MI V PBKS | ముంబై పేస‌ర్ల జోరు.. నాలుగు వికెట్లు కోల్పోయిన పంజాబ్

MI v PBKS : ముల్ల‌న్‌ఫూర్ స్టూడియంలో ముంబై బౌల‌ర్లు నిప్పులు చెరుగుతున్నారు. దాంతో, పంజాబ్ కింగ్స్([Punjab Kings) బ్యాట‌ర్లు ఒక్క‌రొక్క‌రుగా పెవిలిన్‌కు క్యూ క‌డుతున్నారు. బుమ్రా, గెరాల్డ్ విజృంభ‌ణ‌తో పంజాబ్ మూడు ఓవ‌ర్లకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

తొలి ఓవ‌ర్‌లోనే డేంజ‌ర‌స్ ఓపెన‌ర్ ప్ర‌భ్‌సిమ్రాన్ సింగ్(0) వికెట్ తీసిన గెరాల్డ్.. మ‌రుస‌టి ఓవ‌ర్‌లో డేంజ‌ర‌స్ లివింగ్‌ష్టోన్‌(1)ను రిట‌ర్న్ క్యాచ్‌తో వెన‌క్కి పంపాడు. దాంతో, పంజాబ్ 14 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ప్ర‌స్తుతం ఇంప్యాక్ట్ ప్లేయ‌ర్ హార్‌ఫ్రీత్ సింగ్ భాటియా(1), శ‌శాంక్ సింగ్(5)లు ఆడుతున్నారు. 3 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోర్.. 21/4.

2024-04-18T16:31:43Z dg43tfdfdgfd