IPL 2024 SRH VS MI | టాస్ గెలిచిన ముంబై.. విధ్వంస‌క ఓపెన‌ర్‌కు చాన్స్

IPL 2024 SRH vs MI : ఐపీఎల్ 17వ సీజ‌న్ ఎనిమిదో మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(SRH), ముంబై ఇండియ‌న్స్(MI) త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో, హైద‌రాబాద్ జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది. ఈ మ్యాచ్‌లో ఇరుజ‌ట్లు రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగుతున్నాయి.

ముంబై జ‌ట్టులో ల్యూక్ వుడ్ స్థానంలో అండ‌ర్-19 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో చెలరేగిన క్వెనా మ‌ఫాకా  ఆడుతున్నాడు. హైద‌రాబాద్ విధ్వంస‌క ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. గాయ‌ప‌డిన న‌ట‌రాజ‌న్ స్థానంలో జ‌య‌దేవ్ ఉనాద్క‌ట్ ఆడ‌నున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కూ అన్ని జ‌ట్లు త‌మ సొంత స్టేడియంలో విజ‌యం సాధించాయి. ఇప్పుడు హైద‌రాబాద్ కూడా త‌మ ఇలాకా అయిన ఉప్ప‌ల్‌లో జ‌య‌భేరి మోగించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది.

హైద‌రాబాద్ తుది జ‌ట్టు : ట్రావిస్ హెడ్, మ‌యాంక్ అగ‌ర్వాల్, అభిషేక్ శ‌ర్మ‌, ఎడ‌న్ మ‌ర్క్‌ర‌మ్, క్లాసెన్, అబ్దుల్ స‌మ‌ద్, ష‌హ్‌బాజ్ అహ్మ‌ద్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), భువ‌నేశ్వ‌ర్, మయాంక్ మార్కండే, జ‌య‌దేవ్ ఉనాద్క‌ట్.

ముంబై తుది జ‌ట్టు : ఇషాన్ కిష‌న్(వికెట్ కీప‌ర్), రోహిత్ శ‌ర్మ‌, న‌మ‌న్ ధిర్, తిల‌క్ వ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, శామ్స్ ములానీ, పీయూష్ చావ్లా, జ‌స్ప్రీత్ బుమ్రా, క్వెనా మ‌ఫాకా.

2024-03-27T13:49:35Z dg43tfdfdgfd