Trending:


IPL 2024: కీలక మ్యాచ్‌లకు ముందు జట్లకు షాక్.. వెళ్లిపోతున్న ఇంగ్లాండ్ ప్లేయర్లు..!

ఐపీఎల్ 2024 ముగింపు దశకు చేరుకున్న వేళ.. ఇంగ్లాండ్ ప్లేయర్లు పలు ఫ్రాంఛైజీలకు షాక్ ఇస్తున్నారు. పాకిస్థాన్‌తో టీ20 సిరీస్‌లో ఆడేందుకు తప్పనిసరిగా రావాలని ఈసీబీ ఆదేశించడంతో ఐపీఎల్‌ను వీడి ఇంగ్లాండ్‌కు పయనమవుతున్నారు. ఇందులో జాస్ బట్లర్, విల్ జాక్స్, మొయిన్ అలీ, రీస్ టాప్లే వంటి ప్లేయర్లు ఉన్నారు. ప్లే ఆఫ్స్ దశ సమీపిస్తున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ ప్లేయర్ల సేవలు కోల్పోవడం ఆయా జట్లకు ఇబ్బంది కరంగా మారింది.


'ధోనీ గాడ్ ఆఫ్ ది చెన్నై'.. అతడి కోసం గుళ్లు కడతారు: సీఎస్కే మాజీ ప్లేయర్

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోనీకి ఉండే క్రేజే వేరు. చెన్నైలో అతడికి ఫ్యాన్స్ కాదు.. ఏకంగా భక్తులే ఉంటారు. తన సారథ్యంలో సీఎస్కేను ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన ధోనీ.. చెన్నై ఫ్యాన్స్ అభిమానాన్ని చూరగొన్నాడు. ఈ సీజన్‌తో ఐపీఎల్‌కు రిటైర్మెంట్ భావిస్తాడని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధోనీ కోసం చెన్నై ఫ్యాన్స్ గుళ్లు కడతారని.. సీఎస్కే మాజీ ప్లేయర్ అంబటి రాయుడు వ్యాఖ్యానించాడు. ధోనీపై కీలక వ్యాఖ్యలు చేశాడు.


Kylian Mbappe | పీఎస్‌జీకి చివరి హోం గేమ్‌ ఆడిన ఎంబాపె

ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ ఫ్రాంచైజీ పారిస్‌ సెయింట్‌ జర్మన్‌ (పీఎస్‌జీ)తో ఏడేండ్ల బంధాన్ని త్వరలో తెంచుకోనున్న ఫ్రెంచ్‌ ఫుట్‌బాల్‌ యువ సంచలనం కిలియన్‌ ఎంబాపె.. ఆ జట్టు తరఫున చివరి హోమ్‌ గేమ్‌ ఆడేశాడు.


CSK vs RR | గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ప్లే ఆఫ్స్‌లో నిలిచిన చెన్నై

CSK vs RR : ప్లే ఆఫ్స్ రేసులో నిల‌వాలంటే గెల‌వ‌క త‌ప్ప‌ని పోరులో డిఫెండింగ్ చాంపియ‌న్‌ చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) పంజా విసిరింది. లో స్కోర్ మ్యాచ్‌లో టేబుల్ టాప‌ర్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ (Rajasthan Royals)ను చిత్తుగా ఓడించింది.


గ్రామీణ క్రికెటర్లను ఐపీఎల్‌లో చూడాలన్నదే మా కల

అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు ప్రాతినిథ్యం వహించే ఐపీఎల్‌ వంటి మెగా లీగ్‌లో తెలంగాణ గ్రామీణ క్రికెటర్లను చూడాలన్నదే తమ ఆకాంక్ష అని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు అన్నారు.


KKR vs MI | న‌రైన్ గోల్డెన్ డ‌క్.. కోల్‌క‌తాను వ‌ణికిస్తున్న ముంబై పేస‌ర్లు

KKR vs MI : వ‌ర్షం కార‌ణంగా ఆల‌స్యంగా మొద‌లైన మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్(KKR) ఆదిలోనే క‌ష్టాల్లో ప‌డింది. ముంబై ఇండియ‌న్స్ పేస‌ర్ల విజృంభ‌ణ‌తో 10 ప‌రుగుల‌కే ఓపెన‌ర్ల‌ వికెట్లు కోల్పోయింది.


