VICE CAPTAIN : బుమ్రా కాదు.. టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు ఎవ‌రికంటే?

న్యూఢిల్లీ: టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ(Vice Captain) ప‌గ్గాల‌ను .. జ‌స్ప్రీత్ బుమ్రాకు బ‌దులుగా మ‌రో ప్లేయ‌ర్‌కు ఇవ్వాల‌ని బీసీసీఐ వ‌ర్గాలు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో జ‌ర‌గ‌నున్న టెస్టు సిరీస్‌లో ఆ మార్పు జ‌ర‌గ‌నున్న‌ది. అయితే తాజాగా రిలీజైన ఓ రిపోర్టు ప్రకారం బుమ్రా స్థానంలో.. వైస్ కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను శుభ‌మ‌న్ గిల్‌కు అప్ప‌గించాల‌ని బీసీసీఐ వ‌ర్గాలు ప్లాన్ వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం టెస్టు క్రికెట్‌లో రోహిత్ శ‌ర్మ కెప్టెన్‌గా కొన‌సాగుతున్నాడు. అయితే అన్ని ఫార్మాట్ల‌లోనూ గిల్‌నే సార‌థిగా చేయాల‌న్న ఆలోచ‌న‌లు జ‌రుగుతున్నాయి.ఈ నేప‌థ్యంలో బంగ్లాతో జరిగే టెస్టు సిరీస్‌లో వైస్ కెప్టెన్సీని గిల్‌కు ఇవ్వ‌నున్నారు. బంగ్లాతో చెన్నైలో సెప్టెంబ‌ర్ 19వ తేదీన తొలి టెస్టు జ‌ర‌గ‌నున్న‌ది. నాగ‌పూర్‌లో సెప్టెంబ‌ర్ 27వ తేదీ నుంచి రెండ‌వ టెస్టు జ‌ర‌గ‌నున్న‌ది.

2024-07-27T04:00:44Z dg43tfdfdgfd