RSA VS BAN | ఆదుకున్న క్లాసెన్, మిల్ల‌ర్.. బంగ్లా ముందు తేలికైన‌ ల‌క్ష్యం..?

RSA vs BAN : టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ప్ర‌త్య‌ర్థుల‌ను త‌క్కువ స్కోర్‌కు క‌ట్ట‌డి చేస్తున్న దక్షిణాఫ్రికా(South Africa)కు ఈసారి భారీ షాక్. ఊహించ‌ని బౌన్స్‌.. లో స్కోరింగ్ మ్యాచ్‌ల‌కు కేరాఫ్ అయిన‌ న్యూయార్క్ పిచ్‌పై బంగ్లాదేశ్ బౌల‌ర్లు స‌ఫారీల‌ను నిలువ‌రించారు. తంజిమ్ హ‌స‌న్ ష‌కిబ్(3/18) సంచ‌ల‌న స్పెల్ వేయ‌డంతో ద‌క్షిణాఫ్రికా టాప్ గ‌న్స్ పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. 23 ర‌న్స్‌కే నాలుగు కీల‌క వికెట్లు ప‌డిన ద‌శ‌లో హెన్రిచ్ క్లాసెన్(46), డేవిడ్ మిల్ల‌ర్‌(29)లు గోడ‌లా నిల‌బడ్డారు. ఐదో వికెట్‌కు 79 ర‌న్స్ జోడించి ప‌రువు కాపాడారు. దాంతో, నిర్ణీత ఓవ‌ర్ల‌లో ద‌క్షిణాఫ్రికా 6 వికెట్ల న‌ష్టానికి 113 ర‌న్స్ కొట్టింది.

టాస్ గెలిచిన ద‌క్షిణాఫ్రికా బ్యాటింగ్ తీసుకొంది. అయితే.. బౌన్స్ అవుతున్న పిచ్‌పై బంగ్లా పేస‌ర్లు వికెట్ల వేట మొద‌లెట్ట‌డంతో ఎవ‌రు ఎక్కువ సేపు క్రీజులో నిల‌బ‌డ‌లేక‌పోయారు. ఓపెన‌ర్ రీజా హెండ్రిక్స్(0)ను ఎల్బీగా వెన‌క్కి పంపిన ష‌కిబ్.. మ‌రో ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్‌(18)ను బౌల్డ్ చేసి స‌ఫారీ జ‌ట్టుకు పెద్ద షాకిచ్చాడు. 19 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయిన ద‌క్షిణాఫ్రికాను త‌స్కిన్ దెబ్బ‌కొట్టాడు. కెప్టెన్ ఎడెన్ మ‌ర్క్‌ర‌మ్‌(4)ను బౌల్డ్ చేశాడు.

ఆకాసేప‌టికే కుర్రాడు ట్రిస్ట‌న్ స్ట‌బ్స్(0) సైతం ఔట్ కావ‌డంతో ద‌క్షిణాఫ్రికా పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. అప్పుడు గ‌త మ్యాచ్ హీరో డేవిడ్ మిల్ల‌ర్(29)కు జ‌త‌గా హెన్రిచ్ క్లాసెన్() బంగ్లా బౌల‌ర్ల‌ను దీటుగా ఎదుర్కొన్నారు. కాస్త కుదురుకున్నాక భారీ షాట్లు ఆడి జ‌ట్టు స్కోర్ 100 దాటించారు. అయితే.. త‌స్కిన్ అహ్మ‌ద్ ఓవ‌ర్లో డేంజ‌ర‌స్ క్లాసెన్‌.. రిష‌ద్ బౌలింగ్‌లో మిల్ల‌ర్‌ బౌల్డ్ కావ‌డంతో స‌ఫారీ జ‌ట్టు మ‌రో 20 -30 ప‌రుగుల చేయ‌లేక 113కే ప‌రిమిత‌మైంది.పోయింది.

2024-06-10T16:23:27Z dg43tfdfdgfd