Esha Singh | పారిస్‌ ఒలింపిక్స్‌కు హైదరాబాదీ షూటర్‌ ఇషా సింగ్‌

హైదరాబాదీ షూటర్‌ ఇషా సింగ్‌ పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తును దక్కించుకుంది. భోపాల్‌ వేదికగా జరుగుతున్న ఒలింపిక్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌లో భాగంగా మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌ టీ4లో భారత స్టార్‌ షూటర్‌ మనూ భాకర్‌ 586 స్కోరు చేయగా ఇషా సైతం 586 పాయింట్లతో టాప్‌-2లో నిలిచి పారిస్‌ కోటాను ఖాయం చేసుకున్నారు.


Nikhat Zareen | ఎలోర్డ కప్‌.. నిఖత్‌ తొలి పంచ్‌ అదుర్స్‌

పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు అస్తానా (కజకిస్థాన్‌) వేదికగా జరుగుతున్న ఎలోర్డ కప్‌లో వరల్డ్‌ చాంపియన్‌, తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ తొలిరౌండ్‌లో అదరగొట్టింది. సోమవారం జరిగిన మొదటి రౌండ్‌లో నిఖత్‌ (52 కిలోల విభాగంలో).. 5-0 తేడాతో రఖైంబెర్డి జన్సాయాను ఓడించింది.


KKR vs MI: ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఇదేం పాడు పనిరా బాబూ.. పోలీసుకు దొరికిపోయాడుగా..!

Kolkata Knight Riders Mumbai Indians Match: ఐపీఎల్ 2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా మే 11న జరిగిన మ్యాచులో ఆసక్తికర సన్నివేశం జరిగింది. కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచు బంతిని ఎత్తుకెళ్లేందుకు ఓ ఫ్యాన్ ప్రయత్నించాడు. ప్యాంటు జేబులో బంతిని దాచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని అక్కడే విధుల్లో ఉన్న పోలీసు గమనించాడు. దీంతో కేకేఆర్ ఫ్యాన్ చేసిన ప్రయత్నం విఫలమైంది.


IPL | రేసు రసవత్తరం!.. కీలక దశకు చేరినా ఖరారు కాని ప్లేఆఫ్స్‌ బెర్తులు

నెలన్నర రోజులుగా క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌-17) కీలక దశకు చేరుకుంది. లీగ్‌ స్టేజీలో ఏడు మ్యాచ్‌లే మిగిలున్న ఈ టోర్నీలో ఇప్పటివరకు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) మాత్రమే అధికారికంగా ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారుచేసుకుంది.


చెపాక్‌లో చెన్నై ఆల్ రౌండ్ షో.. ప్లే ఆఫ్స్ దిశగా మరో అడుగు..!

ఐపీఎల్ 2024లో ప్లే ఆప్స్ దిశగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరో అడుగు ముందుకేసింది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో 5 వికెట్లు తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది. సీజన్ ఆరంభంలో వరుస విజయాలు సాధించిన రాజస్థాన్.. తాజాగా హ్యాట్రిక్ ఓటములు నమోదు చేసింది. ఈ మ్యాచులో రాజస్థాన్ నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని మరో 10 బంతులు మిగిలి ఉండగానే చెన్నై ఛేదించింది.


అమన్‌కు పారిస్‌ టికెట్‌

వరల్డ్‌ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన ఫ్రీ స్టయిల్‌ విభాగంలో భారత యువ రెజ్లర్‌ అమన్‌ సెహ్రావత్‌ అదరగొట్టాడు.


IPL 2024 | రిష‌భ్ పంత్‌పై నిషేధం.. షాక్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్

IPL 2024 : ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌తో పున‌రామ‌నం చేసిన రిష‌భ్ పంత్(IPL 2024) జ‌ట్టును అద్భుతంగా న‌డిపిస్తున్నాడు. అయితే.. ప్లే ఆఫ్స్ బెర్తుపై క‌న్నేసిన పంత్‌కు భారీ షాక్ త‌గిలింది. అత‌డిపై బీసీసీఐ ఒక మ్యాచ్ నిషేధం విధించింది.


