SRH VS DC | స‌న్‌రైజ‌ర్స్ దండ‌యాత్ర‌.. 67 ప‌రుగుల‌తో ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తు

SRH vs DC : ఐపీఎల్‌లో అత్య‌ధిక స్కోర్‌ను బ‌ద్ధ‌లు కొట్టిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(Sun risers Hyderabad) మ‌రోసారి గ‌ర్జించింది. ఈసారి ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ను వ‌ణికిస్తూ సూప‌ర్ విక్ట‌రీ కొట్టింది. ఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్(89) విధ్వంసానికి షహ్‌బాజ్ అహ్మ‌ద్(59 నాటౌట్‌), అభిషేక్ శ‌ర్మ‌(46)ల మెరుపులు తోడ‌య్యాయి. ఈ ముగ్గురు ఢిల్లీ బౌల‌ర్ల‌ను ఉతికేస్తూ బౌండ‌రీ వ‌ర్షం కురిపించారు. దాంతో, మూడోసారి 250 ప్ల‌స్ కొట్టిన క‌మిన్స్ సేన అనంత‌రం ఢిల్లీని 199 క‌ట్ట‌డి చేసింది. జేక్ ఫ్రేజ‌ర్(65), అభిషేక్ పొరెల్‌(), పంత్‌(44)లు పోరాడినా కొండ‌ను క‌రిగించ‌లేక‌పోయారు. న‌ట‌రాజ‌న్(4/19) కెరీర్ బెస్ట్ గ‌ణాంకాలు న‌మోదు చేయ‌గా.. వ‌రుస‌గా నాలుగో విజ‌యంతో హైద‌రాబాద్ పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానానికి చేరింది.

ప‌దిహేడో సీజ‌న్‌లో ఆరెంజ్ ఆర్మీ క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో చెలరేగుతోంది. అత్య‌ధిక స్కోర్ల‌తో రికార్డుల దుమ్ముదులుపుతూ ప్ర‌త్య‌ర్థుల‌ను వ‌ణికిస్తోంది. ఇప్పటికే రికార్డు స్కోర్‌తో ముంబై ఇండియ‌న్స్, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుల భ‌ర‌తం ప‌ట్టిన క‌మిన్స్ సేన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ను చిత్తుగా ఓడించింది. 267 ప‌రుగుల కొండంత ల‌క్ష్యాన్ని ఛేద‌న‌లో పంత్ సేన 199 ప‌రిమిత‌మైంది.67 ప‌రుగుల‌తో గెలుపొందిన క‌మిన్స్ సేన 10 పాయింట్లతో టేబుల్ టాప్ 2గా నిలిచింది.

 ఫ్రేజ‌ర్ 15 బంతుల్లోనే

రికార్డు ఛేద‌న‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ తొలి ఓవ‌ర్లోనే షాక్ త‌గిలింది. నాలుగు బౌండ‌రీలు బాదిన పృథ్వీ షా(16)ను సుంద‌ర్ ఔట్ చేశాడు. ఆ త‌ర్వాతి ఓవ‌ర్‌లో భువ‌నేశ్వ‌ర్ న‌కుల్ బాల్‌తో డేవిడ్ వార్న‌ర్(1)ను బోల్తా కొట్టించాడు. 25 ప‌రుగుల‌కే రెండు వికెట్లు ప‌డిన ద‌శ‌లో.. యువ కెర‌టం జేక్ ఫ్రేజ‌ర్ మెక్‌గుర్క్(65),అభిషేక్ పొరెల్(42)లు సిక్స‌ర్ల మోత మోగించి స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించారు.

ఈ క్ర‌మంలోనే ఫ్రేజ‌ర్ 17వ సీజ‌న్‌లో వేగ‌వంత‌మైన హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. 15 బంతుల్లోనే యాభై బాదాడు. ఈ జోడీని మ‌యాంక్ మార్కండే విడ‌దీసి ఢిల్లీని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఆ త‌ర్వాత‌ ట్రిస్ట‌న్ స్ట‌బ్స్‌(10) త‌క్కువ‌కే వెనుదిర‌గ‌గా.. టెయిలెండ‌ర్ల‌తో క‌లిసి కెప్టెన్ రిష‌భ్ పంత్() పోరాడాడు.

ప‌వ‌ర్ ప్లేలో రికార్డు

చిన్న‌స్వామి స్టేడియంలో బెంగ‌ళూరు బౌల‌ర్ల‌ను ఉతికేసిన సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాట‌ర్లు ఈసారి ఢిల్లీ గ‌డ్డ‌పై సిక్స‌ర్ల మోత మోగించారు. ఖ‌త‌ర్నాక్ క్లాసెన్(13) దంచ‌క‌పోయినా.. ఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్(89), అభిషేక్ శ‌ర్మ‌(46)లు బంతి గ‌మ్యం బౌండ‌రీయే అన్న‌ట్టు చెల‌రేగారు. ఈ ఇద్ద‌రి వీర‌కొట్టుడుకు 3 ఓవ‌ర్ల‌కే స్కోర్ 32.. ఆరు ఓవ‌ర్ల‌కు 125.. ఇలా రాకెట్ వేగంతో ప‌రుగులు తీసింది. దాంతో, క‌మిన్స్ సేన‌ అల‌వోక‌గా 300 కొడుతుంద‌నిపించింది.

ట్రావిస్ హెడ్(89), అభిషేక్ శ‌ర్మ‌(46)

అయితే.. ప‌వ‌ర్ ప్లే త‌ర్వాత కుల్దీప్ యాద‌వ్ తిప్ప‌య‌డంతో స్కోర్ త‌గ్గినా.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి(37), షెహ్‌బాజ్‌(59 నాటౌట్‌)లు ధ‌నాధ‌న్ ఆడి రెండొంద‌లు దాటించారు. చివ‌ర్లో అబ్దుల్ స‌మ‌ద్(13) మెరుపుల‌తో హైద‌రాబాద్ భారీ టార్గెట్ నిర్దేశించింది. ఢిల్లీ బౌల‌ర్ల‌లో కుల్దీప్ (4/55)నాలుగు వికెట్లతో రాణించాడు.

 ఇవి కూడా చ‌ద‌వండి

2024-04-20T17:58:51Z dg43tfdfdgfd