IPL 2024: టిమ్ డేవిడ్‌, కీర‌న్ పోలార్డ్‌కు మ్యాచ్ ఫీజులో ఫైన్‌

ముంబై: ముంబై ఇండియ‌న్స్ బ్యాట‌ర్ టిమ్ డేవిడ్‌, బ్యాటింగ్ కోచ్ కీర‌న్ పొలార్డ్‌కు.. మ్యాచ్ ఫీజులో 20 శాతం ఫైన్ వేశారు. ఏప్రిల్ 18వ తేదీన పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌(IPL 2024)లో ఆ ఇద్ద‌రూ ఐపీఎల్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ముంబై జ‌ట్టు స‌భ్యులు, స‌పోర్ట్ సిబ్బంది.. ఓ రివ్య్యూ విష‌యంలో బ్యాట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్‌కు అక్ర‌మ రీతిలో స‌హ‌క‌రించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో వైర‌ల్ కావ‌డంతో డేవిడ్‌, పోలార్డ్‌ల‌కు జ‌రిమానా వేశారు. డేవిడ్‌, పోలార్డ్ ఐపీఎల్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి ఆర్టిక‌ల్ 2.20 చ‌ట్టాన్ని అతిక్ర‌మించార‌ని,అందుకే ఆ ఇద్ద‌రికీ మ్యాచ్‌ఫీజులో 20 శాతం జ‌రిమానా విధించిన‌ట్లు ఓ రిలీజ్‌లో తెలిపారు.

ఆ మ్యాచ్ 15వ ఓవ‌ర్‌ను హ‌ర్ష‌దీప్ సింగ్ వేశాడు. ఆఫ్ స్టంప్‌పై వేసిన ఆ బంతి .. దూరంగా వెళ్తున్న‌ట్లు అనిపించింది. ఆ స‌మ‌యంలో 67 ప‌రుగుల వ‌ద్ద సూర్య బ్యాటింగ్ చేస్తున్నాడు. ముంబై జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ మార్క్ బౌచ‌ర్‌.. బ్యాట‌ర్ సూర్య వైపు చూస్తూ వైడ్ అని సంకేతం ఇచ్చాడు. అత‌ను ఇచ్చిన సంకేతం ఆధారంగా డేవిడ్‌, పోలార్డ్‌లు కూడా రివ్యూ తీసుకోవాల‌ని సూర్య‌ను కోరారు. అయితే ఇదంతా టీవీ కెమెరాల‌కు చిక్కింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ జ‌ట్టు ఓట‌మి పాలైంది.

2024-04-20T10:33:05Z dg43tfdfdgfd