RR VS DC: రఫ్పాడించిన రియాన్, గెలిపించిన అవేష్ ఖాన్ .. సొంతగడ్డపై రాజస్థాన్ 'రాయల్' విక్టరీ

RR vs DC: ఐపీఎల్ 2024లో కొనసాగుతున్న కొత్త సంప్రదాయాన్ని రాజస్థాన్ రాయల్స్ కొనసాగించింది. ఈ సీజన్‌లో గురువారం నాటి మ్యాచుతో కలిపి మొత్తం 9 మ్యాచులు జరిగాయి. అందులో అన్నింట్లోనూ హోం గ్రౌండ్‌లో మ్యాచులు ఆడిన జట్లే విజయం సాధించాయి. రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో ఆతిథ్య జైపూర్.. విజయం సాధించింది. 12 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచులో ఫస్టు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్ (5), జాస్ బట్లర్ (11), సంజూ శాంసన్ (15) విఫలమయ్యారు. ఈ క్రమంలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (19 బంతుల్లో 29)తో కలిసి యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 45 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. చివర్లో ధ్రువ్ జురెల్ 122 బంతుల్లో 20 రన్స్, షిమ్రాన్ హిట్ మెయర్ 7 బంతుల్లో 14తో రాణించారు.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్3- పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మంచి టచ్‌లో కన్పించిన మిచెల్ మార్ష్ 12 బంతుల్లో 23 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. రికీ భుయ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. డేవిడ్ వార్నర్ 34 బంతుల్లో 49 రన్స్‌తో రాణించడంతో ఢిల్లీ 11.1 ఓవర్లలో 97/2తో మంచి స్థితిలో కన్పించింది. కానీ డేవిడ్ వార్నర్, రిషభ్ పంత్ (26 బంతుల్లో 28 రన్స్) చేసి ఔట్ అయ్యారు. దీంతో జట్టు కష్టాల్లో పడింది.

సాధించాల్సిన రన్ రేట్ క్రమంగా పెరిగిపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఒత్తిడిలో పడిపోయింది. ట్రిస్టన్ స్టబ్స్ 23 బంతుల్లో 44 రన్స్‌ చేశాడు. చివరి వరకు పోరాడిన స్టబ్స్.. జట్టు ఓటమి అంతరాన్ని తగ్గించాడే తప్ప గెలిపించలేకపోయాడు. చివరకు నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.

ఈ సీజన్‌లో తొలి మ్యాచులో లక్నోను ఓడించిన రాజస్థాన్.. ఢిల్లీపై విజయంతో వరుసగా రెండు మ్యాచులో గెలుపొందింది. అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుసగా రెండో మ్యాచులో ఓడిపోయింది. తొలి మ్యాచులో ఆ జట్టు పంజాబ్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-28T18:22:06Z dg43tfdfdgfd