IND VS PAK | టీమిండియా ఇన్నింగ్స్‌కు అంత‌రాయం.. స్కోర్..?

IND vs PAK న్యూయార్క్ వేదిక‌గా జ‌రుగుతున్న భార‌త్(India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించింది. భార‌త ఇన్నింగ్స్ 8 ప‌రుగుల వద్ద మ‌ళ్లీ వానం మొద‌లైంది. దాంతో ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌(8), విరాట్ కోహ్లీ(0)తో స‌హా పాక్ ఆట‌గాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వ‌చ్చేశారు. తొలి ఓవ‌ర్ ముగిసేస‌రికి భార‌త జ‌ట్టు స్కోర్.. 8/0.

టాస్ ఓడిన భార‌త్‌కు కెప్టెన్ రోహిత్ అదిరే ఆరంభ‌మిచ్చాడు. పాస్ ప్ర‌ధాన పేస‌ర్ షాహీన్ ఆఫ్రిద‌ది వేసిన తొలి ఓవ‌ర్లో మూడో బంతిని హిట్‌మ్యాన్ అమాంతం స్టాండ్స్‌లోకి పంపాడు. ఆ సిక్స‌ర్‌తో దూకుడుగా ఆడ‌డ‌మే త‌న ఉద్దేశ‌మ‌ని బాబ‌ర్ సేన‌కు చాటాడు. దాంతో, ఆ ఓవ‌ర్లో ఏకంగా 8 ర‌న్స్ వ‌చ్చాయి.

2024-06-09T15:34:29Z dg43tfdfdgfd