GULVEER SINGH | గుల్వీర్‌సింగ్‌ నయా నేషనల్‌ రికార్డు

Gulveer Singh | పొర్ట్‌లండ్‌: గతేడాది హాంగ్జౌ ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత యువ అథ్లెట్‌ గుల్వీర్‌ సింగ్‌.. 5000 మీటర్ల రేసులో సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. అమెరికా వేదికగా జరుగుతున్న పొర్ట్‌లండ్‌ ట్రాక్‌ ఫెస్టివల్‌లో ఈ ఉత్తరప్రదేశ్‌ కుర్రాడు 13 నిమిషాల 18.32 సెకన్లలో పరుగును పూర్తి చేసి రెండో స్థానంలో నిలవడంతో పాటు నేషనల్‌ రికార్డునూ బ్రేక్‌ చేశాడు.

గతంలో ఈ ఘనత అవినాశ్‌ సాబ్లె (13:19.30) పేరిట ఉండేది. పోర్ట్‌లండ్‌ ఈవెంట్‌లో అమెరికా అథ్లెట్‌ డైలన్‌ జాకబ్స్‌ (13:18.8) అగ్రస్థానం దక్కించుకోగా భారత్‌కు చెందిన కార్తీక్‌ కుమార్‌ 17వ స్థానంలో నిలిచాడు.

2024-06-10T19:08:50Z dg43tfdfdgfd