IGOR STIMAC | మా ల‌క్ష్యం డ్రా కాదు.. టీమిండియా ఓడితే రాజీనామా చేస్తా

Igor Stimac : ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌ క్వాలిఫ‌య‌ర్‌లో భార‌త జ‌ట్టు(Team India) కీల‌క స‌మ‌రానికి సిద్ధ‌మైంది. మంగ‌ళ‌వారం అఫ్గ‌నిస్థాన్‌తో జ‌రిగే పోరులో సునీల్ ఛెత్రీ సేన విజ‌యంపై క‌న్నేసింది. ఈ మ్యాచ్‌కు మ‌రికొన్ని గంట‌లు ఉంద‌న‌గా హెడ్‌కోచ్ ఇగొర్ స్టిమాక్(Igor Stimac) సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. ఒక‌వేళ‌ టీమిండియా ఓడిపోతే తాను రాజీనామా చేస్తాన‌ని స్పష్టం చేశాడు. అఫ్గ‌నిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు ఇగొర్ మీడియా స‌మావేశంలో మాట్లాడాడు.

‘టీమిండియాను మూడో రౌండ్‌కు తీసుకెళ్ల‌కుంటే నేను ప‌ద‌వి నుంచి వైదొలుగుతా. ఈ ఐదేండ్ల కాలంలో నేను పొందిన‌ గౌర‌వం ప‌రువు అన్నింటినీ వ‌దిలేస్తా. డ్రా అనేది మాకు ఓట‌మితో స‌మాన‌మే. జూన్‌లో కువైట్‌తో జ‌రిగే మ్యాచ్ కోసం ప్ర‌ణాళికాబ‌ద్ధంగా సిద్ధ‌మ‌వుతున్నాం’ అని ఇగొర్ తెలిపాడు. అఫ్గ‌నిస్థాన్‌తో పోరు సునీల్ ఛెత్రీ 150వ అంత‌ర్జాతీయ మ్యాచ్ కానుంది. ఈ సంద‌ర్భంగా ఐఐఎఫ్ఎఫ్ అత‌డిని స‌న్మానించ‌నుంది.

వ‌ర‌ల్డ్ క‌ప్ క్వాలిఫ‌య‌ర్ కోసం ఆలిండియా ఫుట్‌బాల్ స‌మాఖ్య(AIFF) 25 మందితో కూడిన‌ స్క్వాడ్‌ను ప్ర‌క‌టించింది.  భార‌త‌ బృందంలో ఇద్ద‌రు గోల్ కీప‌ర్లు, 8 మంది డిఫెండ‌ర్లు, 10 మంది మిడ్ ఫీల్డ‌ర్లు, న‌లుగురు ఫార్వ‌ర్డ్స్‌  ఉన్నారు.

గోల్ కీప‌ర్లు – గుర్‌ప్రీత్ సింగ్ సంధు, అమ‌రింద‌ర్ సింగ్, విశౄల్ కైత్.

డిఫెండ‌ర్లు – ఆకాశ్ మిశ్రా, మెహ్తాబ్ సింగ్, రాహుల్ భెకె, నిఖిల్ పూజారీ, సుభాషిశ్ బోస్, అన్వ‌ర్ అలీ, అమే ర‌న‌వ‌డే, జై గుప్తా.

మిడ్ ఫీల్డ‌ర్లు – అనిరుధ్ థాపా, బ్రాండ‌న్ ఫెర్నాండేజ్‌, లిస్ట‌న్ కొలాకో, మ‌హేశ్ సింగ్ న‌వొరెమ్, స‌హ‌ల్ అబ్దుల్ స‌మ‌ద్, సురేశ్

సింగ్, జీక్స‌న్ సింగ్, దీప‌క్ తంగ్రీ, ల‌లెంగ్మ‌వియా రాల్టే, ఇమ్రాన్ ఖాన్.

ఫార్వ‌ర్డ్స్ – సునీల్ ఛెత్రీ, ల‌ల్లియంజుల ఛాంగ్టే, మ‌న్వీర్ సింగ్, విక్ర‌మ్ ప్ర‌తాప్ సింగ్.

ప్ర‌స్తుతం క్వాలిఫ‌య‌ర్ గ్రూప్ -ఏలో భారత్ మూడు పాయింట్ల‌తో మూడో స్థానంలో ఉంది. కువైట్ రెండో స్థానంలో కొనసాగుతోంది. అఫ్గ‌నిస్థాన్‌తో మార్చి 22న గువాహ‌టిలో జ‌రిగే మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా కువైట్‌ను వెన‌క్కి నెడుతుంది. రెండో ద‌శ క్వాలిఫ‌య‌ర్‌లో భాగంగా ఛెత్రీ సేన‌ కువైట్‌తో త‌ల‌ప‌డ‌నుంది. జూన్ 6న జ‌రిగే ఈ పోరుకు హైద‌రాబాద్ వేదిక కానుంది.

ఇవి కూడా చ‌ద‌వండి

2024-03-26T12:02:20Z dg43tfdfdgfd