ROMARIO | 58 ఏండ్ల వయసులో రిటైర్మెంట్‌ వెనక్కి.. బ్రెజిల్‌ ఫుట్‌బాలర్‌ రొమారియో నిర్ణయం

Romario | ఢిల్లీ: బ్రెజిల్‌ దిగ్గజ ఫుట్‌బాలర్‌, 1994 ఫిఫా ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న రొమారియో 58 ఏండ్ల వయసులో రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. బ్రెజిల్‌లోని అమెరికా ఆఫ్‌ రియో డి జెనీరో క్లబ్‌కు ఓనర్‌గా ఉన్న రొమారియో.. గత కొంతకాలంగా క్లబ్‌ వరుసగా పరాభవాలు ఎదుర్కుంటూ మనుగడే ప్రశ్నార్థకమవుతున్న నేపథ్యంలో స్వయంగా ఆయనే తిరిగి మైదానంలో దిగేందుకు నడుము బిగించాడు. 2008లో రిటైర్మెంట్‌ ప్రకటించిన ఈ మాజీ స్ట్రయికర్‌.. 16 ఏండ్ల తర్వాత తన క్లబ్‌ తరఫున ప్లేయర్‌గా నమోదు చేయించుకున్నట్టు బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించాడు. రొమారియో కొడుకు రొమరిన్హో కూడా అదే జట్టులో ఫార్వర్డ్‌గా ఆడుతున్నాడు. త్వరలో తండ్రీకొడుకులిద్దరూ కలిసి ఆడనుండటం విశేషం.

2024-04-18T23:16:51Z dg43tfdfdgfd