ROCKY FLINTOFF | పుల్ షాట్‌తో 3 సిక్స‌ర్లు.. క్రికెట్ దిగ్గ‌జం వార‌సుడి ఆట అదుర్స్

Rocky Flintoff : రాజకీయ‌, వ్యాపార‌, సినీ రంగాల్లోనే కాదండోయ్.. క్రికెట్‌లోనూ వార‌సత్వం కొన‌సాగుతున్న రోజులివి. దిగ్గ‌జ క్రికెట‌ర్ల త‌న‌యులుగా అంద‌రూ హిట్ కొట్ట‌క‌పోయినా.. కొంద‌రు మాత్రం త‌మ మార్క్ చూపిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో ఇంగ్లండ్ యువ‌కెర‌టం రాకీ ఫ్లింటాఫ్(Rocky Flintoff) కూడా చేరిపోయాడు. ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండ‌ర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ (Andrew Flintoff) కుమారుడే ఇత‌డు. కుడిచేతి వాటం బ్యాట‌ర్ అయిన రాకీ అచ్చం తండ్రిలానే ఆడుతున్నాడు. ఫ్లింటాఫ్ మాదిరిగానే పుల్ షాట్స్ ఆడుతూ తండ్రికి త‌గ్గ వార‌సుడు అనిపించుకుంటున్నాడు.

ప్ర‌పంచంలోనే మేటి ఆల్‌రౌండ‌ర్ ఫ్లింటాప్ వార‌సుడిగా బ్యాట్ అందుకున్న రాకీకి ఇప్పుడు 16 ఏండ్లు. ప్ర‌స్తుతం అత‌డు ల్యాంక్‌షైర్(Lankshire) జ‌ట్టు త‌ర‌ఫున 22 అడుగుల పిచ్‌పై మెరుపులు మెరిపిస్తున్నాడు. సెకండ్ ఎక్స్ ఐ చాంపియ‌న్‌షిప్ మ్యాచ్‌లో భాగంగా డుర్హం(Durham) జ‌ట్టుపై రాకీ చెల‌రేగాడు.

తండ్రి లెక్క‌నే పుల్ షాట్ల‌తో మూడు సిక్స‌ర్లు బాది ఔరా అనిపించాడు. ఈ యువ చిచ్చ‌ర‌పిడిగు కేవ‌లం 78 బంతుల్లో అర్ధ శ‌త‌కంతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో రాకీ పెద్ద‌న్న కొరే సైతం ఆడాడు. అయితే.. అత‌డు తొలి ఇన్నింగ్స్‌లో త‌క్కువ స్కోర్‌కే వెనుదిరిగాడు.

ఆండ్రూ ఫ్లింటాఫ్

హండ్రెడ్ లీగ్‌లో కోచ్‌గా

ఇంగ్లండ్ గొప్ప ఆల్‌రౌండ‌ర్‌గా ఫ్లింటాఫ్ కీర్తి గ‌డించాడు. అయితే. త‌న సుదీర్ఘ‌ కెరీర్‌లో అత‌డు ఎన్నో ఒడిదొడుకులు చ‌వి చూశాడు. అంతేకాదు ఆట కంటే కొన్నిసార్లు వివాదాల‌తోనే మ‌స్త్ పాపుల‌ర్ అయ్యాడు. ఈ స్టార్ ఆల్‌రౌండ‌ర్ 2010 సెప్టెంబ‌ర్ 16వ తేదీన అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. ఏక‌కాలంలో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌పరిచాడు. ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కు బాక్స‌ర్‌గా అవ‌తార‌మెత్తిన ఫ్లింటాఫ్ ప్ర‌స్తుతం కోచ్‌గా ప‌నిచేస్తున్నాడు. ది హండ్రెడ్ లీగ్‌(The Hundred League)లో నార్తర్న్ సూప‌ర్‌చార్జ‌ర్స్ జ‌ట్టుకు మెల‌కువ‌లు నేర్పుతున్నాడు. ఫ్లింటాఫ్‌, రాకేల్ వూల్స్ ఫ్లింటాఫ్ దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమారులు, ఒక కూతురు. వీళ్ల‌లో పెద్ద‌వాళ్లు కోరె, రాకీలు క్రికెట‌ర్లుగా రాణిస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

2024-04-19T14:17:24Z dg43tfdfdgfd