T20 World Cup | బార్బడోస్: సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌పై 36 పరుగుల తేడాతో గెలిచి సూపర్-8కు మరింత చేరువైంది. గ్రూప్-బి లో ఇంగ్లండ్‌తో బార్బడోస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాట్‌తో తర్వాత బంతితోనూ చెలరేగిన కంగారూలు బట్లర్ సేనకు చుక్కలు చూపించారు. డేవిడ్ వార్నర్ (39), మార్ష్ (35), హెడ్ (34), స్టోయినిస్ (30) ధాటిగా ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 20 ఓవర్లలో 201/7 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఇంగ్లండ్ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 20 ఓవర్లకు 165/6కే పరిమితమైంది. ఓపెనర్లు జోస్ బట్లర్ (42), ఫిల్ సాల్ట్ (37) తొలి వికెట్‌కు 7 ఓవర్లలోనే 73 పరుగులు జతచేసినా ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లెవరూ వేగంగా ఆడకపోవడంతో ఆ జట్టుకు పరాభవం తప్పలేదు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆడమ్ జంపా (2/28), పాట్ కమిన్స్ (2/23) ఇంగ్లీష్ బ్యాటర్లకు అడ్డుకట్ట వేశారు.
2024-06-10T00:36:03Z