IPL 2024 POINTS TABLE: ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన చెన్నై.. హైదరాబాద్ స్థానం ఎంతంటే?

IPL 2024 Points Table updated: ఐపీఎల్ సీజన్ 17లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చిత్తు చేసిన సీఎస్కే... నిన్న గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చేసింది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో గైక్వాడ్‌ సేన.. గిల్ సేనపై విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక గుజరాత్ చేతులెత్తేసింది. ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. టైటాన్స్ లో సుదర్శన్ (37) ఒక్కడే రాణించాడు. చెన్నై టీమ్ లో శివమ్ ధూబే(51),  రచిన్ రవీంద్ర(46), రుతురాజ్ గైక్వాడ్(46) పరుగులతో రాణించారు. ఈ వీజయంతో సీఎస్కే ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానికి దూసుకెళ్లింది. 

ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తాయి. ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచిన సీఎస్కే ఐపీఎల్ పాయింట్ల టేబుల్ లో తొలి స్థానం దక్కించుకుంది. ఒక్కో మ్యాచ్ ఆడి.. గెలిచిన రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆడిన రెండేసి మ్యాచుల్లో ఒక్కో మ్యాచ్ గెలిచిన పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఆడిన ఒక్క మ్యాచ్ లోనే ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా ఏడు, ఏనిమిది, తొమ్మిది, పదో స్థానాల్లో కొనసాగుతున్నాయి. 

ఐపీఎల్ లో చెన్నై, ముంబైలకు మంచి రికార్డు ఉంది. ఈ రెండు జట్లు ఐదేసి సార్లు టైటిల్‌ను కైవసం చేసుకున్నాయి. ఇక కేకేఆర్ జట్టు రెండు సార్లు ట్రోఫీని గెలుచుకుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్, డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ ఒక్కోసారి ప్రతిష్టాత్మక ట్రోఫీని కైవసం చేసుకున్నాయి. 

Also Read: IPL 2024 SRH vs MI: సొంతగడ్డపై ముంబైతో తలపడనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, బోణీ కొడుతుందా

Also Read: CSK Vs GT Match: శుభ్‌మన్‌గిల్‌పై రుతురాజ్‌ పైచేయి.. చెన్నైకి రెండో ఘన విజయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-03-27T07:42:03Z dg43tfdfdgfd