IPL 2024 | అభిమాని ఐ ఫోన్ ప‌గ‌ల‌గొట్టి.. ఊహించ‌ని కానుక‌ ఇచ్చేశాడు

IPL 2024 : ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌ను అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అభిమాన క్రికెటర్ల బ్యాటింగ్ విన్యాసాల‌ను తిల‌కిస్తూ ఖుషీ ఖుషీగా చిందేస్తున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో కొంద‌రు సిక్స‌ర్ బంతి తగిలి గాయాల‌పాల‌వుతున్నారు. తాజాగా నెట్ ప్రాక్టీస్ సెష‌న్ చూసేందుకు వెళ్లిన‌ ఓ అభిమానికి మాత్రం చేదు అనుభవం మిగిలింది.

చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) ఆల్‌రౌండ‌ర్ డారిల్ మిచెల్(Daryl Mitchell) ఫుల్‌షాట్‌కు అతడి ఖ‌రీదైన‌ ఐ ఫోన్ (I Phone) పగిలిపోయింది. దాంతో, షాక్ తిన్న స‌ద‌రు అభిమానికి మిచెల్ ఊహించ‌ని బ‌హుమ‌తి ఇచ్చాడు. త‌న గ్లోవ్స్‌ను కానుక‌గా అందించి అత‌డి బాధ‌ను పోగొట్టాడు.

మూడో స్థానానికి ఎగ‌బాకి..

డిఫెండిగ్ చాంపియ‌న్ సీఎస్కే ఈ సీజ‌న్ ఆరంభంలో త‌డ‌బ‌డినా అనూహ్యంగా పుంజుకుంది. పంజాబ్ కింగ్స్‌ (Punjab Kings)పై విజ‌యంతో మూడో స్థానానికి ఎగ‌బాకి ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ధ‌ర్మ‌శాల వేదిక‌గా ర‌వీంద్ర జ‌డేజా ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్ట‌గా.. చెన్నై 28 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. త‌దుప‌రి మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌తో మే 10న సీఎస్కే త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లోనూ విజ‌యం సాధిస్తే రుతురాజ్ గైక్వాడ్ సేన ప్లే ఆఫ్స్ బెర్తు ఖ‌రారు చేసుకునే అవ‌కాశ‌ముంది.

ఇవి కూడా చ‌ద‌వండి

2024-05-07T11:31:27Z dg43tfdfdgfd