MI VS PBKS | అశుతోష్ పోరాడినా.. ఉత్కంఠ పోరులో ముంబైదే విజ‌యం

MI vs PBKS : ప‌దిహేడో సీజ‌న్‌లో మ‌రో ఉత్కంఠ పోరు ఫ్యాన్స్‌ను మునివేళ్ల‌పై నిల‌బెట్టింది. ముల్ల‌నూర్ వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్(Mumbai Indians), పంజాబ్ కింగ్స్(Punjab Kings) జ‌ట్లు ఆఖ‌రి ఓవ‌ర్ వ‌ర‌కూ హోరాహోరీగా త‌ల‌ప‌డ‌గా.. చివ‌ర‌కు ముంబై మూడో విక్ట‌రీ కొట్టింది. సూర్య‌కుమార్ యాద‌వ్(78) మెరుపు హాఫ్ సెంచ‌రీకి.. బుమ్రా(3/21), కొఎట్జీ(3/32)లు సూప‌ర్ స్పెల్ తోడ‌వ్వ‌డంతో గెలుపొందింది. అయితే.. పంజాబ్ ఏమీ ఊరికే వ‌ద‌ల్లేదు. టాపార్డ‌ర్ వైఫ‌ల్యంతో ఒక‌ద‌శ‌లో 77 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయిన పంజాబ్‌ను అశుతోష్ శ‌ర్మ‌(61) సంచ‌న‌ల బ్యాటింగ్‌తో ముంబైని వ‌ణికించాడు. అయితే.. గెరాల్డ్ అత‌డి సుడిగాలి ఇన్నింగ్స్‌కు తెర‌దించి పంజాబ్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాడు. దాంతో, ముంబై 9 వికెట్ల‌తో విజ‌యం సాధించ‌గా పంజాబ్ హ్యాట్రిక్ ఓట‌మి మూట‌గ‌ట్టుకుంది.

ముంబై నిర్ధేశించిన‌ భారీ ఛేద‌న‌లో పంజాబ్ కింగ్స్ టాపార్డ‌ర్ బ్యాట‌ర్లంతా 14 ప‌ర‌గుల‌కే డ‌గౌట్‌కు చేరారు. పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డిన పంజాబ్ గెల‌పు ఆశ‌ల‌ను మోస్తూ ముల్ల‌న్‌ఫూర్ స్టేడియంలో అశుతోష్ శర్మ‌(61) మ‌రోసారి విధ్వంసం సృష్టించాడు. అయితే బుమ్రా, కొయెట్జీలు కీల‌క వికెట్లు తీసి ముంబైకి మూడో విక్ట‌రీ అందించారు.

పంజాబ్ బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు

సొంత‌గ‌డ్డ‌పై ముంబైని దంచుతార‌నుకుంటే.. బుమ్రా, గెరాల్డ్ విజృంభ‌ణ‌తో పంజాబ్ కింగ్స్ బ్యాట‌ర్లు ఒక్క‌రొక్క‌రుగా పెవిలిన్‌కు క్యూ క‌ట్టారు. గెరాల్డ్ కొయెట్జీ వేసిన‌తొలి ఓవ‌ర్‌లోనే డేంజ‌ర‌స్ ఓపెన‌ర్ ప్ర‌భ్‌సిమ్రాన్ సింగ్(0) గోల్డెన్ డ‌క్‌గా ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత బంతి అందుకున్న బుమ్రా.. పంజాబ్ బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. సూప‌ర్ యార్క‌ర్‌తో రీలె ర‌స్సో(1)ను బౌల్డ్ చేసిన ఈ స్పీడ్‌స్ట‌ర్ ఆఖ‌రి బంతికి కెప్టెన్ సామ్ క‌ర‌న్‌(6)ను వెన‌క్కి పంపాడు. దాంతో, పంజాబ్ 13 ప‌రుగుల‌కే రెండు కీల‌క వికెట్లు కోల్పోయింది. గెరాల్డ్.. మ‌రుస‌టి ఓవ‌ర్‌లో డేంజ‌ర‌స్ లివింగ్‌ష్టోన్‌(1)ను రిట‌ర్న్ క్యాచ్‌తో వెన‌క్కి పంపాడు. ఇక శ్రేయాస్ గోపాల్ బౌలింగ్‌లో ఇంప్యాక్ట్ ప్లేయ‌ర్ హార్‌ఫ్రీత్ సింగ్ భాటియా(13) రిట‌ర్న్ క్యాచ్ ఇచ్చి వెళ్లాడు. దాంతో, 49కే స‌గం వికెట్లు ప‌డిన పంజాబ్‌ను శ‌శాంక్, జితేశ్‌(9)లు ఆదుకున్నా ఈ జోడీని ఆకాశ్ మ‌ధ్వాల్ విడ‌దీశాడు.

