FRENCH OPEN | స్వియాటెక్ హ్యాట్రిక్.. మ‌హారాణిదే మ‌ట్టికోట కిరీటం

French Open : మ‌హిళ‌ల టెన్నిస్‌లో వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 1 ఇగా స్వియాటెక్(Iga Swiatek) చ‌రిత్ర సృష్టించింది. త‌న‌కు ఎంతో అచ్చొచ్చిన ఫ్రెంచ్ ఓపెన్‌(French Open)లో వ‌రుస‌గా మూడో ట్రోఫీ కొల్ల‌గొట్టింది. దాంతో, వ‌రుస‌గా నాలుగో గ్రాండ్‌స్లామ్ నాలుగో టైటిల్ గెలుపొందింది. శ‌నివారం జ‌రిగిన ఫైన‌ల్లోపొలాండ్ ఇట‌లీ కెర‌టం జాస్మినె ప‌వోలిని (Jasmine Paolini)ని అల‌వోక‌గా ఓడించింది. వ‌రుస సెట్లలో ఆధిప‌త్యం చెలాయించిన స్వియాటెక్ 6-2, 6-2తో జాస్మినెపై విజ‌యం సాధించింది.

దాంతో, గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైన‌ల్ చేరిన ప్ర‌తిసారి ట్రోఫీ గెలిచిన రికార్డు సొంతం చేసుకుంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఐదుసార్లు ఫైన‌ల్ చేరిన ఆమె ఐదింటా జ‌య‌భేరి మోగించి విజేత‌గా నిలిచింది.  ఈ ఏడాది ఆరంభంలో స్వియాటెక్ యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించింది. అదే జోరును కొన‌సాగించిన ఆమె మ‌ట్టి కోట‌లో మహారాణిగా ఎదిగింది.

ఆ ఇద్ద‌రు వైదొల‌గ‌డంతో…

ఫ్రెంచ్ ఓపెన్‌లో క‌ఠిన ప్ర‌త్య‌ర్థులు అరినా స‌బ‌లెంక, కొకొ గాఫ్‌లు సెమీస్‌లోనే వెనుదిర‌గ‌డం.. స్వియాటెక్ విజ‌యాన్ని తేలిక చేసింది. టోర్నీ ఆసాంతం సంచ‌ల‌న విజ‌యాలు సాధించిన జాస్మిన్ టైటిల్ పోరులో త‌డ‌బ‌డింది. కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైన‌ల్ ఆడిన ఇట‌లీ అమ్మాయి టాప్ సీడ్ జోరు ముందు నిల‌వ‌లేకపోయింది.

రెండో క్రీడాకారిణిగా

వ‌రుస‌గా మూడో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన స్వియాటెక్ మ‌రో రికార్డు నెల‌కొల్పింద‌. మ‌హిళ‌ల టెన్నిస్‌లో ఈ ఘ‌న‌త సాధించిన రెండో క్రీడాకారిణిగా ఆమె చ‌రిత్ర లిఖించింది. ఇంత‌కుముందు మాజీ వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 1 జ‌స్టిన్ హెనిన్(Justin Henin) 2005, 2006, 2007లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవ‌సం చేసుకుంది.

2024-06-08T15:15:34Z dg43tfdfdgfd