MI VS PBKS | తొలి ఓవ‌ర్‌లోనే బ్రేకిచ్చిన రబ‌డ‌.. బ‌తికిపోయిన హిట్‌మ్యాన్

MI vs PBKS : ముల్ల‌న్‌పూర్ వేదిక‌గా జ‌రుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్(Mumbai Indians)తొలి వికెట్‌ ప‌డింది. భీక‌ర ఫామ్‌లో ఉన్న ఓపెన‌ర్ ఇషాన్ కిష‌న్(8) ఔట‌య్యాడు. ర‌బ‌డ బౌలింగ్‌లో ఇషాన్ భారీ షాట్ ఆడి.. బౌండ‌రీ వ‌ద్ద హ‌ర్‌ప్రీత్ బ్రార్ చేతికి చిక్కాడు. దాంతో, 18 ప‌రుగుల వ‌ద్ద ముంబై తొలి వికెట్ కోల్పోయింది. ఆరు ఓవ‌ర్ల‌కు ముంబై స్కోర్.. 54/1

ఇషాన్ ఔటైనా గ‌త మ్యాచ్‌లో సీఎస్కేపై సెంచ‌రీ బాదిన రోహిత్ శ‌ర్మ‌(24)దంచుతున్నాడు. మ‌రో ఎండ్‌లో సూర్య కుమార్ యాద‌వ్(22) చెల‌రేగుతున్నాడు. అయితే హ‌ర్ష‌ల్ ప‌టేల్ ఓవ‌ర్లో హిట్‌మ్యాన్ ఎల్బీగా ఔట్ అయ్యాడు. కానీ, వెంటనే రివ్యూ తీసుకొని బ‌తికిపోయాడు.

2024-04-18T14:31:41Z dg43tfdfdgfd