ప‌ట్టువ‌ద‌లని విక్ర‌మార్కుడిలా..

అయినా పంజాబ్ ఇంకా పోటీలోనే ఉంది. అయితే.. 117 ప‌రుగుల వద్ద శ‌శాంక్‌ను బుమ్రా బోల్తా కొట్టించాడు. అక్క‌డితో అశుతోష్ గేర్ మార్చాడు. హ‌ర్‌ప్రీత్ బ్రార్(21)ను నాన్‌స్ట్రయికింగ్‌కే ప‌రిమితం చేస్తూ ముంబై పేస‌ర్లును కాచుకున్నాడు. త‌న మార్క్ షాట్ల‌తో అల‌రిస్తూ.. పంజాబ్ స్కోర్‌బోర్డును ఉరికించాడు. షెప‌ర్డ్, ఆకాశ్ మ‌ధ్వాల్ ఓవ‌ర్‌లో భారీ సిక్స‌ర్లు బాది హాఫ్ సెంచ‌రీ సాధించాడు. ఆకాశ్ వేసిన 16వ ఓవ‌ర్‌లో అశుతోష్ మూడు, బ్రార్ ఒక సిక్స‌ర్ బాద‌డంతో 24 ర‌న్స్ వ‌చ్చాయి. అప్ప‌టికీ పంజాబ్ విజ‌య స‌మీక‌ర‌ణం 24 బంతుల్లో 28కి చేరింది. అయితే.. గెరాల్డ్ డేంజ‌రస్ అశుతోష్‌ను వెన‌క్కి పంపి ముంబైని పోటీలోకి తెచ్చాడు. ఆ కాసేప‌టికే బ్రార్ సైతం వెనుదిర‌గ‌డంతో పంజాబ్ హ్యాట్రిక్ ఓట‌మి మూట‌గ‌ట్టుకుంది.

పంజాబ్ గ‌డ్డ‌పై ముంబై ఇండియ‌న్స్ బ్యాట‌ర్లు దంచేశారు. ఐపీఎల్ అంటేనే రెచ్చిపోయే మిస్ట‌ర్ 360 సూర్య కుమార్ యాద‌వ్(78) హాఫ్ సెంచ‌రీతో క‌ద తొక్క‌గా.. తెలుగు కుర్రాడు తిలక్ వ‌ర్మ‌(34నాటౌట్) మెర‌పు ఇన్నింగ్స్ ఆడాడు. వీళిద్ద‌రి విధ్వంసంతో రెండొంద‌లవైపు ప‌రుగెడుతున్న ముంబైకి పంజాబ్ బౌల‌ర్లు బ్రేకులు వేశారు. ఓపెన‌ర్ ఇషాన్ కిష‌న్(8), రోహిత్ శ‌ర్మ‌(36) లు త‌క్కువ‌కే ఔటైనా.. తిల‌క్ వ‌ర్మ‌ అండ‌గా చెల‌రేగిన సూర్య‌.. నాలుగో వికెట్‌కు 49 ర‌న్స్ జోడించాడు.

 

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ క‌ర‌న్ (2/41), హ‌ర్ష‌ల్ ప‌టేల్‌లు కీల‌క వికెట్లు తీయ‌డంతో ప‌రుగుల వేగం త‌గ్గింది. హార్దిక్ పాండ్యా(10).. మ‌రోసారి నిరాశ‌ప‌ర‌చ‌గా టిమ్ డేవిడ్(14) ఉన్న‌తంసేపు ధ‌నాధ‌న్ ఆడాడు. దాంతో, ముంబై నిర్ణీత ఓవ‌ర్లలో 7 వికెట్ల న‌ష్టానికి 192 రన్స్ చేయ‌గ‌లిగింది.

2024-04-18T18:16:54Z dg43tfdfdgfd