GT vs KKR IPL 2024: వర్షంతో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్‌ నుంచి గుజరాత్ టైటాన్స్ ఔట్

ఐపీఎల్‌లో అడుగుపెట్టిన తొలి సీజన్‌లోనే విజేతగా నిలిచి.. రెండో సీజన్‌లో ఫైనల్ వరకూ వచ్చిన గుజరాత్ టైటాన్స్.. ఈసారి ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది. సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు టాప్-2 ప్లేసును ఖరారు చేసుకుంది.


CSK vs RR Dream11 Team: రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌ బిగ్‌ ఫైట్.. హెడ్ టు హెడ్ రికార్డులు.. డ్రీమ్11 టీమ్ ఇదిగో..!

Chennai Super Kings Vs Rajasthan Royals Playing XI Dream11 Team Tips: రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే రాజస్థాన్ ప్లే ఆఫ్స్‌లో అధికారికంగా అడుగుపెట్టనుంది. ఇక ఈ మ్యాచ్‌ చెన్నై సూపర్ కింగ్స్‌కు కీలకంగా మారనుంది. డ్రీమ్11 టీమ్, హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా..


MS Dhoni: బిగ్ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కు CSK రిక్వెస్ట్.. ధోనీ రిటైర్మెంట్ అనౌన్స్‌మెంట్..!

MS Dhoni Retirement Announcement: ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. రిటైర్మెంట్ చెప్పనున్నాడా? చెపాక్‌లో జరిగే చివరి లీగ్ స్టేజ్ మ్యాచులోనే తన నిర్ణయం ప్రకటించనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మేరకు రాజస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు సీఎస్కే బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. మ్యాచ్ తర్వాత ఫ్యాన్స్ స్టేడియంలోనే ఉండాలని కోరింది.


ఇస్తాంబుల్‌లోనూ అదే కథ

వరల్డ్‌ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలోనూ భారత రెజ్లర్ల వైఫల్య ప్రదర్శన కొనసాగింది. పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తులను నిర్ణయించే ఈ టోర్నీలో భాగంగా ఆఖరి రోజైన ఆదివారం బరిలోకి దిగిన ఇద్దరు ఫ్రీస్టయిల్‌ రెజ్లరూ ఓడారు.


CSK vs RR | చెపాక్‌లో ప‌రాగ్ ఒంట‌రి పోరాటం.. చెన్నై గెలుపు లాంఛ‌న‌మేనా..?

CSK vs RR : ప్లే ఆఫ్స్ రేసులో నిల‌వాలంటే గెల‌వ‌క త‌ప్ప‌ని పోరులో చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings)బౌల‌ర్లు అద‌ర‌గొట్టారు. టేబుల్ టాప‌ర్‌గా ఉన్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్యాట‌ర్ల జోరుకు ముకుతాడు వేశారు.


CSK vs RR | టాస్ గెలిచి బ్యాంటింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌

CSK vs RR | ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో ప్లే ఆఫ్స్ రేసు ఆస‌క్తిక‌రంగా మారిన వేళ చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) కీల‌క మ్యాచ్ ఆడబోతున్నది. టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ సాంసన్‌(Sanju Samson )బ్యాంటింగ్‌ ఎంచుకున్నాడు.


CSK vs RR | ఆచితూచి ఆడుతున్న ఆర్‌ఆర్‌.. స్కోర్‌ ఎంతంటే?

CSK vs RR | ఐపీఎల్(IPL2024) ప‌దిహేడో సీజ‌న్‌లో భాగంగా సీఎస్‌ఎకేతో(CSK) జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌తో జట్టు ఆచితూచి ఆడుతున్నది.


దీక్ష సరికొత్త రికార్డు

భారత ట్రాక్‌ అథ్లెట్‌ కెఎం దీక్ష మహిళల 1500 మీటర్ల పరుగు పందెంలో సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది. లాస్‌ ఏంజెల్స్‌ వేదికగా జరుగుతున్న సౌండ్‌ రన్నింగ్‌ ట్రాక్‌ ఫెస్ట్‌లో భాగంగా శనివారం ముగిసిన ఫైనల్‌ రేసును 4:4.78 నిమిషాలలో పూర్తిచేసిన దీక్ష మూడో స్థానంలో నిలిచింది.


