IND VS PAK: గజినీలా మారిపోతున్న రోహిత్ శర్మ..! ఏం చేశాడో తెలిస్తే నవ్వకుండా ఉండరు..! వీడియో

రోహిత్ శర్మ.. ఆటతోనే కాకుండా, తన చేష్టలతో కూడా ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తుంటాడు. టాస్ సందర్భంగా తన మతిమరుపుతో పాటు.. తోటి ఆటగాళ్లను ఆటపట్టించడం వంటివి చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. గతంలో ఎన్నోసార్లు ఇలాంటివి చేస్తూ కెమెరా కంటికి కనిపించాడు. ఇటీవల ఐపీఎల్‌ 2024 సందర్భంగా కూడా కెమెరామెన్‌ను ఆడియో మ్యూట్‌ చేయమని, చేతులు జోడించి కోరుతూ నవ్వులు పూయించాడు. తాజాగా టీ20 ప్రపంచకప్‌ 2024లోనూ రోహిత్ శర్మ చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ టోర్నీలో భాగంగా భారత్‌-పాకిస్థాన్‌ జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌.. భారత్‌కు బ్యాటింగ్‌ అప్పగించింది. అయితే మ్యాచ్‌ సందర్భంగా రోహిత్ శర్మ చేసిన పని నవ్వులు పూయిస్తోంది.

అసలేం జరిగిందంటే..

టాస్‌ కోసమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పాకిస్థాన్ సారథి బాబర్‌ ఆజమ్‌తో పాటు కామెంటేటర్‌ రవిశాస్త్రి గ్రౌండ్‌లోకి వెళ్లాడు. మ్యాచ్‌ రిఫరీ డేవిడ్ బూన్‌ కూడా అక్కడే ఉన్నాడు. టాస్‌ కాయిన్‌ను గ్రౌండ్‌లోకి రాకముందే రోహిత్ శర్మకు ఇచ్చారు. దాన్ని హిట్‌మ్యాన్ తన ప్యాంటు జేబులో వేసుకున్నాడు. దీంతో పిచ్‌ వద్దకు వచ్చిన రవిశాస్త్రి.. రోహిత్‌ కాయిన్‌ ఎగరవేయు అని చెప్పాడు. తన ప్యాంటు జేబులో కాయిన్‌ ఉందనే విషయాన్ని మర్చిపోయిన రోహిత్.. కాయిన్‌ ఇవ్వండి అంటూ రవిశాస్త్రికి సైగ చేశాడు.

అదేంటి నీ దగ్గరే కదా కాయిన్‌ ఉంది అన్నట్లుగా రవిశాస్త్రి లుక్‌ ఇచ్చాడు. దీంతో రోహిత్‌కు గతం గుర్తొచ్చింది! తన దగ్గరే కాయిన్‌ ఉన్నట్లు తెలిసింది. వెంటనే తన జేబులోని కాయిన్‌ను తీసి ఎగరేశాడు రోహిత్. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా రోహిత్ శర్మ ఇలా బ్రెయిన్ ఫేడ్ మూమెంట్స్‌ చేయడం కొత్తేమీ కాదు. గతంలోనూ న్యూజిలాండ్‌తో టాస్‌ సందర్భంగా ఇలానే చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచినా.. వెంటనే తన అభిప్రాయాన్ని చెప్పలేదు. చేతిని తల దగ్గర ఉంచి.. కాసేపు ఆలోచించాడు. ఏం ఎంచుకోవాలనే విషయాన్ని మర్చిపోయినట్టుగా చేసి.. కొన్ని సెకన్ల తర్వాత బౌలింగ్‌ ఎంచుకున్నట్లు చెప్పాడు. దూరం నుంచి ఇదంతా గమనించిన భారత ఆటగాళ్లు యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్.. రోహిత్ హావభావాలను చూసి తెగ నవ్వుకున్నారు. రోహిత్ శర్మ మతిమరుపు గురించి విరాట్ కోహ్లి కూడా గతంలోనే చెప్పాడు. ఐప్యాడ్, వ్యాలెట్, ఫోన్.. ఇలా వస్తువులన్నీ ఎక్కడపడితే అక్కడ మర్చిపోతాడని.. తీరా గుర్తొచ్చాక కొత్తవి కొనుకోవచ్చులే అంటాడని విరాట్ చెప్పాడు. తాజాగా మరోసారి బ్రెయిన్ ఫేడ్‌ మూమెంట్‌తో రోహిత్‌ వార్తల్లో నిలిచాడు.

కాగా పాకిస్థాన్‌తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ 2024లో మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. పదేపదే వర్షం అంతరాయం కలిగిస్తుండటంతో మ్యాచ్‌ జరగడం ఆలస్యమవుతోంది

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-06-09T16:25:28Z dg43tfdfdgfd