PAKISTAN | పాక్‌ క్రికెట్‌కు బ్లాక్‌ డే.. బాబర్‌ సేనపై దుమ్మెత్తిపోస్తున్న మాజీలు

Pakistan | ఇస్లామాబాద్‌: తొలిసారి టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీలో ఆడుతున్న అమెరికా చేతిలో ‘సూపర్‌ ఓవర్‌’లో ఓడిన పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టుపై ఆ దేశ మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది పాక్‌ క్రికెట్‌కు ‘బ్లాక్‌ డే’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబర్‌ సేన వ్యూహాత్మక తప్పిదాలకు పాల్పడి మూల్యం చెల్లించుకున్నదని మాజీ సారథులు రమీజ్‌ రాజా, వసీం అక్రమ్‌, మోయిన్‌ ఖాన్‌ వాపోయారు.

సూపర్‌ ఓవర్‌లో లెఫ్టార్మ్‌ పేసర్‌ అయిన నేత్రావల్కర్‌ బౌలింగ్‌లో ఫకర్‌ జమాన్‌కు స్ట్రైకింగ్‌ ఇవ్వకుండా ఇఫ్తికార్‌ బ్యాటింగ్‌కు రావడాన్ని వాళ్లు తప్పుబట్టారు. వసీం అక్రమ్‌ మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్‌ ఇలా ఆడుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఇది చాలా విషాదకరం. సూపర్‌-8కు వెళ్లాలంటే భారత్‌తో పాటు ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో గెలవాలి. లేకుంటే కష్టమే’ అని అన్నాడు. విజయానికి అమెరికాకు అర్హత ఉన్నదని మాజీ కెప్టెన్‌ మియాందాద్‌ వ్యాఖ్యానించాడు. హఫీజ్‌, అక్మల్‌ సైతం తమ యూట్యూబ్‌ చానల్స్‌ వేదికగా బాబర్‌ సేనపై నిప్పులు చెరిగారు.

2024-06-07T20:27:32Z dg43tfdfdgfd