SRH VS MI DREAM11 PREDICTION TODAY: ఉప్పల్‌లో పరుగుల ఉప్పెనకు సిద్ధం.. ముంబైతో హైదరాబాద్ ఢీ.. డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..

Sunrisers Hyderabad Vs Mumbai Indians Dream11 Tips: తొలి మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో ఆఖరి వరకు పోరాడి గెలుపు అంచుల వరకు వచ్చి ఓటమి పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్.. నేడు ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఈ సీజన్‌లో పాయింట్ల ఖాతా ఓపెన్ చేయాలని చూస్తోంది. అటు ముంబై ఇండియన్స్‌ కూడా తమ తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. గుజరాత్ టైటాన్స్‌తో చివరివరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఎస్‌ఆర్‌హెచ్‌పై గెలుపొంది బోణీ కొట్టాలని చూస్తోంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సొంతగడ్డపై హైదరాబాద్‌ విజయం సాధిస్తుందా..? హార్థిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్ తొలి విక్టరీ నమోదు చేస్తుందా..? చూడాలి. ఉప్పల్ స్టేడియం పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డులు, తుది జట్లు, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..

Also Read:  Siddharth-Aditi Rao Marriage: అదితి రావు తో సిద్ధార్థ పెళ్లి.. గుడిలో ఒకటైన జంట!

ఉప్పల్ స్టేడియం పిచ్ ఎక్కువగా బ్యాట్స్‌మెన్‌కు సహకారం ఉంటుంది. అయితే ఆరంభంలో పేసర్లు స్వింగ్‌తో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు రాణిస్తారు. కానీ బంతి బ్యాట్‌పైకి వస్తుండడంతో బ్యాటర్లు పండగ చేసుకుంటున్నారు. మంచు ప్రభావం ఆధారంగా టాస్ గెలిచిన జట్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. JioCinema యాప్, వెబ్‌సైట్‌లో ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్‌‌ చూడొచ్చు. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ మ్యాచ్‌లను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. రెండు జట్లు ఇప్పటివరకు 21 మ్యాచ్‌ల్లో తలపడగా.. ముంబై 12, ఎస్‌ఆర్‌హెచ్‌ 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. 

 తుది జట్లు ఇలా.. (అంచనా)

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, నటరాజన్.

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), డెవాల్డ్ బ్రీవిస్, తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, నమన్ ధీర్, పీయూష్‌ చావ్లా, కోయోట్జీ, బుమ్రా, వుడ్.

SRH Vs MI Dream11 Prediction Today:

వికెట్ కీపర్: హెన్రిచ్ క్లాసెన్

బ్యాట్స్‌మెన్: రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, తిలక్ వర్మ, రాహుల్ త్రిపాఠి

ఆల్‌రౌండర్లు: హార్థిక్ పాండ్యా, మార్క్రామ్

బౌలర్లు: బుమ్రా, కమిన్స్, నటరాజన్, పీయూష్ చావ్లా

Also Read:  Redmi Note 13 5G Price: అమెజాన్‌లో దిమ్మతిరిగే ఆఫర్స్‌..Redmi Note 13 5G మొబైల్‌ను రూ.800కే పొందండి!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-03-27T09:42:16Z dg43tfdfdgfd