఫ్యాన్స్‌ను కుషీ చేశాడు.


Rohit Sharma: దిమాక్ కిద‌ర్ హై తేరా.. హ‌ర్షిత్ రాణాపై రోహిత్ శ‌ర్మ ఫైర్‌

Rohit Sharma: హ‌ర్షిత్ రాణాపై సీరియ‌స్ అయ్యాడు రోహిత్ శ‌ర్మ‌. క‌ట‌క్ వ‌న్డేలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. హ‌ర్షిత్ ఆవేశంలో బంతిని విసిరేయ‌డంతో.. ఇంగ్లండ్‌కు నాలుగు ఎక్స్‌ట్రా ర‌న్స్ వ‌చ్చాయి. ఆ స‌మ‌యంలో కెప్టెన్ రోహిత్ ఆగ్ర‌హాన్ని వ్యక్తం చేశాడు. మెద‌డు ఉందా అంటూ హ‌ర్షిత్‌ను తిట్టేశాడు.


క్రికెట్‌కు అజయ్‌రెడ్డి వీడ్కోలు

అంతర్జాతీయ క్రికెట్‌కు భారత అంధుల జట్టు మాజీ కెప్టెన్‌ అజయ్‌రెడ్డి వీడ్కోలు పలికాడు. తన సుదీర్ఘ కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పెడుతున్నట్లు అజయ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొనాడు.


Team India | రోహిట్‌ ధమాకా.. రెండో వన్డేలో భారత్‌కు అలవోక విజయం

టీమ్‌ఇండియా సారథి రోహిత్‌ శర్మ (90 బంతుల్లో 119, 12 ఫోర్లు, 7 సిక్సర్లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే భారత్‌ 2-0తో కైవసం చేసుకుంది. కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా ఇంగ్లీష్‌ జట్టుతో జరిగిన రెండో వన్డేలో భారత్‌.. 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.


gaddafi stadium: ఇదేం స్టేడియం, ఇవేం లైట్లు.. రచిన్ రవీంద్ర గాయం వేళ పాక్‌పై నెటిజన్ల విమర్శలు..!

gaddafi stadium: పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. ట్రై సిరీస్‌లో భాగంగా పాక్-న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే పాక్ బ్యాటర్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టే క్రమంలో అది వచ్చి నేరుగా రచిన్ నుదుటిపై పడింది. దీంతో చర్మం పగిలి రక్తస్రావం అయింది. రక్తం కారుతుండటంతో అతడు మైదానం వీడాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.


National Games | నిత్యకు రజతం.. నేషనల్‌ గేమ్స్‌లో తెలంగాణ ప్లేయర్లు పతకాల వేట

ఉత్తరాఖండ్‌ వేదికగా జరుగుతున్న 38వ నేషనల్‌ గేమ్స్‌లో తెలంగాణ ప్లేయర్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. శనివారం జరిగిన మహిళల 100మీటర్ల రేసును రాష్ట్ర యువ అథ్లెట్‌ నిత్య గాదె 11.79 సెకన్లలో ముగించి రజత పతకంతో మెరిసింది.


స్మిత్ కాదు సైబోర్గ్.. అలుపెరగని పరుగుల యోధుడు!

స్టీవ్ స్మిత్ క్రికెట్‌లో ఒక్కొక్క రికార్డును బద్దలుకొట్టుకుంటూ తన పరుగుల దాహాన్ని తీర్చుకుంటూ వస్తున్నాడు. క్రికెట్‌లో స్టీవ్ స్మిత్ ఆటతీరు చాలా ప్రత్యేకం. బౌలర్లను తికమక పెడుతూ ఫుట్‌వర్క్‌ను కదుపుతూ వస్తుంటాడు. అందుకే స్మిత్‌ను క్రికెట్ సైబోర్గ్‌గా పిలుస్తున్నారు.


బజ్ బాల్ బెంబేల్.. ఓన్లీ ఓపెనర్లకే!

