RSA VS BAN | టాస్ గెలిచిన ద‌క్షిణాఫ్రికా.. హ్యాట్రిక్ కొట్టేనా..?

RSA vs BAN : టీ20 ప్ర‌పంచక‌ప్ 21మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా(South Africa), బంగ్లాదేశ్(Bangladesh) త‌ల‌ప‌డుతున్నాయి. న్యూయార్క్‌లోని న‌స్సౌ కౌంటీ స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో స‌ఫారీ జ‌ట్టు టాస్ గెలిచింది.

లో స్కోరింగ్ న‌మోద‌వుతున్న ఈ పిచ్‌పై కెప్టెన్ ఎడెన్ మ‌ర్క్‌ర‌మ్(Aiden Markram) తొలుత బ్యాటింగ్ చేసేందుకే మొగ్గు చూపాడు. రెండు విజ‌యాల‌తో జోరుమీదున్న ద‌క్షిణాఫ్రికా ఏ మార్పు లేకుండా ఆడుతోంది. మ‌రోవైపు బంగ్లా ఒక్క మార్పు చేసింది. సౌమ్యా స‌ర్కార్ స్థానంలో జ‌కీర్ అలీ జ‌ట్టులోకి వ‌చ్చాడు.

ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు :  రీజా హెండ్రిక్స్, క్వింట‌న్ డికాక్ (వికెట్ కీప‌ర్), ఎడెన్ మ‌ర్క్‌ర‌మ్(కెప్టెన్), ట్రిస్ట‌న్ స్ట‌బ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్ల‌ర్, మార్కో జాన్సెన్, కేశ‌వ్ మ‌హ‌రాజ్, క‌గిసో ర‌బ‌డ‌, అన్రిచ్ నోర్జి, ఒట్టెనీల్ బార్ట్‌మ‌న్.

బంగ్లాదేశ్ జ‌ట్టు : తంజిద్ హ‌స‌న్, లిట్ట‌న్ దాస్(వికెట్ కీప‌ర్), న‌జ్ముల్ హుసేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృద‌య్, ష‌కీబుల్ హ‌స‌న్, జ‌కీర్ అలీ, మ‌హ్మ‌దుల్లా, ర‌షీద్ హొస్సానీ, త‌స్కిన్ అహ్మ‌ద్, తంజిమ్ హ‌స‌న్ ష‌కిబ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్.

2024-06-10T14:23:05Z dg43tfdfdgfd