RCB vs DC IPL 2024: వరుసగా ఐదో విజయం.. ప్లే ఆఫ్స్ దిశగా దూసుకెళ్తున్న ఆర్సీబీ..!

DC vs RCB: ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ దిశగా ఆర్సీబీ మరో అడుగు ముందుకేసింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో 47 రన్స్ తేడాతో గెలిచి.. పాయింట్ల పట్టికలో ఐదో ప్లేసుకు ఎగబాకింది. ఈ సీజన్‌లో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసిన ఆర్సీబీ.. చివరి మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఓడిస్తే ముందంజ వేసే అవకాశం ఉంది. ఈ ఫలితంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.


ఢిల్లీకి షాక్‌.. కీలక మ్యాచ్‌కు పంత్‌ దూరం

ఐపీఎల్‌-17 ప్లేఆఫ్స్‌ రేసులో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆదివారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో కీలక మ్యాచ్‌ ఆడనున్న వేళ ఆ జట్టుకు భారీ షాక్‌ తగిలింది.


Ranji Trophy | దేశవాళీ క్రికెట్‌లో సంస్కరణలు.. రెండు దఫాలుగా రంజీ: బీసీసీఐ

దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్టాత్మక రంజీ సీజన్‌ను ఇకనుంచి రెండు దశలుగా నిర్వహించనున్నట్టు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది.


IPL 2024: సండే స్పెషల్.. నేడు కీలక మ్యాచ్‌లు, ఆ రెండు టీమ్‌ల మధ్య టఫ్ ఫైట్!

IPL Play offs: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు ప్రేక్షకులకు రెట్టించిన ఎంటర్‌టైన్‌మెంట్ దక్కనుంది. వీకెండ్ సందర్భంగా నేడు రెండు మ్యాచులు జరగనున్నాయి. ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారిన నేపథ్యంలో ఇవాళ తలపడే నాలుగు జట్లూ కూడా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం జరిగే మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లు.. సాయంత్రం జరిగే మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంటళూరు-డిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి.


RCB vs DC | ఆ న‌లుగురు ఔట్.. మిడిలార్డ‌ర్‌పైనే ఢిల్లీ ఆశ‌ల‌న్నీ

RCB vs DC : భారీ ఛేద‌న‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. చిన్న‌స్వామి స్టేడియంలో ఆర్సీబీ బౌలర్ల విజృంభ‌ణ‌తో ప‌వ‌ర్ ప్లేలో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఒక‌రి వెన‌కు ఒక‌ర‌కు డ‌గౌట్‌కు క్యూ క‌డుతున్నారు.


చెన్నై సేఫ్‌

ఐపీఎల్‌-17లో ఒడిదొడుకుల మధ్య సాగుతున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ సూపర్‌ కింగ్స్‌.. ప్లేఆఫ్స్‌ రేసులో నిలిచేందుకు రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన అత్యంత కీలకమ్యాచ్‌లో సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టింది.


IPL 2024: 7 మ్యాచ్‌లు, 3 బెర్తులు.. ఆసక్తికరంగా ప్లే ఆఫ్స్ రేసు..!

IPL Points Table: ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. లీగ్ దశలో ఇంకా ఏడు మ్యాచులు జరగాల్సి ఉండగా.. మిగిలిన మూడు ప్లేసుల కోసం ఏకంగా ఆరు జట్ల పోటీ పడుతున్నాయి. ఇందులో రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ముందంజలో ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు సైతం అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.


IPL Playoffs 2024: ముంబైని చిత్తు చేసి 'ప్లే ఆఫ్స్‌'లోకి అడుగుపెట్టిన కేకేఆర్..!

IPL Playoffs 2024: ఐపీఎల్ 2024లో అదిరే ప్రదర్శన చేస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు.. ప్లే ఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది. శనివారం ముంబై ఇండియన్స్‌ను 18 పరుగుల తేడాతో ఓడించింది. ఈ ఫలితంతో సీజన్‌లో 9వ విజయాన్ని నమోదు చేసి.. టేబుల్ టాపర్ ప్లేసును సుస్థిరం చేసుకుంది. అటు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై.. సీజన్‌లో 9వ ఓటమిని నమోదు చేసింది.