భారత్ వేదికగా జరిగిన టీ20 సిరీస్‌తో పాటు ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ బజ్ బాల్ కేవలం ఓపెనర్లకే పరిమితమయింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డే, కటక్‌లో రెండో వన్డేలో కూడా ఓపెనర్లు క్రీజులో ఉన్నంత సేపు బౌండరీల వర్షం కురిపించారు.


Sri Lanka VS Australia | లంకలో 14 ఏండ్ల తర్వాత.. టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఆస్ట్రేలియా

శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. సోమవారం గాలె వేదికగా ముగిసిన రెండో టెస్టులో ఆసీస్‌.. 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆట నాలుగో రోజు లంక నిర్దేశించిన 75 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. 2011 తర్వాత శ్రీలంకలో కంగారూలకు ఇదే తొలి టెస్టు సిరీస్‌ విజయం కావడం విశేషం.


భారత్‌ పతక జోరు

థాయ్‌లాండ్‌లోని ఫిచిట్‌ నగరం వేదికగా జరుగుతున్న ఆసియా రోడ్‌ పారా సైక్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత పారాసైక్లిస్టుల పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది.


HCA | త్వరలో టీపీఎల్‌.. ప్రతీ జిల్లాకు కోటి రూపాయల ఫండ్‌: హెచ్‌సీఏ

ప్రతిభ కల్గిన యువ కల్గిన యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రీమియర్‌ లీగ్‌(టీపీఎల్‌)ను త్వరలో నిర్వహిస్తామని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు పేర్కొన్నారు.


హెచ్‌పీజీఎల్‌ ఫైనల్లో కళింగ, కాంటినెంటల్‌

హైదరాబాద్‌ ప్రీమియర్‌ గోల్ఫ్‌ లీగ్‌(హెచ్‌పీజీఎల్‌) టోర్నీలో కళింగ వారియర్స్‌, కాంటినెంటల్స్‌ వారియర్స్‌ తుది పోరులో నిలిచాయి. వూటీ గోల్ఫ్‌ కోర్స్‌లో శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో కళింగ టీమ్‌ 55-25 స్కోరుతో టీమ్‌అల్ఫాపై ఘన విజయం సాధించింది.


IND vs ENG: రెండో వన్డేలో కోహ్లీ కోసం త్యాగం చేసేదెవరు? .. ఆ ఇద్దరిలో ఒకరికి టీమ్‌లోప్లేస్ లేనట్లే!

Virat Kohli Injury Update: మోకాలి నొప్పి కారణంగా ఇంగ్లాండ్‌తో తొలి వన్డేకు దూరమైన విరాట్ కోహ్లీ.. రెండో వన్డేకు సిద్ధమయ్యాడు. అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. దీంతో అతడి కోసం తొలి మ్యాచ్‌లో ఆడిన ప్లేయర్లలో ఎవరిని పక్కనపెడతారనేది ఆసక్తికరంగా మారింది. కోహ్లీ గైర్హాజరీలో శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వచ్చాడు. కానీ మెరుపు హాఫ్ సెంచరీ చేసిన అతడిని పక్కనపెట్టలేని పరిస్థితి. దీంతో కోహ్లీ కోసం.. యశస్వి జైశ్వాల్‌ బెంచ్‌కు పరిమితం కానున్నాడు!


Cricket | ఇంగ్లాండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం.. సెంచ‌రీతో చెల‌రేగిన రోహిత్ శ‌ర్మ‌

Cricket | క‌ట‌క్ వ‌న్డేలో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది టీమిండియా. వ‌న్డేల్లో భార‌త్‌కు వ‌రుస‌గా ఇది ఏడో విజ‌యం.


తెలంగాణకు రెండు కాంస్యాలు

ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఆదివారం జరిగిన మహిళల నెట్‌బాల్‌, మహిళల 4X100 మీటర్ల రిలేలో తెలంగాణ క్రీడాకారులు కాంస్యాలతో మెరిశారు.


