ROHIT SHARMA: ఫీల్డింగ్ సెట్ చేసిన రోహిత్ శ‌ర్మ‌.. బౌండ‌రీ లైన్‌కు ప‌రుగెత్తిన పాండ్యా

హైద‌రాబాద్‌: స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్లు ట్రావిస్ హెడ్‌, అభిషేక్ శ‌ర్మ, హెన్రీ క్లాసెన్‌.. త‌మ ప‌వ‌ర్ హిట్టింగ్‌తో ముంబై బౌల‌ర్ల‌ను ఆటాడుకున్నారు. బుధ‌వారం ఉప్ప‌ల్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో.. స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్లు కొట్టే షాట్ల‌కు.. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మైండ్ బ్లాకైంది. ఏక‌ధాటిగా ఫోర్లు, సిక్స‌ర్లు బాదుతున్న స‌న్‌రైజ‌ర్స్ స్ట్రోక్ ప్లేతో పాండ్యా హైరానాకు గుర‌య్యాడు. ఫీల్డింగ్ ఎలా సెట్ చేయాలో అత‌నికి అర్థం కాలేదు. ట్రావిస్‌, అభిషేన్‌, క్లాసెన్ ఊచ‌కోత కోస్తుంటే, ముంబై సార‌థి పాండ్యా ఆ బ్యాట‌ర్ల‌ను నియంత్రించ‌లేక‌పోయారు. తిక‌మ‌క‌కు గుర‌వుతున్న స‌మ‌యంలో మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) రంగంలోకి దిగాడు.

హైద‌రాబాద్ బ్యాట‌ర్ల‌ను క‌ట్ట‌డి చేసేందుకు రోహిత్ శ‌ర్మ ఫీల్డింగ్ సెట్ చేశాడు. రోహిత్ ఏదో చెప్ప‌డంతో.. పాండ్యా బౌండ‌రీ లైన్‌కు ప‌రుగెత్తాడు. ఈ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో ఒక‌టి ఆన్‌లైన్‌లో వైర‌ల్ అయ్యింది. రోహిత్ ఈ మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అవుతున్నార‌ని కామెంటేట‌ర్లు కూడా త‌మ వాయిస్ అందించారు. ఫ‌స్ట్ మ్యాచ్‌లో రోహిత్‌ను బౌండ‌రీలైన్‌కు వెళ్లాలంటూ సంకేతం ఇచ్చిన పాండ్యా.. రెండో మ్యాచ్‌లో ఆ హీట్ తానే ఎదుర్కోవాల్సి వ‌చ్చింది.

ఉప్ప‌ల్‌లో ఊగిపోయిన హైద‌రాబాద్ జ‌ట్టు ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల న‌ష్టానికి 277 ర‌న్స్ చేసింది. ఐపీఎల్ హిస్ట‌రీలోనే ఇది అత్య‌ధిక స్కోరు. ఇక ఛేజింగ్‌లో ముంబై జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 246 ర‌న్స్ చేసింది.

2024-03-28T07:21:15Z dg43tfdfdgfd