Gujarat Titans | టైటాన్స్‌ ప్లేఆఫ్స్‌ ఆశలు గల్లంతు.. టాస్‌ కూడా పడకుండానే గుజరాత్‌-కోల్‌కతా మ్యాచ్‌ రద్దు

నిండు వేసవిలో అహ్మదాబాద్‌ను ముంచెత్తిన అకాల వర్షం.. ఐపీఎల్‌లో రెండుసార్లు ఫైనల్‌కు చేరిన గుజరాత్‌ టైటాన్స్‌ ప్లేఆఫ్స్‌ ఆశలపై నీళ్లు చల్లింది. అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సోమవారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరగాల్సిన మ్యాచ్‌ వరుణుడి అంతరాయంతో టాస్‌ పడకుండానే రద్దయ్యింది.


CSK vs RR | సిమ‌ర్జిత్‌కు మూడో వికెట్‌.. క‌ష్టాల్లో రాజ‌స్థాన్

CSK vs RR : ప్లే ఆఫ్స్ బెర్తుకు అడుగు దూరంలో ఉన్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్(Rajasthan Royals) క‌ష్టాల్లో ప‌డింది. చిన్న‌స్వామి స్టేడియంలో సీఎస్కేతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో వంద లోపే మూడు వికెట్లు కోల్పోయింది.


IPL | ఐపీఎల్‌ను వీడుతున్న ఇంగ్లండ్‌ క్రికెటర్లు.. ఎందుకంటే?

మార్చి మాసాంతం నుంచి జరుగుతున్న ఐపీఎల్‌-17లో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా వీడ్కోలు పలుకుతున్నారు. త్వరలో మొదలుకాబోయే టీ20 ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా ఇంగ్లండ్‌.. పాకిస్థాన్‌తో టీ20 సిరీస్‌ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఈ సీజన్‌కు గుడ్‌బై చెబుతున్నారు.


T20 World Cup 2024 | సెంచ‌రీ హీరోకు నో చాన్స్.. నమీబియా స్క్వాడ్ ఇదే..!

T20 World Cup 2024 : టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం నమీబియా సెలెక్ట‌ర్లు స్క్వాడ్‌ను ప్ర‌క‌టించారు. గెరార్డ్ ఎరాస్మ‌స్ (Gerald Erasmus) సార‌థిగా ప‌దిహేను మందితో కూడిన బృందంలోని స‌భ్యుల పేర్ల‌ను శ‌నివారం వెల్ల‌డించారు.


Sunrisers: ప్లేఆఫ్స్‌లో చెన్నైతో కష్టం.. ఆర్సీబీ అయితే ఓకే.. చరిత్ర చెబుతోన్న గణాంకాలివే!

ఐపీఎల్ 2024లో ప్లేఆఫ్స్ చేరే జట్ల విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ లీగ్ దశలోనే నిష్క్రమించగా.. మిగతా 8 జట్లూ టాప్-4 జాబితాలో చోటు కోసం పోటీలో ఉన్నాయి. రాజస్థాన్, కోల్‌కతా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడం ఖాయం కాగా.. మిగతా రెండు స్థానాల్లో ఒక దాన్ని సన్‌రైజర్స్ దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మనతోపాటు ఆర్సీబీ కూడా ప్లేఆఫ్స్ చేరితే బాగుంటుందని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ భావిస్తున్నారు.


RCB vs DC | స్ట‌బ్స్ ర‌నౌట్.. పోరాడుతున్న అక్ష‌ర్ ప‌టేల్

RCB vs DC: భారీ ఛేద‌న‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌రుస‌గా వికెట్లు కోల్పోతూ ఓట‌మి అంచున నిలిచింది. ఫామ్‌లో ఉన్న ట్రిస్ట‌న్ స్ట‌బ్స్(3) అనూహ్యంగా ర‌నౌట‌య్యాడు.


