DC VS RR | అర్ధ శ‌త‌కం కొట్టిన శాంస‌న్.. పోరాడుతున్న రాజ‌స్థాన్

DC vs RR : ఢిల్లీ నిర్దేశించిన 222 ప‌రుగుల‌ భారీ ఛేద‌న‌లో రాజస్థాన్ రాయ‌ల్స్(Rajasthan Royals) పోరాడుతోంది. ఓ వైపు వికెట్లు ప‌డుతున్నా కెప్టెన్ సంజూ శాంస‌న్(41) హాఫ్‌ సెంచ‌రీ కొట్టాడు. 27 బంతుల్లో 5 ఫోర్లు, నాలుగు సిక్స‌ర్ల‌తో ఫిఫ్టీ బాదేశాడు. అయితే.. ర‌సిక్‌ద‌ర్ స‌లామ్సూప‌ర్ బాల్‌తో రియ‌న్ ప‌రాగ్(27)ను బౌల్డ్ చేసి ఢిల్లీకి బ్రేక్ ఇచ్చాడు. శుభ‌మ్ దూబే క్రీజ‌లోకి వ‌చ్చాడు. 12 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోర్.. 110/3. ఇంకా ఆ జ‌ట్టు విజ‌యానికి 155 ప‌రుగులు కావాలి.

ప‌వ‌ర్ ప్లే ముగిసే లోపు రాజ‌స్థాన్ రెండు కీల‌క వికెట్లు కోల్పోయింది. అక్ష‌ర్ ప‌టేల్ వేసిన ఆరో ఓవ‌ర్లో ఓపెన‌ర్ జోస్ బ‌ట్ల‌ర్(19) ఫోర్, సిక్స‌ర్ బాది ఆ త‌ర్వాత బంతికి బౌల్డ్ అయ్యాడు. దాంతో, ప‌రుగుల వ‌ద్ద రాజ‌స్థాన్ రెండో వికెట్ ప‌డింది. తొలి ఓవ‌ర్లోనే ఖ‌లీల్ అహ్మ‌ద్ వేసిన స్లో బాల్‌కు య‌శ‌స్వీ జైస్వాల్(4) ఔట‌య్యాడు.

2024-05-07T17:02:20Z dg43tfdfdgfd