T20 WORLD CUP 2024: టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా జట్టు ఇదే.. వైరల్ అవుతున్న లిస్ట్..!

Team India's Squad for T20 World Cup 2024 : ఓ వైపు ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా సాగుతుంటే.. మరోపక్క త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్ కు ఎవరు ఎంపిక అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కొంత మంది పేర్లు ఫిక్స్ కాగా.. మిగతా స్థానాల కోసం టీమిండియా యువ క్రికెటర్లు పోటీపడుతున్నారు. జూన్ 02 నుంచి టీ20 వరల్డ్ కప్ వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జరగనుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన జట్టును ఈనెల చివరిలో ప్రకటించే అవకాశం ఉంది. బీసీసీఐ సెలెక్టర్లు ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. 

ఈ ఫ్లేయర్లు ఫిక్స్..

మీడియా కథనాల ప్రకారం, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ త్వరలో 15 మందితో కూడిన జట్టును ప్రకటించినుంది. స్టాండ్‌బైగా ఐదుగురు ఆటగాళ్లు తీసుకోనున్నారు. మెుత్తం ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ ఫిక్స్ అయినట్లు సమాచారం.  ఆల్ రౌండర్ల జాబితాలో జడేజాకు చోటు ఖాయం. మిగతా స్థానాల కోసం అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దుబే పోటీపడనున్నారు. 

ఇషాన్‌ కిషన్‌కు దక్కని చోటు..

ఈసారి ముగ్గురు వికెట్ కీపర్లను తీసుకోనున్నారు. ఈరేసులో రిషభ్ పంత్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇషాన్‌ కిషన్‌ చోటు దక్కకపోవచ్చు. పేసర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మిగతా ఇద్దరిలో అర్ష్‌దీప్ సింగ్‌, అవేష్ ఖాన్ కు చోటు దక్కే అవకాశం ఉంది. స్పిన్నర్ల రేసులో కుల్దీప్ యాదవ్. యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్ ఉన్నారు. వీరిలో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి. 

భారత జట్టు (అంచనా):

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్/శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, యుజ్వేంద్ర చాహల్, రింకూ సింగ్, కుల్‌దీప్, అర్షదీప్ సింగ్, బుమ్రా, మహ్మద్ సిరాజ్, 

Also Read: IPL 2024: CSKకు బిగ్ షాక్.. సీజన్ మెుత్తానికి దూరమైన కాన్వే.. అతడి స్థానంలో ఎవరంటే?

Also Read: IPL Points Table: పాయింట్ల పట్టికలో ఢిల్లీకి ప్రమోషన్.. సన్ రైజర్స్ స్థానం ఎంతంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-04-18T17:26:45Z dg43tfdfdgfd