పారిస్‌ ఒలింపిక్స్‌లో ‘ఏఐ’

పారిస్‌: మరికొద్దిరోజుల్లో మొదలుకాబోయే పారిస్‌ ఒలింపిక్స్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ)ను వినియోగించనున్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్‌ సమాఖ్య (ఐవోసీ) అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ తెలిపారు. విశ్వక్రీడల్లో ఏఐని బాధ్యతాయుతంగా వాడుతామని ఆయన అన్నారు.

ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులు ఆన్‌లైన్‌లో వేధింపులు ఎదుర్కోకుండా అడ్డుకోవడానికి, ఈ క్రీడలను ఇంటినుంచే చూసే వీక్షకులకు ఆ ప్రసారాలను మరింత మెరుగ్గా అందించే క్రమంలో ప్రసారకర్తలకు సాయపడటానికి గాను ఏఐని వాడనున్నట్టు ఆయన చెప్పారు.

2024-04-19T19:47:19Z dg43tfdfdgfd