CRICKET AUSTRALIA | ఆస్ట్రేలియా స్టార్ క్రికెట‌ర్ల‌కు షాక్.. సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ ద‌క్కింది వీళ్ల‌కే

Cricket Australia : ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ మార్కస్ స్టోయినిస్‌(Marcus Stoinis)కు షాక్ త‌గిలింది. టీ20 స్పెష‌లిస్ట్ అయిన అత‌డికి సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ ద‌క్క‌లేదు. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia) 2024-25కు ప్ర‌క‌టించిన కాంట్రాక్ట్ జాబితాలో స్టోయినిస్ పేరు లేదు. అత‌డితో పాటు మ‌రో న‌లుగురు స్టార్ ఆట‌గాళ్లు సైతం కాంట్రాక్ట్ కోల్పోయారు.

ఈ లిస్ట్‌లో ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్, అష్ట‌న్ అగ‌ర్, మైఖేల్ నెస‌ర్, మార్క‌స్ హ్యారిస్‌లు ఉన్నారు. మ‌రోవైపు ఐదురుగు యువ‌కెర‌టాలు జాక్‌పాట్ కొట్టారు. గ్జావియ‌ర్ బార్ట్‌లెట్, నాథ‌న్ ఎల్లిస్, అరోన్ హార్డీ, మాథ్యూ షార్ట్‌లు తొలిసారి సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ ద‌క్కించుకున్నారు. మొత్తంగా 23 మందికి క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ ప్ర‌క‌టించింది.

ఆస్ట్రేలియా సెంట్ర‌ల్ కాంట్రాక్లు జాబితా : సియాన్ అబాట్, గ్జావియ‌ర్ బార్ట్‌లెట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారి, ప్యాట్ క‌మిన్స్, నాథ‌న్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, అరోన్ హార్డి, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖ‌వాజా, ల‌బూషేన్, లియాన్, మిచెల్ మార్ష్, మ్యాక్స్‌వెల్, లాన్సె మోరిస్, టాడ్ మ‌ర్ఫీ, జై రిచ‌ర్డ్‌సన్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడం జంపా.

 

ఇక‌పై ఐదు టెస్టులు

భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ(Border Gavaskar Trophy) ఇక‌పై ఐదు టెస్టులు సిరీస్‌గా జ‌రుగ‌నుంది. ఈ విష‌యాన్ని కటించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా ఈమ‌ధ్యే ప్ర‌క‌టించింది. ఈ సిరీస్ షెడ్యూల్‌నూ కూడా వెల్లడించింది. నవంబర్‌ 22 నుంచి బోర్డ‌ర్ – గ‌వాస్కర్ ట్రోఫీ షురూ కానుంది. 2024 జనవరి 7 వ‌ర‌కూ సిరీస్ కొనసాగనుంది. తొలి టెస్టుకు పెర్త్‌ ఆతిథ్యమివ్వనుంది.

ఇవి కూడా చ‌ద‌వండి

2024-03-28T12:51:51Z dg43tfdfdgfd