DC VS RR | అభిషేక్, మెక్‌గుర్క్ హాఫ్ సెంచ‌రీల మోత‌.. టేబుల్ టాప‌ర్‌కు పెద్ద స‌వాలే..?

DC vs RR : ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు మిణుకుమిణుకుమంటున్న వేళ‌ ఢిల్లీ క్యాపిట‌ల్స్‌(Delhi Capitals) ఓపెన‌ర్లు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. టే అభిషేక్ పొరెల్(65), జేక్ ఫ్రేజ‌ర్ మెక్‌గుర్క్(50)లు రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌ను ఉతికారేస్తూ హాఫ్ సెంచ‌రీ బాదారు. దాంతో, ఢిల్లీ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 221 ర‌న్స్ చేసింది. ఓపెన‌ర్ల విధ్వంసంతో పంత్ సేన‌ భారీ స్కోర్ కొట్ట‌డం ఖాయ‌నుకున్న ద‌శ‌లో సీనియర్ స్పిన్న‌ర్లు అశ్విన్(3/24) తిప్పేశాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన‌ ట్రిస్ట‌న్ స్ట‌బ్స్‌(41) త‌న త‌ర‌హాలో విజృంభించి సిక్స‌ర్ల మోత మోగించాడు. గుల్బ‌దిన్ న‌యూబ్(19)తో 45 ర‌న్స్ జోడించి ఢిల్లీకి భారీ స్కోర్ అందించాడు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి శుభారంభం ద‌క్కింది కుర్ర‌ ఓపెన‌ర్ జేక్ ఫ్రేజ‌ర్ మెక్‌గుర్క్(50) ఉన్నంత సేపు విధ్వంసం సృష్టించాడు. బౌల్ట్ వేసిన తొలి ఓవ‌ర్లో ఒక‌టే ఫోర్ కొట్టినా.. ఆ త‌ర్వాత సందీప్ శ‌ర్మ‌, అవేశ్ ఖాన్‌ల‌ను ఉతికేశాడు. అవేశ్ వేసిన నాలుగో ఓవ‌ర్లో రెచ్చిపోయిన మెక్‌గుర్క్ వ‌రుస‌గా.. 4, 4, 4, 6, 4, 6 బాది హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఎడిష‌న్‌లో మూడోసారి 20 బంతుల్లోపే ఫిఫ్టీ బాదేశాడు. భీక‌ర ఫామ్‌లో ఉన్న మెక్‌గుర్క్‌ను స్పిన్ అస్త్రంతో శాంస‌న్ వెన‌క్కి పంపాడు. అశ్విన్ ఓవ‌ర్లో మెక్‌గుర్క్ క‌వ‌ర్ డ్రైవ్ ఆడి ఫెరారీ చేతికి చిక్కాడు. దాంతో, 60 ర‌న్స్ వ‌ద్ద ఢిల్లీ తొలి వికెట్ ప‌డింది.

అప్ప‌టిదాకా ప‌టిష్ట స్థితిలో ఉన్న ఢిల్లీ వ‌రుస‌గా వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వ‌చ్చిన షాహ్ హోప్() ద‌ర‌దృష్ట‌వ‌శాత్తూ ర‌నౌట్ కాగా.. అక్ష‌ర్ ప‌టేల్‌()ను అశ్విన్ బోల్తా కొట్టించాడు. 68కే రెండు వికెట్లు ప‌డిన వేళ‌.. ఓపెన‌ర్ అభిషేక్ పొరెల్(65) గేర్ మార్చి బౌండ‌రీతో చెల‌రేగాడు. కెప్టెన్ రిష‌భ్ పంత్(15)తో క‌లిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. ఇక‌.. ఆఖ‌ర్లో కుర్రాడు ట్రిస్ట‌న్ స్ట‌బ్స్(41) వీర‌విహారం చేశాడు. చాహ‌ల్ వేసిన 18వ‌ ఓవ‌ర్లో స్వీప్ షాట్ల‌తో మూడు ఫోర్లు, ఆఖ‌రి బంతికి సిక్స‌ర్ బాది 21 ర‌న్స్ పిండుకున్నాడు. గుల్బ‌దిన్‌(19)తో క‌లిసి 45 ర‌న్స్ జోడించారు. సందీప్ వేసిన 20వ ఓవర్లో సిక్స్ బాది ఢిల్లీకి భారీ స్కోర్ అందించాడు.

చాహ‌ల్@ 350

టీ20 వ‌ల‌ర్డ్ క‌ప్ స్క్వాడ్‌కు ఎంపికైన ఉత్సాహంలో చాహ‌ల్ మ‌రో ఫీట్ సాధించాడు. ఈ లెగ్ స్పిన్న‌ర్ పొట్టి ఫార్మాట్‌లో 350 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఢిల్లీ సార‌థి రిష‌భ్ పంత్ వికెట్ తీసి చాహ‌ల్ ఈ మైలురాయికి చేరువ‌య్యాడు.

2024-05-07T15:47:08Z dg43tfdfdgfd