HEINRICH KLAASEN: హెన్రిచ్ క్లాసెన్ పిచ్చికొట్టుడు.. చీర్స్ చెప్పిన కుతూరు.. వీడియో

హైద‌రాబాద్‌: ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ హెన్రిచ్ క్లాసెన్(Heinrich Klaasen) శివ‌మెత్తిన విష‌యం తెలిసిందే. 34 బంతుల్లో అత‌ను 80 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అత‌న్ని ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఏడు సిక్స‌ర్లు ఉన్నాయి. అత‌ని స్ట్ర‌యిక్ రేట్ 235.29గా ఉంది. క్లాసెన్ ఓ వైపు భారీ షాట్ల‌తో అల‌రిస్తుంటే, మ‌రో వైపు స్టాండ్స్‌లో ఉన్న అత‌ని 15 నెల‌ల కూతురు చేతుల్లో జెండా ప‌ట్టుకుని చీర్స్ చెప్పింది. ఎస్ఆర్‌హెచ్ జెండాతో క్లాసెన్ కూతురు త‌న తండ్రిలో ఉత్సాహాన్ని నింపింది. ఆ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. ఆ వీడియోను హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. ఆ వీడియోను ఓసారి వీక్షించండి.

2024-03-28T09:21:26Z dg43tfdfdgfd