MOHAMMAD SIRAJ | ఆసియా క‌ప్ ఫైన‌ల్లో సిరాజ్ సూప‌ర్ స్పెల్.. శ్రీ‌లంక దిగ్గ‌జం రికార్డు స‌మం

Mohammad Siraj : ఆసియా క‌ప్(Asia Cup 2023) ఫైన‌ల్లో భార‌త పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్(Mohammad Siraj) సంచ‌ల‌న బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. ఈ స్పీడ్‌స్ట‌ర్ 6 వికెట్ల‌తో శ్రీ‌లంక(Srilanka)ను కోలుకోలేని దెబ్బ తీశాడు. బుల్లెట్ లాంటి బంతుల‌తో లంక టాపార్డ‌ర్‌ను కూల్చిన సిరాజ్ కెరీర్ బెస్ట్ గ‌ణాంకాలు న‌మోదు చేశాడు.

అంతేకాదు ఈ మెగా టోర్నీ ఫైన‌ల్లో ఆరు వికెట్లు తీసిన రెండో బౌల‌ర్‌గా రికార్డుగా రికార్డుల్లోకెక్కాడు. ఇంత‌కుముందు శ్రీ‌లంక దిగ్గ‌జం అజంత మెండిస్(Ajanta Mendis) ఈ ఫీట్ సాధించాడు. పాకిస్థాన్‌లోని క‌రాచీలో 2008లో భార‌త జ‌ట్టుపై మెండిస్ ఆరు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

అజంత మెండిస్

ఒకే ఓవ‌ర్లో 4 వికెట్లు

తొలి ఓవ‌ర్ మెయిడెన్ వేసిన సిరాజ్ ఆ త‌ర్వాత ఓవ‌ర్లో ఏకంగా ఓకే ఓవ‌ర్లో నాలుగు కీల‌క‌ వికెట్లు తీశాడు. దాంతో, అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఈ ఫీట్ సాధించిన తొలి భార‌త బౌల‌ర్‌గా సిరాజ్ రికార్డు సృష్టించాడు. నాలుగో ఓవర్ మొద‌టి బంతికి ఓపెన‌ర్ పథుమ్ నిస్సంక‌(2)ను ఔట్ చేశాడు. ఆ త‌ర్వాతి మూడు, నాలుగు బంతుల్లో స‌ధీర స‌మ‌ర‌విక్ర‌మ‌(0), చ‌రిత అస‌లంక‌(0)ను ఔట్ చేశాడు.

హ్యాట్రిక్ బంతికి బౌండ‌రీ కొట్టిన ధ‌నంజ‌య డిసిల్వా(4) ఆఖ‌రి బంతికి రాహుల్ చేతికి చిక్కాడు. ఆరో ఓవ‌ర్‌లో సిరాజ్ అద్బుత బంతితో లంక కెప్టెన్ ద‌సున్ శ‌న‌క‌(0)ను బౌల్డ్ చేశాడు. దాంతో, ఐదో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ఆ త‌ర్వాతి ఓవ‌ర్లోనే సిరాజ్ క్రీజులో కుదురుకున్న కుశాల్ మెండిస్‌(17)ను బౌల్డ్ చేయ‌డంతో లంక కోలుకోలేక‌పోయింది.

2023-09-17T12:23:37Z dg43tfdfdgfd