HARDIK PANDYA: స‌న్‌రైజ‌ర్స్‌ సూప‌ర్ షో.. హార్దిక్ పాండ్యాపై ట్రోలింగ్‌

హైద‌రాబాద్‌: ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు ఈసారి ఏడాది వ‌రుస‌గా రెండో ఓట‌మి ఎదురైంది. స‌న్‌రైజ‌ర్స్‌తో బుధ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో ఆ జ‌ట్టు తీవ్రంగా పోరాడినా ఓట‌మి త‌ప్ప‌లేదు. దీంతో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya)పై ట్రోలింగ్ జోరందుకున్న‌ది. ఆ జ‌ట్టుకు పాండ్యా కొత్త‌గా సార‌థ్య బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఫ‌స్ట్ మ్యాచ్‌లో కొన్ని త‌ప్పుల వ‌ల్ల పాండ్యాపై ప్రెజ‌ర్ పెరిగింది. ఇక రెండో మ్యాచ్‌లోనూ ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు భారీ స్కోర్ చేయ‌డంతో పాండ్యాపై వ‌త్తిడి మ‌రింత డ‌బులైంది. ఇక సోష‌ల్ మీడియాలో అత‌నిపై మీమ్స్ జోరందుకున్నాయి. మేటి ముంబై జ‌ట్టు వ‌రుస‌గా రెండో ఓట‌మి ఎదుర్కోవ‌డంతో ఆ జ‌ట్టు యాజ‌మాన్యంపై కూడా వ‌త్తిడి పెరిగింది.

ఓట‌మి త‌ట్టుకోలేని పాండ్యా.. గ్రౌండ్‌లో సంతోషంగా కనిపించే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు ఓ యూజ‌ర్ త‌న ఎక్స్ అకౌంట్‌లో సెటైర్ వీడియోను ట్వీట్ చేశారు.మాజీ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్‌.. పాండ్యా ఆట తీరును త‌ప్పుప‌ట్టారు. చాలా పేల‌వంగా పాండ్యా కెప్టెన్సీ ఉన్న‌ట్లు పేర్కొన్నాడు. ఒక‌వైపు స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్లు చెల‌రేగిపోతుంటే.. ఆ స‌మ‌యంలో కీల‌క బౌల‌ర్ బుమ్రాను పాండ్యా వాడుకోక‌పోవ‌డం అర్థం కావ‌డం లేద‌న్నారు. అయితే బుధ‌వారం మ్యాచ్‌లో ముంబై త‌ర‌పున బుమ్రానే ఉత్త‌మ బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడు. 4 ఓవ‌ర్ల‌లో బుమ్రా కేవ‌లం 36 ర‌న్స్ మాత్ర‌మే స‌మ‌ర్పించాడు. ముంబై త‌న త‌ర్వాత మ్యాచ్‌ను ముంబై వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో ఆడ‌నున్న‌ది.

2024-03-28T06:51:12Z dg43tfdfdgfd