పెర్త్‌లో తొలి టెస్టు..అడిలైడ్‌లో గులాబీ పోరు

  • భారత్‌, ఆసీస్‌ టెస్టు సిరీస్‌ షెడ్యూల్‌ విడుదల

సిడ్నీ: భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ (బీజీటీ)లో ఈ ఏడాది నుంచి ఐదు టెస్టులు ఉంటాయని ఇప్పటికే ప్రకటించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) తాజాగా ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌నూ వెల్లడించింది. ఈ ఏడాది నవంబర్‌ 22 నుంచి మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌ జనవరి 7 దాకా కొనసాగనుంది. తొలి టెస్టుకు పెర్త్‌ ఆతిథ్యమివ్వనుండగా 2020-21లో భారత్‌ 36 పరుగులకే ఆలౌట్‌ అయిన అడిలైడ్‌లో గులాబీ బంతితో డే అండ్‌ నైట్‌ టెస్టు జరుగనుంది. గబ్బా, మెల్‌బోర్న్‌ (బాక్సింగ్‌ డే టెస్టు), సిడ్నీలో తర్వాత మ్యాచ్‌లు జరుగుతాయని సీఏ ప్రకటించింది. ఈ సిరీస్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఉమెన్స్‌ యాషెస్‌, పాకిస్థాన్‌తో పరిమిత ఓవర్ల షెడ్యూల్‌నూ సీఏ వెల్లడించింది. కాగా 2017 నుంచి భారత్‌.. వరుసగా నాలుగు సార్లు బీజీటీని నిలబెట్టుకుంటోంది. ఆస్ట్రేలియాలో 2019-20, 2021-2022లో టీమ్‌ఇండియాదే విజయం. ఈ ఏడాదీ గెలిస్తే భారత్‌ హ్యాట్రిక్‌ కొట్టనుంది.

2024-03-26T22:48:09Z dg43tfdfdgfd