RISHABH PANT | మ్యాచ్ విన్న‌ర్ పంత్.. మూడు క్యాచ్‌ల‌తో మెరిశాడిలా

Rishabh Pant : భార‌త వికెట్ కీప‌ర్ రిష‌భ్ పంత్ (Rishabh Pant) తానొక మ్యాచ్ విన్న‌ర్ అని మ‌రోసారి నిరూపించుకున్నాడు. ఏడాదిన్న‌ర త‌ర్వాత అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడిన పంత్ త‌న‌లో చేవ త‌గ్గ‌లేద‌ని, ఒంటిచేత్తో జ‌ట్టును గెలిపించ‌గ‌ల‌నని చాటాడు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లీగ్ ద‌శ మ్యాచ్‌లో భాగంగా ఈ లెఫ్ట్ హ్యాండ‌ర్ పాకిస్థాన్‌ (Pakistan)పై మెరుపు బ్యాటింగ్ చేయ‌డ‌మే కాదు.. ఆ త‌ర్వాత వికెట్ కీపింగ్‌లోనూ అద‌ర‌గొట్టాడు.

మూడు అద్భుత క్యాచ్‌లు ప‌ట్టిన పంత్.. టీమిండియాను గెలుపు వాకిట నిలిపాడు. పాక్ ఇన్నింగ్స్‌లో ఫ‌ఖ‌ర్ జ‌మాన్ (Fakhar Zaman) గాల్లోకి లేపిన బంతిని పంత్ ఎంతో ఒడిసిప‌ట్టుకున్నాడు. ఆ త‌ర్వాత హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో షాదాబ్ ఖాన్(Shadab Khan) ఆడిన బంతిని ప‌రుగెత్తుతూ వెళ్లి మ‌రీ క్యాచ్ ప‌ట్టేశాడు. ఆద్యంతం ఉత్కంఠ‌రేపిన మ్యాచ్‌లో మూడు క్యాచ్‌లు ప‌ట్టిన పంత్.. భార‌త‌ శిబిరంలో సంతోషాల సంబురాలు తెచ్చాడు. టీమిండియా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన పంత్‌కు డ్రెస్సింగ్ రూమ్‌లో ‘బెస్ట్ ఫీల్డ‌ర్ మెడ‌ల్’ అవార్డు ఇచ్చారు.

ఒంట‌రి సైనికుడిలా..

ఐసీసీ టోర్నీలో చిర‌కాల ప్ర‌త్య‌ర్థిపై శివాలూగిపోయే భార‌త(Team Inida) స్టార్ క్రికెట‌ర్లు న్యూయార్క్‌లో తేలిపోయారు. రిష‌భ్ పంత్(42) మిన‌హా ఒక్క‌రంటే ఒక్క‌రు పాకిస్థాన్(Pakistan) బౌల‌ర్ల‌ను దీటుగా ఎదుర్కోలేక‌పోయారు. ఒంట‌రి సైనికుడిలా పోరాడిన ఈ డాషింగ్ బ్యాట‌ర్ 6 ఫోర్ల‌తో చెల‌రేగాడు.

అక్ష‌ర్ ప‌టేల్(20) రాణించ‌డంతో టీమిండియా ప్ర‌త్య‌ర్థి ముందు 120 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది.

రిష‌భ్ పంత్(42)

అనంత‌రం మ‌హ్మ‌ద్ రిజ్వాన్(31), బాబ‌ర్ ఆజాం(13)ల‌ దూకుడుతో ల‌క్ష్యంపైపు సాగుతున్న పాక్‌ను యార్క‌ర్ కింగ్ బుమ్రా(Bumrah) వ‌ణికించాడు. బాబ‌ర్ వికెట్ తీసి దాయాది ప‌త‌నాన్ని శాసించాడు. వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా సైతం ఫ‌ఖ‌ర్ జ‌మాన్(13), షాదాబ్ ఖాన్‌(4)ల వికెట్లు తీసి జ‌ట్టు విజ‌యంలో భాగ‌మ‌య్యాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 20వ ఓవ‌ర్లో 18 ర‌న్స్ అవ‌స‌ర‌మ‌వ్వ‌గా.. పాక్ ఆట‌గాళ్లు 13 ర‌న్స్ చేశారంతే. దాంతో, భార‌త జ‌ట్టు 6 ప‌రుగుల తేడాతో గెలుపొంది పాక్‌పై ఆధిక్యాన్ని 7-1కు పెంచుకుంది.

2024-06-10T11:37:42Z dg43tfdfdgfd