MI PBKS | అర్ధ శ‌త‌కంతో విరుచుకుప‌డ్డ‌ సూర్య‌.. పంజాబ్ ల‌క్ష్యం ఎంతంటే.?

MI PBKS : పంజాబ్ గ‌డ్డ‌పై ముంబై ఇండియ‌న్స్(Mumbai Indians) బ్యాట‌ర్లు చిత‌క్కొట్టారు. ఐపీఎల్ అంటేనే రెచ్చిపోయే మిస్ట‌ర్ 360 సూర్య కుమార్ యాద‌వ్(78) హాఫ్ సెంచ‌రీతో క‌ద తొక్క‌గా.. తెలుగు కుర్రాడు తిలక్ వ‌ర్మ‌(34 నాటౌట్) మెర‌పు ఇన్నింగ్స్ ఆడాడు. వీళిద్ద‌రి విధ్వంసంతో రెండొంద‌లవైపు ప‌రుగెడుతున్న ముంబైకి పంజాబ్ బౌల‌ర్లు బ్రేకులు వేశారు. హ‌ర్ష‌ల్ ప‌టేల్‌(3/31),  కెప్టెన్ సామ్ క‌ర‌న్ (2/41), లు కీల‌క వికెట్లు తీసి పాండ్యా సేన‌ను త‌క్కువ‌కే చేశాడు. చివ‌ర్లో టిమ్ డేవిడ్(14) ధ‌నాద‌న్ ఆడ‌డంతో ముంబై నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 192 ర‌న్స్ చేయ‌గ‌లిగింది.

టాస్ ఓడిన ముంబైకి శుభారంభం ద‌క్క‌లేదు. ఈ సీజ‌న్‌లో భీక‌ర ఫామ్‌లో ఉన్న ఓపెన‌ర్ ఇషాన్ కిష‌న్(8) ర‌బ‌డ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. భారీ షాట్ ఆడి.. బౌండ‌రీ వ‌ద్ద హ‌ర్‌ప్రీత్ బ్రార్ చేతికి చిక్కాడు. దాంతో, 18 ప‌రుగుల వ‌ద్ద ముంబై తొలి వికెట్ కోల్పోయింది. ఇషాన్ ఔటైనా గ‌త మ్యాచ్‌లో సీఎస్కేపై సెంచ‌రీ బాదిన రోహిత్ శ‌ర్మ‌(36) దంచాడు. హ‌ర్ష‌ల్ ప‌టేల్ ఓవ‌ర్లో రివ్యూ తీసుకొని బ‌తికిపోయిన హిట్‌మ్యాన్ సామ్ క‌ర‌న్ ఓవ‌ర్లో వెనుదిరిగాడు.

ఆ త‌ర్వాత తిల‌క్ వ‌ర్మ‌(34 నాటౌట్) అండ‌గా చెల‌రేగిన సూర్య‌.. నాలుగో వికెట్‌కు 49 ర‌న్స్ జోడించాడు. ప్ర‌భ్‌సిమ్రాన్ సింగ్ స్ట‌న్నింగ్ క్యాచ్ ప‌ట్ట‌డంతో సూర్య వెనుదిరిగాడు. హార్దిక్ పాండ్యా(10).. మ‌రోసారి నిరాశ‌ప‌ర‌చ‌గా టిమ్ డేవిడ్(14) ఉన్న‌తంసేపు ధ‌నాధ‌న్ ఆడాడు. దాంతో, ముంబై నిర్ణీత ఓవ‌ర్లలో వికెట్ల న‌ష్టానికి రన్స్ చేయ‌గ‌లిగింది.

పోలార్డ్ రికార్డు బ‌ద్ధ‌లు

ఈ సీజ‌న్‌లో శ‌త‌క గ‌ర్జ‌న చేసిన రోహిత్ వ‌ర్మ పంజాబ్‌పై మ్యాచ్‌లో ప‌లు రికార్డులు బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 224వ సిక్స‌ర్ బాదాడు. దాంతో, ముంబై త‌రఫున అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన క్రికెట‌ర్‌గా రికార్డు సృష్టించాడు. కీర‌న్ పోలార్డ్‌ను రెండో స్థానానికి నెట్టేశాడు. అంతేకాదు ఐపీఎల్‌లో 6,500 ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు.

ఇవి కూడా చ‌ద‌వండి

2024-04-18T16:01:45Z dg43tfdfdgfd