SCOTLAND | స్కాట్లాండ్‌ గెలుపు జోరు.. టీ20 ప్రపంచకప్‌లో ఒమన్‌పై ఘన విజయం

Scotland | నార్త్‌సౌండ్‌: టీ20 ప్రపంచకప్‌లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఒమన్‌ నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యఛేదనలో ఒమన్‌ 13.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది.

బ్రాండన్‌ మెక్‌ముల్లెన్‌(31 బంతుల్లో 61 నాటౌట్‌, 9ఫోర్లు, 2సిక్స్‌లు) ధనాధన్‌ అర్ధసెంచరీతో విజృంభించాడు. బిలాల్‌ఖాన్‌, ఇలియాస్‌, మెహ్రాన్‌ఖాన్‌ ఒక్కో వికెట్‌ తీశారు. అంతకుముందు ప్రతీక్‌(54), అయాన్‌ఖాన్‌(41 నాటౌట్‌) బ్యాటింగ్‌తో ఒమన్‌ 150/7 స్కోరు చేసింది. మెక్‌ముల్లెన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

2024-06-10T18:53:46Z dg43tfdfdgfd