మార్చి 1న బీసీసీఐ ఎస్‌జీఎమ్‌

ముంబై ప్రధాన కార్యాలయం వేదికగా మార్చి 1వ తేదీన బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం(ఎస్‌జీఎమ్‌) జరుగనుంది. ఈ భేటీలో బోర్డు కొత్త సంయుక్త కార్యదర్శిని ఎన్నుకోనున్నారు. ఇప్పటి వరకు సంయుక్త కార్యదర్శిగా ఉన్న దేవజిత్‌ సైకియా ప్రస్తుతం కార్యదర్శిగా ఏకగీవ్రంగా ఎన్నిక కావడంతో ఆ పదవి ఖాళీ అయింది.


రెండు రోజులే గడువు.. బుమ్రా‌కు సాధ్యమవుతుందా!

Jasprit Bumrah: ఛాంపియన్స్ ట్రోఫీకి మరో 9 రోజుల్లో తెరలేవనుంది. అయితే భారత స్టార్ బౌలర్ బుమ్రా మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించలేదు. మరో రెండు రోజుల్లో తుది జట్టు సమర్పించాల్సి ఉంది. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న బుమ్రా.. గడువులోగా ఫిట్‌నెస్ సాధిస్తాడా.. లేడా అన్నది ఉత్కంఠగా మారింది. స్కానింగ్‌ల తర్వాత బీసీసీఐ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.


అంకిత్‌ శతకం

ముంబైతో ఈడెన్‌ గార్డెన్‌లో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్స్‌ పోరులో హర్యానా కెప్టెన్‌ అంకిత్‌ కుమార్‌ (136) శతకంతో మెరిశాడు. అంకిత్‌కు తోడు యశ్‌వర్ధన్‌ (36), లక్ష్య (34) రాణించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి హర్యానా ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 263/5 పరుగులు చేసింది.


సచిన్ కూతురు సారాతో శుభ్‌మన్ గిల్.. మహా కుంభమేళాలో కలుసుకున్నారా..?

క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్‌‌తో యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ప్రేమాయణం నడుపుతున్నాడని చాలా కాలంగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రూమర్లను బేస్ చేసుకొని మీడియాలోనూ అనేక కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మహా కుంభమేళాలో సచిన్ టెండుల్కర్ ఫ్యామిలీని శుభ్‌మన్ గిల్ కలిశాడంటూ ఓ ఫొటో వైరల్‌గా మారింది. అయితే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రూపొందించిన ఫొటో అని తేలింది.


హర్షప్రదకు రజతం

ఉత్తరాఖండ్‌ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక నేషనల్‌ గేమ్స్‌లో తెలంగాణ ఖాతాలో మరో పతకం చేరింది. తైక్వాండ్‌లో రాష్ట్ర యువ ప్లేయర్‌ పాయం హర్షప్రద రజత పతకంతో మెరిసింది. మహిళల 73కిలోల కేటగిరీలో హర్షప్రద సత్తాచాటి రెండో స్థానంలో నిలిచింది.


రాణించిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.. భారత్ టార్గెట్‌ 305 రన్స్‌

భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లాండ్ బ్యాటర్లు రాణించారు. కటక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. 49.5 ఓవర్లలో 304 రన్స్‌కి ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాటర్లలో జో రూట్, బెన్ డకెట్‌లు హాఫ్ సెంచరీలతో రాణించారు. లియామ్ లివింగ్ స్టోన్ కూడా విలువైన పరుగులు రాబట్టాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా అత్యధికంగా మూడు వికెట్లు తీశాడు.


మొన్న పాక్ నిన్న భారత్.. ట్రోల్సే ట్రోల్సూ!

Floodlight Failure: భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లు లేకపోయినా ఇరు దేశాల ఫ్యాన్స్ మధ్య మాత్రం నిత్యం నెట్టింట మాటల యుద్ధం మాత్రం జరుగుతూనే ఉంటుంది. అయితే ఈసారి రికార్డుల కోసమో, క్రికెటర్ల కోసమో వార్ జరగలేదు.. గ్రౌండ్ మెయింటనెన్స్‌పై ట్రోల్స్ నడిచాయి. పాకిస్తాన్‌లో ఫ్లడ్ లైట్సే సరిగ్గా ఉండవు ఇక ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తారా అని ఇండియన్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేసిన కొద్ది గంటల్లోనే మాకు చెప్పడం కాదు ముందు మీరు చూసుకోండి అంటూ భారత్ కౌంటర్...


