MI VS PBKS | నిప్పులు చెరుగుతున్న బుమ్రా.. 49కే పంజాబ్ సగం వికెట్లు డౌన్

MI vs PBKS : ముంబై నిర్దేశించిన 192 ప‌రుగుల భారీ ఛేద‌న‌లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ముల్ల‌న్‌ఫూర్ స్టూడియంలో ముంబై బౌల‌ర్లు నిప్పులు చెరగ‌డంతో 49 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు కోల్పోయింది. ముంబై పేస‌ర్ల ధాటికి నెట్ ర‌న్ రేటు 10కి చేర‌డంతో శ‌శాంక్ సింగ్(35), జితేశ్ శ‌ర్మ‌(9)లు ధ‌నాధాన్ ఆడుతున్నారు. దాంతో, పంజాబ్ 9 ఓవ‌ర్ల‌కు 5 వికెట్ల న‌ష్టానికి 76 ర‌న్స్ చేసింది.

సొంత‌గ‌డ్డ‌పై దంచుతార‌నుకుంటే.. బుమ్రా, గెరాల్డ్ విజృంభ‌ణ‌తో పంజాబ్ కింగ్స్ బ్యాట‌ర్లు ఒక్క‌రొక్క‌రుగా పెవిలిన్‌కు క్యూ క‌డుతున్నారు. గెరాల్డ్ కొయెట్జీ వేసిన‌ . తొలి ఓవ‌ర్‌లోనే డేంజ‌ర‌స్ ఓపెన‌ర్ ప్ర‌భ్‌సిమ్రాన్ సింగ్(0) ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత బంతి అందుకున్న బుమ్రా.. పంజాబ్ బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు.

సూప‌ర్ యార్క‌ర్‌తో రీలె ర‌స్సో(1)ను బౌల్డ్ చేసిన ఈ స్పీడ్‌స్ట‌ర్ ఆఖ‌రి బంతికి పంజాబ్ కెప్టెన్ సామ్ క‌ర‌న్‌(6)ను వెన‌క్కి పంపాడు. దాంతో, పంజాబ్ 13 ప‌రుగుల‌కే రెండు కీల‌క వికెట్లు కోల్పోయింది. గెరాల్డ్.. మ‌రుస‌టి ఓవ‌ర్‌లో డేంజ‌ర‌స్ లివింగ్‌ష్టోన్‌(1)ను రిట‌ర్న్ క్యాచ్‌తో వెన‌క్కి పంపాడు. ఇక శ్రేయాస్ గోపాల్ బౌలింగ్‌లో ఇంప్యాక్ట్ ప్లేయ‌ర్ హార్‌ఫ్రీత్ సింగ్ భాటియా(13) రిట‌ర్న్ క్యాచ్ ఇచ్చి వెళ్లాడు. దాంతో, 49కే స‌గం వికెట్లు ప‌డిన పంజాబ్‌ను శ‌శాంక్, జితేశ్‌లు ఆదుకునే పనిలో ప‌డ్డారు.

2024-04-18T17:16:48Z dg43tfdfdgfd