పాకిస్థాన్‌తో జరిగిన టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఇండియా అద్భుత విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే చివరి ఓవర్‌కు గెలుపు కోసం పాకిస్థాన్ పోరాడింది. ఆఖరిలో పాక్ బ్యాటర్ నసీమ్ షా .. తన సత్తా చాటినా.. ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. చివరి ఓవర్‌లో 18 పరుగులు అవసరం కాగా, నసీమ్ షా(Naseem Shah) రెండు బౌండరీలు కొట్టి కొంత జలక్ ఇచ్చాడు. కానీ టార్గెట్‌ను అందుకోలేకపోయారు. 4 బంతుల్లో 10 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచిన నసీమ్ షా.. ఓడిన బాధలో ఏడ్చేశాడు. నసీమ్ తన దుఖాన్ని ఆపుకోలేకపోయాడు. వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ అతన్ని ఓదార్చే ప్రయత్నం చేశాడు. మ్యాచ్ ముగియగానే.. పాక్ క్రికెటర్ ఏడుస్తూనే మైదానం బయటకు వెళ్లాడు. తోటి క్రికెటర్ షాహీన్ అఫ్రిది కూడా నసీమ్‌ను ఓదార్చే ప్రయత్నం చేశాడు. నసీమ్ ఏడుస్తున్న ఫోటో, వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
లో స్కోరింగ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా కేవలం 119 రన్స్ మాత్రమే చేసింది. స్వల్ప లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన పాకిస్థాన్ 113 రన్స్ మాత్రమే చేసి ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పాక్ జట్టు బౌలింగ్‌లో ఇరగదీసినా.. ఆ జట్టు బ్యాటర్లు స్వల్ప స్కోర్‌ను చేధించడంంలో విఫలం అయ్యారు.