SUNIL CHHETRI | నేడు భారత్‌, ఖతార్‌ పోరు.. ఛెత్రి లేకుండా తొలి మ్యాచ్‌!

Sunil Chhetri | దోహా: సుమారు రెండు దశాబ్దాల పాటు భారత ఫుట్‌బాల్‌ జట్టుకు సేవలందించిన మాజీ సారథి సునీల్‌ ఛెత్రి లేకుండా ‘బ్లూ టైగర్స్‌’ కీలక పోరుకు సిద్ధమైంది. రాబోయే ఫిఫా వరల్డ్‌ కప్‌ అర్హత రౌండ్లలో భాగంగా మూడో రౌండ్‌కు ముందంజ వేయాలంటే భారత ఫుట్‌బాల్‌ జట్టుకు ఇదే చివరి అవకాశం! రెండో రౌండ్‌లో భారత్‌.. మంగళవారం దోహాలోని జాసిమ్‌ బిన్‌ హమాద్‌ స్టేడియం వేదికగా పటిష్టమైన ఖతార్‌తో తలపడనుంది.

గ్రూప్‌-ఏలో 13 పాయింట్లతో టేబుల్‌ టాపర్‌గా ఉన్న ఖతార్‌ ఇప్పటికే మూడో రౌండ్‌కు అర్హత సాధించగా రెండో స్థానంలో ఉన్న భారత్‌ ఖాతాలో అఫ్గానిస్థాన్‌, కువైట్‌తో కలిసి 5 పాయింట్లున్నాయి. ఈ మ్యాచ్‌లో ఖతార్‌ను ఓడిస్తేనే భారత్‌ తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఓడితే ఫిఫా క్వాలిఫయర్స్‌తో పాటు ఏఎఫ్‌సీ ఆసియా కప్‌ 2027 నుంచీ తప్పుకున్నట్టే! డ్రా చేసుకుంటే మంగళవారం జరిగే కువైట్‌-అఫ్గాన్‌ మ్యాచ్‌ ఫలితం కోసం వేచి చూడాల్సిందే.

2024-06-10T19:38:53Z dg43tfdfdgfd