CSK vs RR | మొదటి వికెట్ కోల్పోయిన ఆర్‌ఆర్‌.. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్న సీఎస్‌కే

CSK vs RR | రాజస్థాన్ రాయల్స్‌( RR) తన మొదటి వికెటును కోల్పోయింది. భారీ షాట్‌కు యత్నించిన యశస్వి జైస్వాల్‌‌(24) సీమర్‌ జీత్‌ బౌలింగ్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.


పర్వేజ్‌ ఖాన్‌కు స్వర్ణం

భారత యువ అథ్లెట్‌ పర్వేజ్‌ ఖాన్‌ ఫ్లోరిడావేదికగా జరుగుతున్న సౌత్‌ఈస్ట్రన్‌ కాన్ఫరెన్స్‌ ఔట్‌డోర్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచాడు.


RCB: అనుష్క శర్మ ఆనందం చూశారా.. మజిల్స్ చూపిస్తూ కోహ్లీ సంబరం

Anushka Sharma: ఐపీఎల్ 2024లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా ఐదో విజయం నమోదు చేసిన అనంతరం విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సెలబ్రేట్ చేసుకున్నారు. విజయం ఖరారు కాగానే ఎగిరి గంతేశారు. కోహ్లీ సైతం గెలుపు సంకేతాలను తన భార్యకు అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించడంతో ఆనందం కట్టలు తెంచుకుంది.


బ్లిట్జ్‌లోనూ నిరాశే

సూపర్‌బెట్‌ ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్లు నిరాశపరుస్తున్నారు. ర్యాపిడ్‌ రౌండ్లలో తేలిపోయిన మన కుర్రాళ్లు బ్లిట్జ్‌లోనూ తడబడుతున్నారు.


ఆర్సీబీ అంటార్రా బాబు.. వాట్ ఏ కమ్‌బ్యాక్.. అట్టడుగు నుంచి ఐదో స్థానానికి..!

ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. దీంతో పాయింట్ల పట్టికలో ఐదో ప్లేసుకు చేరింది. ఈ సీజన్‌లో తొలి 8 మ్యాచుల్లో ఒకే విజయం సాధించిన ఆర్సీబీ.. ఆ తర్వాత వరుసగా ఐదింట్లో గెలుపొందింది. పది రోజుల వ్యవధిలోనే పాయింట్ల పట్టికలో పదో ప్లేసు నుంచి ఐదో స్థానానికి వచ్చింది. లీగ్ దశలో చివరి మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనున్న ఆర్సీబీ.. అందులో గెలిస్తే ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది.


RCB vs DC | పాటిదార్, జాక్స్ విధ్వంసం.. ఢిల్లీకి పెద్ద స‌వాల్ విసిరిన‌ ఆర్సీబీ

RCB vs DC : ప్లే ఆఫ్స్ ఆశ‌లు సన్న‌గిల్లిన వేళ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(RCB) బ్యాట‌ర్లు చిత‌క్కొట్టారు. చిన్న‌స్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌల‌ర్ల‌ను ఉతికేస్తూ ఆర్సీబీ ర‌జ‌త్ పాటిదార్(52) అర్ధ సెంచ‌రీతో చెల‌రేగ‌గా.. డేంజ‌ర‌స్ విల్ జాక్స్(41) ఖ‌త‌ర్నాక్ ఇన్నింగ్స్ ఆడాడు.


Sean Williams | టీ20 క్రికెట్‌కు స్టార్‌ ఆల్‌రౌండర్‌ సీన్‌ విలియమ్స్‌ గుడ్‌బై..

Sean Williams | జింబాబ్వే స్టార్‌ ఆల్‌రౌండర్‌ సీన్‌ విలియమ్స్‌ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అయితే, టీ20 వరల్డ్‌ కప్‌కు ముందు ఆల్‌ రౌండర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం ఆ జట్టుకు పెద్ద షాకింగ్‌ వార్తే. జూన్‌ 2న టీ20 ప్రపంచకప్‌ వెస్టిండీస్‌, అమెరికా వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే.


కీలక మ్యాచ్‌కు ముందు ఢిల్లీకి బిగ్‌ షాక్‌.. పంత్‌పై సస్పెన్షన్‌ వేటు!