రో'హిట్‌' సూపర్ హిట్‌.. వన్డే సిరీస్ కూడా మనదే..!

రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగడంతో ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం రోహిత్ శర్మ (119) విజృంభణతో భారత్.. 44.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. నామమాత్రపు మూడో వన్డే ఈనెల 12న అహ్మదాబాద్‌లో జరగనుంది.


యూనివర్సల్ బాస్‌నే దాటేసిన హిట్ మ్యాన్.. సిక్సర్‌ కా బాప్‌గా రోహిత్!

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన లిస్ట్‌‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. కటక్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో హిట్‌మ్యాన్ ఏడు సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. దాంతో వన్డేల్లో క్రిస్ గేల్ పేరిట ఉన్న 331 సిక్సర్లను దాటేసి రెండో స్థానానికి ఎగబాకాడు. కేవలం 259 ఇన్నింగ్స్‌లలోనే రోహిత్ శర్మ 334 సిక్సర్లు బాదాడు.


IND vs ENG Dream11 Prediction: ఇంగ్లాండ్‌తో రెండో వన్డే.. డ్రీమ్11 టీమ్, పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా..

India Vs England Dream11 Team Tips and Playing 11: ఇంగ్లాండ్‌ను తొలి వన్డేలో చిత్తు చేసిన భారత్.. రెండో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్‌ సొంతం చేసుకోవాలనుకుంటోంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టులో మార్పులు జరగనున్నాయి. విరాట్ కోహ్లీ తుది జట్టులోకి రానున్నాడు. ఈ మ్యాచ్‌కు డ్రీమ్11 టీమ్‌ను ఎలా ఎంచుకోవాలి..? పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది..? వివరాలు ఇలా..


Dommaraju Gukesh | ఫ్రీస్టయిల్‌ గ్రాండ్‌స్లామ్‌ టూర్‌.. నాకౌట్‌కు గుకేశ్‌

ఫ్రీస్టయిల్‌ గ్రాండ్‌స్లామ్‌ టూర్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ నాకౌట్‌ పోరుకు అర్హత సాధించాడు. మొత్తం తొమ్మిది రౌండ్ల పాటు సాగిన క్వాలిఫయర్స్‌లో గుకేశ్‌ ఏడు గేమ్‌లు డ్రా చేసుకోగా, రెండింటిలో ఓటమిపాలై ఎనిమిదో స్థానంలో నిలిచాడు.


IND vs ENG | సిరీస్‌లో కీలక పోరు.. బరిలో కోహ్లీ.. నేడు భారత్‌, ఇంగ్లండ్‌ రెండో వన్డే

భారత్‌, ఇంగ్లండ్‌ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కీలక పోరుకు వేళయైంది. ఆదివారం ఇరు జట్ల మధ్య బారాబతి స్టేడియం వేదికగా రెండో వన్డే జరుగనుంది. నాగ్‌పూర్‌ వన్డేలో ఘన విజయంతో టీమ్‌ఇండియా జోష్‌మీదుంటే..కటక్‌లో గెలిచి సిరీస్‌లో నిలువాలని ఇంగ్లండ్‌ చూస్తున్నది.


పట్టుబిగించిన ఆసీస్‌

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టుపై పర్యాటక ఆస్ట్రేలియా పట్టు బిగించింది. కుహెమన్‌(4/52), లియాన్‌ (3/80) ధాటికి లంక రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 211 స్కోరు చేసింది.


India vs England 2nd ODI | భారత్‌తో రెండో వన్డే.. భారీ స్కోర్‌ దిశగా ఇంగ్లండ్‌

India vs England 2nd ODI | టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత్‌కు ఫీల్డింగ్ అప్పగించింది. నిలకడగా బ్యాటింగ్‌ చేస్తూ దాదాపు 6 పరుగుల నెట్‌ రన్‌రేట్‌తో ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌ దిశగా దూసుకుపోతోంది.


