MI VS SRH | టాస్ గెలిచిన ముంబై.. స‌న్‌రైజ‌ర్స్ హిట్ట‌ర్లు గ‌ర్జిస్తారా..?

MI vs SRH : ప‌దిహేడో సీజ‌న్ రివెంజ్ వీక్‌లో మ‌రో ఆస‌క్తిపోరుకు కాసేప‌ట్లే తెర‌లేవ‌నుంది. ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన ముంబై ఇండియ‌న్స్‌ (Mumbai Indians)తో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) త‌ల‌ప‌డుతోంది. వాంఖ‌డేలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై సార‌థి హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. ఫ‌స్ట్ బ్యాటింగ్ అంటే రెచ్చిపోయే స‌న్‌రైజ‌ర్స్ ఆట‌గాళ్లు మ‌రోసారి 250 ప్ల‌స్ కొడ‌తారా? లేదా? చూడాలి.

హైద‌రాబాద్ తుది జ‌ట్టు : అభిషేక్ శ‌ర్మ‌, ట్రావిస్ హెడ్, మ‌యాంక్ అగ‌ర్వాల్, నితిశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ స‌మ‌ద్, ష‌హ్‌బాజ్ అహ్మ‌ద్, మార్కో జాన్‌సెన్, ప్యాట్ క‌మిన్స్(కెప్టెన్‌), భువ‌నేశ్వ‌ర్, టి.న‌ట‌రాజ‌న్.

ముంబై తుది జ‌ట్టు : రోహిత్ శ‌ర్మ, ఇషాన్ కిష‌న్ (వికెట్ కీప‌ర్), న‌మాన్ ధార్, సూర్య‌కుమార్ యాద‌వ్, తిల‌క్ వ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, అన్షుల్ కంబోలి, పీయూష్ చావ్లా, జ‌స్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార‌.

ఈ మ్యాచ్‌తో ముంబై త‌ర‌ఫున‌ అన్షుల్ కంబోల్ అరంగేట్రం చేయ‌నున్నాడు. క‌మిన్స్ సేన కూడా రెండు మార్పులు చేసింది. వ‌రుస‌గా విఫ‌ల‌మైతున్న మ‌ర్క్‌ర‌మ్‌ను ప‌క్క‌న పెట్టేసింది. మ‌యాంక్ అగ‌ర్వాల్, పేస‌ర్ మార్కో జాన్‌సెన్‌లు తుది జ‌ట్టులోకి వ‌చ్చారు.

ఉప్ప‌ల్ స్టేడియంలో ముంబై బౌల‌ర్ల‌పై స‌న్‌రైజ‌ర్స్ ఆట‌గాళ్లు ఏ రేంజ్‌లో ఆడారో చూశాం. హెడ్ సెంచ‌రీ, అభిషేక్, మ‌ర్క్‌ర‌మ్, క్లాసెన్ అర్ధ శ‌త‌కాల‌ ధాటికి ఐపీఎల్ రికార్డు బ‌ద్ధ‌లైపోయింది. ఆ త‌ర్వాత ముంబై బ్యాట‌ర్లు చివ‌రిదాకా పోరాడినా ఓట‌మి త‌ప్ప‌లేదు. మ‌రి ఈసారి సన్‌రైజ‌ర్స్ హిట్ట‌ర్లు వాంఖ‌డేలో త‌మ త‌డాఖా చూపేందుకు సిద్ధ‌గా ఉన్నారు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌పై ఒక్క ప‌రుగు విజ‌యం ఆరెంజ్ ఆర్మీ ప్లే ఆఫ్స్ అవ‌కాశాల్ని స‌జీవంగా ఉంచింది. మ‌రోవైపు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ చేతిలో దారుణ ఓట‌మితో ముంబై ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన విష‌యం తెలిసిందే.

2024-05-06T13:43:41Z dg43tfdfdgfd