ఆర్సీబీతో కీలక మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్‌ రేటు నమోదు చేసిందుకు గానూ ఆ జట్టు కెప్టెన్ రిషభ్‌ పంత్‌పై వేటు పడింది. ఈ సీజన్‌లో మూడో సారి స్లో ఓవర్‌ రేటు నమోదు చేసినందుకు గానూ.. అతడిపై ఒక మ్యాచ్‌ నిషేధం విధిస్తూ ఐపీఎల్‌ నిర్ణయం తీసుకుంది. భారీగా జరిమానా సైతం విధించింది. దీంతో ఆదివారం ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌కు రిషభ్‌ పంత్‌ దూరం కానున్నాడు.


ఢిల్లీ ఔట్‌

ఐపీఎల్‌-17 ప్లేఆఫ్స్‌ రేసులో ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తప్పటడుగులు వేసి తగిన మూల్యం చెల్లించుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు.. 47 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించింది.


రూ.400 కోట్ల లాభం వస్తుంటే అరవాల్సిన అవసరమేంటి?.. లక్నో యజమానిపై సెహ్వాగ్ ఆగ్రహం

Lucknow Super Giants Owner Sanjiv Goenka: సన్ రైజర్స్ హైదరాబాద్‌‌తో మ్యాచులో ఓటమి అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా.. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో ప్రవర్తించిన తీరుపై టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పుకొచ్చాడు. రూ.400 కోట్ల లాభం వస్తున్నప్పుడు ఆటగాళ్లపై అరవాల్సిన అవసరం ఏముందని వ్యాఖ్యానించాడు. సెహ్వగ్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.


IPL 2024 | అభిమానులారా స్టేడియంలోనే ఉండండి.. స‌ర్‌ప్రైజ్ ఏంట‌బ్బా..?

IPL 2024 : ప‌దిహేడో సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (Chennai Super Kings)సొంత‌గ‌డ్డ‌పై ఆఖ‌రి మ్యాచ్ ఆడుతోంది. ఈ సంద‌ర్బంగా చెపాక్ స్టేడియాని (Chepauk Stadium)కి విచ్చేసిన‌ అభిమానుల‌కు సీఎస్కే ఫ్రాంచైజీ ఓ సందేశం పంపింది.


జొకో తలకు గాయం

ఇటాలియన్‌ ఓపెన్‌లో ఆడుతున్న టాప్‌ సీడ్‌ నొ వాక్‌ జొకోవిచ్‌ తలకు స్వల్ప గాయమైంది.


RCB vs DC | ఆర్సీబీకి ఆదిలోనే షాక్.. ఇషాంత్‌కు బిగ్ వికెట్

RCB vs DC : సొంత‌మైదానంలో ఢిల్లీతో జ‌రుగుతున్న కీల‌క పోరులో ఆర్సీబీ రెండు కీల‌క వికెట్లు కోల్పోయింది. బౌండ‌రీలతో హోరెత్తిస్తున్నవిరాట్ కోహ్లీ(27)ని ఇషాంత్ బోల్తా కొట్టించాడు.


అండర్సన్‌ అల్విదా!

రెండు దశాబ్దాల అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌ దిగ్గజం జేమ్స్‌ అండర్సన్‌ వీడ్కోలు ప్రకటించాడు. నాలుగు పదుల (41 ఏండ్లు) వయసులోనూ యువ పేసర్లకు దీటుగా బౌలింగ్‌ చేస్తున్న జిమ్మీ (అండర్సన్‌ ముద్దుపేరు) జులైలో వెస్టిండీస్‌తో లార్డ్స్‌ వేదికగా జరుగబోయే మొదటి టెస్టు తన కెరీర్‌లో చివరి మ్యాచ్‌ అని స్పష్టం చేశాడు.


RCB vs DC | యాభై కొట్టిన‌ పాటిదార్.. ఆర్సీబీ స్కోర్..?

RCB vs DC : చిన్న‌స్వామి స్టేడియంలో ఆర్సీబీ హిట్ట‌ర్ ర‌జ‌త్ పాటిదార్(52) అర్ధ సెంచ‌రీ బాదాడు. రెండు సార్లు ఔట‌య్యే ప్ర‌మాదం త‌ప్పించుకున్న అత‌డు యాభైతో జ‌ట్టుకు అండ‌గా నిలిచాడు.