ఆ ఘనత మాత్రం బీఆర్ఎస్ పార్టీదే.. కడియం శ్రీహరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తెలంగాణలో త్వరలోనే ఉపఎన్నికలు వస్తాయని.. కార్యకర్తలు, ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే స్పందించారు. ఉపఎన్నికలొస్తే తాను కచ్చితంగా బరిలో ఉంటానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. అయితే.. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీదేనని చెప్పుకొచ్చారు.


ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఊహించని షాక్!

Pat Cummins and Hazlewood: ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన ఆసీస్ స్క్వాడ్ నుంచి కెప్టెన్ కమిన్స్‌తో కలిపి నలుగురు ఆటగాళ్లు దూరమయ్యారు. కీలకమైన ట్రోఫీకి ముందు ఆసీస్ జట్టుకు ఇది సడెన్ షాక్ అని చెప్పొచ్చు.


దుబాయ్‌ కా సికందర్.. ఫోర్లు, సిక్సర్లతో మ్యాచ్‌నే మార్చేశాడు!

ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20) లో సికందర్ రజా తన తడాఖా చూపెట్టాడు. ఆల్‌మోస్ట్ ఓడిపోయే మ్యాచ్‌ని వరుస బౌండరీలతో గెలిపించి దుబాయ్ కా సికందర్ అనిపించుకున్నాడు. ఐఎల్‌టీ20 ఫైనల్స్‌లో దుబాయ్ క్యాపిటల్స్‌ని గెలిపించి తొలిసారి టైటిల్‌ను ముద్దాడాడు.


India vs England 2nd ODI | ముగిసిన ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌.. భారత్‌ ముందు భారీ లక్ష్యం

India vs England 2nd ODI | మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఆదివారం కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా రెండో వన్డే మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ భారత్‌ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.


రంజీ నాకౌట్‌ సమరం

దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. శనివారం నుంచి రంజీ నాకౌట్‌ సమరానికి తెరలేవనుంది. లీగ్‌ దశలో అదరగొట్టిన జట్లు కీలకమైన క్వార్టర్స్‌లో తాడోపేడో తేల్చుకోనున్నాయి. ముంబై-హర్యానా, విదర్భ-తమిళనాడు, జమ్ముకశ్మీర్‌-కేరళ, సౌరాష్ట్ర-గుజరాత్‌ వేర్వేరు వేదికల్లో తలపడనున్నాయి.


టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ సర్‌ప్రైజ్.. ఈ ఛాంపియన్స్ 'రింగ్' గురించి తెలుసా!

BCCI Champions Ring For Team India Cricketers: టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ సాధించిన భారత జట్టును బీసీసీఐ ఘనంగా సత్కరించింది. గతవారంలో ముంబైలో జరిగిన నమన్ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రత్యేక ఛాంపియన్స్ రింగ్‌ను ఆటగాళ్లందరికీ అందించింది. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా పంచుకుంది. ఈ కస్టమైజ్డ్ రింగ్‌లో టీ20 ప్రపంచకప్‌లో భారత జర్నీని తెలియజేసింది. టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఓడించి టైటిల్ దక్కించుకుంది.


MI ఫ్రాంఛైజీ లక్కీ బౌలర్.. ఓ మై బౌల్ట్!

Trent Boult:ట్రెంట్ బౌల్ట్ ఇప్పటివరకు ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ తరఫున నాలుగు దేశాల్లో ఆడగా నాలుగింటిలోనూ టైటిల్ సొంతం చేసుకోవడం విశేషం.


కోహ్లీ వచ్చేశాడు.. వరుణ్ ఎంట్రీ ఇచ్చాడు.. రెండో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌

మోకాలి గాయంతో ఇంగ్లాండ్‌తో తొలి వన్డేకు దూరమైన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. రెండో వన్డే కోసం తుది జట్టులోకి వచ్చాడు. ఇక వరుణ్ చక్రవర్తి సైతం కటక్ వన్డే ద్వారా వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు ఏకంగా మూడు మార్పులతో బరిలోకి దిగింది. ప్రస్తుతం సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది.