IND VS PAK | ఓపెనర్లు ఔట్.. టీమిండియా స్కోర్..?

IND vs PAK : న్యూయార్క్ వేదిక‌గా పాకిస్థాన్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో భార‌త్(India) రెండు కీల‌క వికెట్లు కోల్పోయింది. ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌(12), విరాట్ కోహ్లీ(4)లు స్వ‌ల్ప స్కోర్‌కే పెవిలియ‌న్ చేరారు. న‌సీం షా ఓవ‌ర్లో కోహ్లీ గ‌ల్లీ పాయింట్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఆ త‌ర్వాత షాహీన్ ఆఫ్రిది వేసిన రెండో ఓవ‌ర్‌లో రోహిత్ భారీ షాట్ ఆడి బౌండ‌రీ వ‌ద్ద హ్యారిస్ ర‌వుఫ్ చేతికి దొరికాడు. దాంతో, 19 ప‌రుగుల‌కే భార‌త్ రెండో వికెట్ ప‌డింది. ప్ర‌స్తుతం రిష‌భ్ పంత్(2), అక్ష‌ర్ ప‌టేల్‌(0) ఆడుతున్నారు. 3 ఓవ‌ర్ల‌కు భార‌త జ‌ట్టు స్కోర్..20/2.

2024-06-09T16:19:36Z dg43tfdfdgfd