IPL 2024 CSK VS GT | చెపాక్‌లో దూబే, ర‌చిన్ విధ్వంసకాండ‌.. రికార్డ్ స్కోర్ కొట్టిన సీఎస్కే

IPL 2024 CSK vs GT : సొంత మైదానంలో జ‌రుగుతున్న రెండో మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్(CSK) భారీ స్కోర్ కొట్టింది. టాపార్డ‌ర్ చెల‌రేగ‌డంతో గుజ‌రాత్ టైటాన్స్‌పై రెండొంద‌లు కొట్టింది. అచ్చొచ్చిన స్టేడియంలో సిక్స‌ర్ల శివం దూబే(51) హాఫ్‌ సెంచ‌రీతో విజృంభించ‌గా.. విధ్వంస‌క ఓపెన‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర‌(46), కెప్టెన్ చివ‌ర్లో సమీర్ ర‌జ్వీ(14) రెండు సిక్స‌ర్లు బాదడంతో గైక్వాడ్ సేన నిర్ణీత ఓవ‌ర్ల‌లో వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగులు చేసింది. త‌ద్వారా ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో సీఎస్కే అత్య‌ధిక స్కోర్ న‌మోదు చేసింది. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

టాస్ ఓడినా చెన్నైకి ఓపెన‌ర్లు ర‌చిన్ ర‌వీంద్ర‌(46), రుతురాజ్ గైక్వాడ్(46)లు శుభారంభమిచ్చారు. తొలి ఓవ‌ర్లోనే సాయి కిశోర్ క్యాచ్ వ‌దిలేయ‌డంతో బ‌తికిపోయిన ర‌వీంద్ర ఆత‌ర్వాత‌ విధ్వంసం సృష్టించాడు. ఉమేశ్ యాద‌వ్, ఒమ‌ర్ జాయ్ బౌలింగ్‌లో బౌండ‌రీలతో విరుచుకు ప‌డ్డారు. దాంతో, సీఎస్కే స్కోర్ రాకెట్ వేగంతో ప‌రుగెత్తింది. అయితే.. 61 ప‌రుగుల వ‌ద్ద ఈ జోడీని ర‌షీద్ ఖాన్ విడ‌దీశాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన ర‌హానే(12) ఎక్కువ సేపు నిల‌వలేదు.

అయినా సీఎస్కే స్కోర్ వేగం తగ్గ‌లేదు. తొలి మ్యాచ్‌లో చెన్నైని గెలిపించిన‌ దూబే గుజ‌రాత్ బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు. సిక్స‌ర్ల‌తో హోరెత్తించి అర్ధ శ‌త‌కం సాధించాడు. ఆఖ‌ర్లో అత‌డు ఔటైనా.. అరంగేట్రం కుర్రాడు స‌మీర్ ర‌జ్వీ(14) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో, గైక్వాడ్ సేన‌ గుజ‌రాత్ మందు కొండంత‌ ల‌క్ష్యాన్ని ఉంచింది.

 ఇవి కూడా చ‌ద‌వండి

2024-03-26T16:02:40Z dg43tfdfdgfd