ODI WORLD CUP 2023 | ఇంగ్లండ్ స్టార్ ఓపెన‌ర్‌కు గాయం.. వ‌ర‌ల్డ్ క‌ప్ స్క్వాడ్‌లో బ్రూక్

ODI World Cup 2023 : ప్ర‌పంచ క‌ప్(World Cup) ముందు డిఫెండింగ్ చాంపియ‌న్‌ ఇంగ్లండ్‌(England)కు పెద్ద షాక్ త‌గిలింది. స్టార్ ఓపెన‌ర్ జేస‌న్ రాయ్‌(Jason Roy, గాయంతో మెగా టోర్నీకి దూరం కానున్నాడు. అత‌డి స్థానంలో విధ్వంస‌క బ్యాట‌ర్ హ్యారీ బ్రూక్‌ (Harry Brook) ఎంపిక‌య్యాడు. న్యూజిలాండ్ సిరీస్‌(Newzealand Series)లో మెరిసిన బ్రూక్‌కు ఇదే మొదటి ప్ర‌పంచ క‌ప్ కావ‌డం విశేషం.

ఇంగ్లండ్ జ‌ట్టు మొద‌ట ప్ర‌క‌టించిన‌ తాత్కాలిక స్క్వాడ్‌లో రాయ్ స‌భ్యుడు. అయితే.. స్వ‌దేశంలో న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్ స‌మ‌యంలో అత‌డికి వెన్నెముక ద‌గ్గ‌రి కండ‌రాలు ప‌ట్టేశాయి. దాంతో రాయ్ మ్యాచ్‌లు ఆడ‌లేదు. అయితే.. కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ మాత్రం అత‌డికి చాన్స్ ఇవ్వాల‌ని అనుకున్నాడు. కానీ, సెలెక్ట‌ర్లు మాత్రం రాయ్‌ను ప‌క్క‌న పెట్టాల‌ని నిర్ణ‌యించారు. దాంతో, బ్రూక్ 15మంది బృందంలో చోటు ద‌క్కించుకున్నాడు.

‘మేము బ‌ల‌మైన బృందాన్ని ఎంపిక చేశాం. భార‌త్‌లో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తామ‌నే న‌మ్మకం ఉంది. న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్‌లో మా ఆట‌గాళ్లు అద్భుతంగా రాణించారు. వ‌న్డేల్లో స్ట్రాంగ్ ప్లేయ‌ర్లు ఉండ‌డం మా అదృష్టం. గాయ‌ప‌డిన జేస‌న్ రాయ్‌ను త‌ప్పించ‌డం క‌ష్ట‌మైన నిర్ణ‌యమే. అతడి స్థానంలో హ్యారీ బ్రూక్ వ‌చ్చాడు’ అని ఇంగ్లండ్ సెలెక్ట‌ర్ ల్యూక్ రైట్(Luke Wright) ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపాడు.

ఇంగ్లండ్ వ‌ర‌ల్డ్ క‌ప్ స్క్వాడ్ :  జోస్ బ‌ట్ల‌ర్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మ‌ల‌న్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, సామ్ క‌ర‌న్, అదిల్ ర‌షీద్, డేవిడ్ విల్లే, రిసే టాప్లే, మార్క్ వుడ్, గ‌స్ అట్కిన్స‌న్‌.

ఐపీఎల్ 16వ సీజ‌న్‌(IPL 2023)లో 33 ఏళ్ల రాయ్ దంచి కొట్టాడు. ర‌హ్మ‌నుల్లా గుర్బాజ్‌తో క‌లిసి కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌(Kolkata Knight Riders)కు శుభారంభాలు ఇచ్చాడు. అందుక‌ని ఇంగ్లండ్ జ‌ట్టు వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అత‌డిపై భారీ ఆశ‌లు పెట్టుకుంది. కానీ, అనూహ్యంగా కండ‌రాల నొప్పితో రాయ్ టోర్నీకి దూర‌మ‌య్యే ప‌రిస్థితి వ‌చ్చింది. దాంతో, అత‌డి అంత‌ర్జాతీయ కెరీర్ ముగిసిన్టే అని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

జేస‌న్ రాయ్‌

స్వ‌దేశంలో జ‌రిగిన 2019 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఇంగ్లండ్ విజేత‌గా నిలిచింది. ఉత్కంఠ రేపిన ఫైన‌ల్లో చివ‌రికి సూప‌ర్ ఓవ‌ర్‌లో న్యూజిలాండ్‌పై గెలిచింది. ఈ ఏడాది టోర్నీ ఆరంభ పోరులో ఇంగ్లండ్, కివీస్ ఢీకొన‌నున్నాయి. అక్టోబ‌ర్ 5న భార‌త గ‌డ్డ‌పై వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ షురూ కానున్న విష‌యం తెలిసిందే.

ఇవి కూడా చ‌ద‌వండి

Mohammad Siraj | ఆసియా క‌ప్ హీరో సిరాజ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వాళ్ల‌కు ప్రైజ్‌మ‌నీ రూ. 4 లక్ష‌లు ఇచ్చేశాడు

Team India | ఆసియా క‌ప్ ఫైన‌ల్లో భారీ విజ‌యం.. వ‌న్డేల్లో రికార్డులు తిర‌గ‌రాసిన టీమిండియా

2023-09-17T15:53:56Z dg43tfdfdgfd