CSK VS LSG | హ‌డ‌లెత్తిస్తున్న ల‌క్నో పేసర్లు.. వెనుదిరిగిన‌ సీఎస్కే ఓపెన‌ర్లు

CSK vs LSG : డిఫెండింగ్ చాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్‌(Chennai Super Kings)కు పెద్ద షాక్. ల‌క్నో పేస‌ర్ల ధాటికి ఆదిలోనే సీఎస్కే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(17), ర‌చిన్ ర‌వింద్ర‌(0)లు పెవిలియ‌న్ చేరారు. తొలుత మొహ్సిన్ ఖాన్ ఫామ్‌లో లేని ర‌వీంద్రను బౌల్డ్ చేసి ల‌క్నోకు బ్రేక్ ఇచ్చాడు.

ఆ షాక్ నుంచి తేరుకునే లోపే య‌శ్ ఠాకూర్ సూప‌ర్ బాల్‌తో గైక్వాడ్‌ను వెన‌క్కి పంపాడు. దాంతో, 33 ప‌రుగుల వ‌ద్ద సీఎస్కే రెండో వికెట్ పడింది. మ‌రో ఎండ్‌లో అజింక్యా ర‌హానే(24) ధాటిగా త‌న స్ట‌యిల్లో దంచుతున్నాడు. జ‌డేజా(1) మాత్రం ఆచితూచి ఆడుతున్నాడు. ఐదు ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోర్.. 42/2

2024-04-19T14:32:09Z dg43tfdfdgfd