NANDRE BURGER | స్కాల‌ర్‌షిప్ కోసం క్రికెట‌ర్‌న‌య్యా.. సైకాల‌జీ చ‌దివేశా

Nandre Burger : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో యువ పేస‌ర్లు అద‌ర‌గొడుతున్నారు. అరంగేట్రంలోనే త‌మ సత్తా చూపిస్తున్నారు. వీళ్లలో ద‌క్షిణాఫ్రికా యువ పేస‌న్ నంద్రె బ‌ర్గ‌ర్(Nandre Burger) ఒక‌డు. ఈ యంగ్ స్పీడ్‌స్ట‌ర్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌(Rajasthan Royals)కు ఆడుతున్నాడు. ట్రెంట్ బౌల్ట్‌తో బంతి పంచుకున్న బ‌ర్గ‌ర్ ప‌వ‌ర్ ప్లేలో తొలి మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ (LSG)పై నిప్పులు చెరిగాడు. అయితే.. తాను అనుకోకుండా క్రికెట‌ర్ అయ్యాన‌ని బర్గ‌ర్ చెప్పాడు. పై చ‌దువుల‌కు స్కాల‌ర్‌షిప్ వ‌స్తుందని క్రికెట్‌ను ఎంచుకున్నా అని వెల్ల‌డించాడు.

‘క్రికెట్ ఆడేవాళ్ల‌కు స్కాల‌ర్‌షిప్(Scholarship) ఇస్తామ‌ని విట్స్(విట్స్‌వాట‌ర్స్‌రాండ్‌) యూనివ‌ర్సిటీ ప్ర‌క‌టించింది. వాళ్ల ఐడియా నాకెంతో న‌చ్చింది. అయితే.. నేను మాత్రం ఎన్న‌డూ క్రికెట‌ర్ అవ్వాల‌నుకోలేదు. కానీ స్కాల‌ర్‌షిప్ వ‌స్తే ఉచితంగా చ‌దువుకోవ‌చ్చు. అందుక‌ని నేను ఆ చాన్స్ మిస్ చేస‌కోవ‌ద్ద‌నే ఆలోచ‌న‌తో బంతి అందుకున్నా. నా చ‌దువుకు క్రికెట్ ఎంతో తోడ్ప‌డింది’ అని బ‌ర్గ‌ర్ తెలిపాడు.

క్రికెట్ ట్ర‌య‌ల్స్‌లో ఇర‌గ‌దీసిన బ‌ర్గ‌ర్ 2014లో విట్స్ యూనివ‌ర్సీటీ(WITS)లో సీటు సంపాదించాడు. అక్క‌డ అత‌డు సైకాల‌జీ మేజ‌ర్ కోర్సులో చేరాడు.అప్ప‌టి నుంచి బ‌ర్గ‌ర్ క్రికెట్‌ను వ‌ద‌ల్లేదు. భార‌త ప‌ర్య‌ట‌న‌తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ స్పీడ్‌స్ట‌ర్ పొదుపైన బౌలింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. రెండు టెస్టుల్లో 11 వికెట్లు ప‌డ‌గొట్టి అద‌ర‌హో అనిపించాడు.

ప్ర‌స్తుతం బ‌ర్గ‌ర్ మూడు ఫార్మాట్ల‌లో రాణిస్తున్నాడు. అంతేకాదు అత‌డిని మ‌రింత ప్రోత్స‌హించేందుకు ద‌క్షిణాఫ్రికా క్రికెట్ ఈమ‌ధ్యే సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ కూడా ఇచ్చింది. స‌ఫారీ భ‌విష్య‌త్ స్టార్‌గా ఎదురుగుత‌న్న బ‌ర్గ‌ర్ ఈ ఏడాది టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో కీల‌కం కానున్నాడు. ఐపీఎల్ 17వ సీజ‌న్ మినీ వేలంలో రాజ‌స్థాన్ జ‌ట్టు బ‌ర్గ‌ర్‌ను రూ.50 ల‌క్ష‌ల‌కు కొన్న‌ది.

ఇవి కూడా చ‌ద‌వండి

2024-03-28T12:21:46Z dg43tfdfdgfd