SOUTH AFRICA CRICKET | సెంట్ల‌ర్ కాంట్రాక్ట్‌లో సీనియ‌ర్ల‌కు షాక్.. యువ‌ పేస‌ర్ల‌కు ప్ర‌మోష‌న్

South Africa Cricket : పొట్టి ప్ర‌పంచ క‌ప్ ముందు ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు(South Africa Cricket) సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. స్టార్ ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్(Quinton De Kock), పేస‌ర్ అన్రిజ్ నోకియా(Anrich Nortje)ల సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ ర‌ద్దు చేసింది. పొట్టి వ‌ర‌ల్డ్ క‌ప్ నేప‌థ్యంలో యువ క్రికెట‌ర్ల‌కు బొనాంజాగా కాంట్రాక్ట్‌లు క‌ట్ట‌బెట్టింది. ఏడాది కాలానికి 18 మందికి కాంట్రాక్ట్ ఖాయం చేసింది.

నిరుడు వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అత్య‌ధిక వికెట్ల‌తో మెరిసిన గెరాల్డ్ కోయెట్జీ(Gerald Coetzee), భార‌త ప‌ర్య‌ట‌న‌లో బంతితో చెల‌రేగిన నంద్రె బ‌ర్గ‌ర్‌(Nandre Burger)లు సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ పట్టేశారు. వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత వ‌న్డేల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన డికాక్ కాంట్రాక్ట్ కోల్పోవ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. టీ20 ప్ర‌పంచ క‌ప్ స్క్వాడ్‌లో ఈ చిచ్చ‌ర‌పిడుగుకు చాన్స్ లేక‌పోవ‌చ్చ‌ని అంతా చ‌ర్చించుకుంటున్నారు. కోయెట్టీ 20 వికెట్ల‌తో స‌త్తా చాటాడు.

బ‌ర్గ‌ర్‌, కోయెట్జీ

ఒక ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన స‌ఫారీ పేస‌ర్‌గా ఈ యువ‌కెర‌టం రికార్డు నెల‌కొల్పాడు. టీమిండియాతో జ‌రిగిన రెండు టెస్టుల సిరీస్‌లో అద‌ర‌గొట్టిన ఓపెన‌ర్ టోని జోర్జి, రీజా హెండ్రిక్స్, పెహ్లుకువాయోలు సైతం సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ ద‌క్కించుకున్నారు.

సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ జాబితా : తెంబా బ‌వుమా, నంద్రే బర్గ‌ర్, గెరాల్డ్ కోయెట్జీ, టోని జోర్జి, జోర్న్ ఫోర్చ్యున్, రీజా హెండ్రిక్స్, జాన్సెన్, క్లాసెన్, మిల్ల‌ర్, కేశ‌వ్ మ‌హారాజ్, మ‌ర్క్‌ర‌మ్, ఎంగిడి, పెహ్లుక్‌వ‌యో, ర‌బ‌డ‌, రియాన్ రికెల్‌ట‌న్, షంసీ, స్ట‌బ్స్, వాండ‌ర్ డ‌స్సెన్.

ఇవి కూడా చ‌ద‌వండి

2024-03-26T14:17:30Z dg43tfdfdgfd